అమెజాన్ నుంచి మహిళలకు అద్భుతమైన అవకాశం...గుజరాత్‌లో ప్రయోగం సఫలం...

భారత దేశంలోని చేతివృత్తులవారు, కళాకారుల ఉత్పత్తులను అమ్మడానికి ముందుకొచ్చిన ఈ సంస్థ.. ప్రస్తుతం కేవలం మహిళలతోనే నడిచే డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా గుజరాత్లోని కాడిలో ఆల్-ఉమెన్ డెలివరీ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు అమెజాన్ గురువారం ప్రకటించింది.

news18-telugu
Updated: September 18, 2020, 3:07 PM IST
అమెజాన్ నుంచి మహిళలకు అద్భుతమైన అవకాశం...గుజరాత్‌లో ప్రయోగం సఫలం...
Amazon (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరో సంస్కరణతో వార్తల్లో నిలిచింది. ఇంతకుముందే అమెజాన్ సహేలీ వంటి ప్రాజెక్టులతో భారత దేశంలోని చేతివృత్తులవారు, కళాకారుల ఉత్పత్తులను అమ్మడానికి ముందుకొచ్చిన ఈ సంస్థ.. ప్రస్తుతం కేవలం మహిళలతోనే నడిచే డెలివరీ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. తాజాగా గుజరాత్లోని కాడిలో ఆల్-ఉమెన్ డెలివరీ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు అమెజాన్ గురువారం ప్రకటించింది. డెలివరీ సర్వీస్ పార్టనర్ సహకారంతో ఈ యూనిట్ను నిర్వహిస్తున్నామని పేర్కొంది.

మహిలకు ఉపాధి అవకాశాలు

శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని అమెజాన్ తెలిపింది. డెలివరీ సర్వీస్ పార్టనర్ ప్రోగ్రామ్ కింద ఇలాంటి ప్రాజెక్టులను చేపడుతోంది. స్థానిక వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు, డెలివరీలను సులభతరం చేయడానికి తమ పార్ట్ నర్లతో కలిసి మరిన్ని యూనిట్లు నెలకొల్పనున్నట్టు అమెజాన్ చెబుతోంది. వీటి నిర్వహణకు అవసరమయ్యే సాంకేతిక సహకారాన్ని అమెజాన్ ఇండియా అందిస్తోంది. 2016లో చెన్నైలో అమెజాన్ తన మొట్టమొదటి ఆల్-ఉమెన్ డెలివరీ స్టేషన్ను భారతదేశంలో ప్రారంభించింది.

గుజరాత్ యూనిట్ ప్రత్యేకం

గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కు 50 కిలోమీటర్ల దూరంలో కాడి నగరం ఉంది. అక్కడి జనాభా 80,000. ఈ స్టేషన్ ను పూర్తిగా మహిళలే నిర్వహించనున్నారు. మేనేజ్మెంట్ వ్యవహాల నుంచి డెలివరీ అసోసియేట్ వరకు అందరూ మహిళలే ఇక్కడ పనిచేస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ ఎనిమిది మందిని నియమించారు. డెలివరీ స్టేషన్ నుంచి రెండు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన వారికి సాయం చేసేందుకు ఒక హెల్ప్ లైన్లు కూడా ఏర్పాటు చేశారు.

సమస్యలను పరిష్కరిస్తూ...

తమ సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచే దిశగా అమెజాన్ ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వారికి అవసరమయ్యే సౌకర్యాలు కల్పించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ద్వారా సంస్థలో వారికి ఎదుర్యే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుంది. తమ సంస్థలో మహిళలకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పరిచేస్తున్నామని అమెజాన్ ఇండియాలో లాస్ట్ మైల్ ఆపరేషన్స్ డైరెక్టర్ ప్రకాష్ రోచ్లాని చెబుతున్నారు. అమెజాన్ ఇండియాలో పనిచేసే మహిళల సంఖ్య 6,000 దాటిందని చెప్పారు. గుజరాత్లో తమ సంస్థ ఇప్పటి వరకు 200 మందికి పైగా మహిళలకు అవకాశాలను కల్పించిందని చెప్పారు.గతంలో ఒక డెలివరీ సంస్థ పార్ట్ నర్ షిప్ కేవలం ట్రాన్స్ జెండర్లతో నడిచే డెలివరీ స్టేషన్ ను గుజరాత్లో అమెజాన్ ఏర్పాటు చేసింది. గుజరాత్లోని తన నెట్ వర్క్ లో  సైన్యంలో పనిచేసి వచ్చిన వారికి, అంగవైకల్యం ఉన్నవారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ప్రకటించింది.
Published by: Krishna Adithya
First published: September 18, 2020, 3:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading