HOME » NEWS » business » AMAZON GREAT REPUBLIC DAY SALE ON JANUARY 20 HERE ARE BEST OFFERS AND DISCOUNTS BA

Amazon Republic Day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. జనవరి 20 నుంచే.. వీటిపై భారీ డిస్కౌంట్లు

కేవలం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లాంటివాటిపైనే కాకుండా గృహోపకరణాల మీద కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి.

news18-telugu
Updated: January 13, 2021, 11:00 PM IST
Amazon Republic Day Sale: అమెజాన్ రిపబ్లిక్ డే సేల్.. జనవరి 20 నుంచే.. వీటిపై భారీ డిస్కౌంట్లు
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
  • Share this:
కొత్త సంవత్సరంలో అమెజాన్ ఇండియా మరో సారి భారీ ఆఫర్లతో ముందుకొచ్చింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ తీసుకొచ్చింది. 2021 జనవరి 20 నుంచి జనవరి 23 వరకు ఈ సేల్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్లు ఓ రోజు ముందే రాత్రి 12 గంటల నుంచే ఈ సేల్ ఆఫర్లను పొందవచ్చు. రిపబ్లిక్ డే సేల్స్ సందర్భంగా అమెజాన్ కొన్ని స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, స్మార్ట్ టీవీ డీల్స్‌ను ప్రకటించింది. ఆఫర్‌తోపాటు sbi బ్యాంక్ క్రెడిట్ కార్డు, క్రెడిట్ ఈఎంఐల మీద అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే, బజాజ్ ఫిన్‌సర్వ్, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డు, అమెజాన్ పే లేటర్ కార్డులు, కొన్ని సెలక్ట్ చేసిన డెబిట్, క్రెడిట్ కార్డుల మీద కూడా అదనపు ఆఫర్లు ఉన్నాయి. సాధారణ కస్టమర్లతో పాటు బిజినెస్ కస్టమర్లు ఎక్స్‌క్లూజివ్‌గా 10వేల ఉత్పత్తుల మీద డిస్కౌంట్లు పొందవచ్చు. ల్యాప్ టాప్స్, హెడ్‌ఫోన్లు, నెట్ వర్క్ వస్తువులు, పర్సనల్ కంప్యూటర్ల మీద ఆఫర్లు ఉన్నాయి.

అదే సమయంలో అమెజాన్ ఎక్సేంజ్ ఆఫర్లు కడూా అందిస్తోంది. చాలా ఉత్పత్తుల మీద డిస్కౌంట్లు అందిస్తోంది. OnePlus 8T 5G, Samsung Galaxy M51, Redmi Note 9 Pro Max, Samsung Galaxy M31 Prime, iPhone 12 Mini లాంటి వాటిపై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అలాగే, OnePlus 8 5G, Samsung Galaxy M21, iPhone 7, Nokia 5.3, Xiaomi Redmi Note 9 లాంటి వాటిపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. మరోవైపు ల్యాప్‌టాప్‌ల మీద రూ.30,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హెడ్ ఫోన్స్ మీద 75 శాతం, ట్యాబెట్ల మీద 45 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. ఇక స్మార్ట్ ఫోన్ల మీద 70 శాతం, కొన్ని కెమెరా లమీద 60 శాత డిస్కౌంట్ లభించనుంది.

కేవలం స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్స్ లాంటివాటిపైనే కాకుండా గృహోపకరణాల మీద కూడా భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు కూడా తక్కువ ధరలకు లభించనున్నాయి. తాజాగా లాంచ్ చేసిన Sony Digital Vlog Z-1 కూడా ఆఫర్‌లో లభించనుంది. వీటితోపాటు రూటర్లు, కెమెరాలు, సౌండ్ బార్లు, మానిటర్లు కూడా డిస్కౌంట్‌లో లభిస్తాయి.
Published by: Ashok Kumar Bonepalli
First published: January 13, 2021, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading