news18-telugu
Updated: August 11, 2020, 5:28 PM IST
రెండు రోజుల్లో 209 మంది కోటీశ్వరులయ్యారు... ఎలాగో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
వాళ్లంతా చిరు వ్యాపారులు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. అలాంటివారు రెండు రోజుల్లో ఎంత సంపాదించారో తెలుసా? కేవలం 48 గంటల్లో వాళ్లు కోటీశ్వరులయ్యారు. ఇలా ఏకంగా 209 మంది రెండు రోజుల్లో కోట్లు సంపాదించారు. దీనికి కారణం ఇటీవల అమెజాన్ భారతదేశంలో నిర్వహించిన ప్రైమ్ డే సేల్. అమెజాన్ ప్రతీ ఏటా ఈ సేల్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈసారి కూడా ఆగస్ట్ 6, 7 తేదీల్లో భారతదేశంలో ప్రైమ్ డే సేల్ నిర్వహించింది. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో నిర్వహించే సేల్కు కస్టమర్ల నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుందో అనుకున్నారు. కానీ ఈ రెండు రోజుల సేల్ భారతదేశంలో 209 సెల్లర్లను కోటీశ్వరుల్ని చేసింది. భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి మహిళా వ్యాపారులు, హస్త కళాకారులు, చేనేత కళాకారులు సహా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు నిర్వహించే 91,000 మంది ఈ సేల్‌లో పాల్గొనడం విశేషం. వీరిలో 62,000 మంది నాన్ మెట్రో, టైర్ 2, టైర్ 3 పట్టణాలకు చెందినవారే.
Loan: మీరు చిరు వ్యాపారులా? మోదీ ప్రభుత్వం లోన్ ఇస్తున్న లోన్‌కు అప్లై చేయండిలాPersonal Loan: క్రెడిట్ స్కోర్ తక్కువున్నా... లోన్ తీసుకోవచ్చు ఇలా
మొత్తం సెల్లర్స్‌లో 209 మంది కేవలం ఈ 48 గంటల సేల్‌లో కోటీశ్వరులయ్యారు. 4,000 మందికి పైగా వ్యాపారులు రూ.10 లక్షలకు పైనే సేల్స్‌తో రికార్డు సృష్టించారు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నవారి సంఖ్య కూడా రెట్టింపు అయిందని అమెజాన్ ఇండియా ప్రకటించింది. వీరిలో 65 శాతం మంది భారతదేశంలోని టాప్ 10 సిటీస్‌లో కాకుండా ఇతర ప్రాంతాలకు చెందినవారే.
Published by:
Santhosh Kumar S
First published:
August 11, 2020, 5:26 PM IST