Home /News /business /

AMAZON INDIA LAUNCHES MENTOR CONNECT PROGRAMME TO SUPPORT STARTUPS SS GH

Amazon Mentor Connect: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మెంటర్​ కనెక్ట్ ప్రోగ్రామ్​ను ప్రారంభించిన అమెజాన్

Amazon Mentor Connect: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మెంటర్​ కనెక్ట్ ప్రోగ్రామ్​ను ప్రారంభించిన అమెజాన్
(ప్రతీకాత్మక చిత్రం)

Amazon Mentor Connect: స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు మెంటర్​ కనెక్ట్ ప్రోగ్రామ్​ను ప్రారంభించిన అమెజాన్ (ప్రతీకాత్మక చిత్రం)

Amazon Mentor Connect | స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, మద్దతుగా నిలిచేందుకు అమెజాన్ మెంటార్ కనెక్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ స్టార్టప్‌లకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోండి.

స్టార్టప్​ సంస్థలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రముఖ ఇ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ ‘మెంటర్​ కనెక్ట్’ అనే​ కొత్త ప్రోగ్రామ్​ను ప్రారంభించింది. ఏప్రిల్​ 11న ప్రారంభమైన ఈ ప్రోగ్రామ్​ ఎంటర్​ప్రెన్యూర్స్​, ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​కు మధ్య వారధిగా నిలువనుంది. ఈ ప్రోగ్రామ్​ ద్వారా స్టార్టప్​ సంస్థలు​, అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లను మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది. ఇందుకు గాను ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​, అమెజాన్ లీడర్స్​తో నెట్‌వర్కింగ్ ఈవెంట్స్​, వన్ ఆన్ వన్ మెంటర్‌షిప్ సెషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. స్టార్టప్​లకు తోడ్పాటు అందించేందుకు ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక విద్యా సంస్థలకు చెందిన మెంటర్స్​, ఫైర్‌సైడ్ వెంచర్స్, డిఎస్‌జి కన్స్యూమర్ పార్ట్‌నర్స్, ఎలివేషన్ క్యాపిటల్, టుమారో క్యాపిటల్ ఇప్పటికే ఈ ప్రోగ్రామ్​లో రిజిస్ట్రేషన్​ చేసుకున్నాయి. ఇప్పటికే అమెజాన్ లాంచ్‌ప్యాడ్ ప్రోగ్రామ్‌లో చేరిన స్టార్టప్స్​​, అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లు ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​ నుంచి వివిధ మార్గాల ద్వారా గైడ్​లైన్స్​ పొందవచ్చు. మూడు నెలల కాలానికి గాను వీరు వివిధ స్టార్టప్​ సంస్థలకు మార్గదర్శకత్వం అందిస్తారు.

SBI Youth for India Fellowship 2021: డిగ్రీ పాస్ అయినవారికి గుడ్ న్యూస్... రూ.50,000 ఫెలోషిప్

BHEL Jobs 2021: బీహెచ్ఈఎల్‌లో 389 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు

స్టార్టప్​ సంస్థలు తమ బ్రాండ్​ను ఎలా విస్తరించుకోవాలనే అంశాలపై సెషన్లు నిర్వహిస్తారు. స్టార్టప్​ సంస్థల మధ్య పోటీ వాతావరణం ఏర్పర్చేందుకు అమెజాన్​ సంభవ్​ ఎంటర్​ప్రెన్యూర్​షిప్ ఛాలెంజ్​ను కూడా నిర్వహిస్తోంది. ఇండస్ట్రీ ఎక్స్​పర్ట్స్​ సలహాలు సూచనలు పాటించి తమ బ్రాండ్స్​ను విస్తరించుకున్న స్టార్టప్​ సంస్థలకు అమెజాన్​ సంభవ్​ సమ్మిట్​లో విజేతలను ప్రకటించి వారికి అదనపు ప్రయోజనాలను అందిస్తారు. "అమెజాన్ సంభవ్" రెండో ఎడిషన్​ను 2021 ఏప్రిల్ 15 నుండి 18 వరకు నిర్వహించనున్నారు. కాగా, అమెజాన్ లాంచ్‌ప్యాడ్ కింద ప్రస్తుతం 30 వేర్వేరు కేటగిరీల్లో 800 కి పైగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్లు భాగస్వామ్యం అయ్యాయి. ఈ బ్రాండ్లు 2 లక్షలకు పైగా ఉత్పత్తులను వివిధ అమెజాన్​లో అమ్ముతున్నాయి. ఇవి ప్రధానంగా హెల్త్​, పర్సనల్​ కేర్​, బ్యూటీ అండ్​ గ్రూమింగ్​, గ్రోసరీ, హోమ్​ ప్రోడక్ట్స్​కు చెందినవి కావడం విశేషం.

LIC New Jeevan Shanti Policy: ఒక్కసారి ప్రీమియం కడితే ప్రతీ నెలా అకౌంట్‌లోకి డబ్బులు

IIM Professor: నైట్ వాచ్‌మెన్ నుంచి ఐఐఎం ప్రొఫెసర్ వరకు... నెటిజన్లలో స్ఫూర్తిని రగిలిస్తున్న సక్సెస్ స్టోరీ

స్టార్టప్​ సంస్థలకు మరింత ప్రోత్సాహం


ఈ మెంటర్​ కనెక్ట్​ కార్యక్రమంపై అమెజాన్ ఇండియా ఎంఎస్‌ఎంఈ, సెల్లింగ్ పార్టనర్ ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ ప్రణవ్ భాసిన్​ మాట్లాడుతూ "స్టార్టప్​ కంపెనీలను ప్రోత్సహించడంలో భాగంగా భారత ప్రభుత్వం స్టార్టప్​ ఇండియా, మేకిన్​ ఇండియా కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాల ద్వారా ఎంటర్​ప్రెన్యూయర్లను ప్రోత్సహిస్తూ ఆత్మనిర్భర్ భారత్ వైపు అడుగులు వేస్తోంది. స్టార్టప్‌ కంపెనీ నిర్వాహకులు దాదాపు కొత్త వారే ఉంటారు. వారికి గొప్ప ఐడియాలు, స్ట్రాటజీలు ఉన్నప్పటికీ అనుభవలేమితో మొదట్లోనే నష్టాల్లోకి వెళ్తుంటారు. దీనికి చెక్​ పెట్టేందుకు అమెజాన్ తరఫున మెంటర్​ కనెక్ట్ ప్రోగ్రామ్​ను ప్రారంభించాం.”అని అన్నారు. కాగా, ఈ ప్రోగ్రామ్​పై ఫైర్ సైడ్ వెంచర్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రయాగ్ మొహంతి మాట్లాడుతూ ​‘‘స్టార్టప్​ సంస్థలు నెలకొల్పేవారు అట్టడుగు స్థాయి సవాళ్లను అర్థం చేసుకోవడానికి, మార్కెట్​ స్థితిగతులను బేరీజు వేసుకోవడానికి, సమస్యల పరిష్కార మార్గాలను గుర్తించడానికి ఈ ప్రోగ్రామ్​ ఉపయోగపడుతుంది. తద్వారా, కొత్త బ్రాండ్లు మార్కెట్​లోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా మార్కెట్​లో పోటీ వాతావరణం ఏర్పడి తక్కువ ధరలోనే నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి" అని అన్నారు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Amazon, AMAZON INDIA, Start-Up, Startups

తదుపరి వార్తలు