HOME »NEWS »BUSINESS »amazon great republic day sale begins from january 20 here details ns

ఎల్లుండి నుంచే Amazon Great Republic Day Sale.. ఈ స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్లు.. వివరాలివే..

ఎల్లుండి నుంచే Amazon Great Republic Day Sale.. ఈ స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ పై భారీ ఆఫర్లు.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరో సారి భారీ సేల్ తో కస్టమర్ల ముందుకు వస్తోంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఈ నెల 20 నుంచి భారీ ఆఫర్లను కస్టమర్లకు అందించనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా మరో సారి భారీ సేల్ తో కస్టమర్ల ముందుకు వస్తోంది. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఈ నెల 20 నుంచి భారీ ఆఫర్లను కస్టమర్లకు అందించనుంది. స్మార్ట్ ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీగా ఆఫర్లను అందించనున్నారు. నాలుగు రోజుల పాటు కొనసాగుతున్న ఈ సేల్ జనవరి 23న ముగియనుంది. ప్రైమ్ సభ్యులకు మాత్రం ఈ సేల్ 24 గంటల ముందే మొదలవనుంది. జనవరి 19 నుంచే వారు ఈ ఆఫర్లను పొందే అవకాశాన్ని పొందుతారు. ఈ సేల్ లో SBI క్రెడిట్ కార్డుల ద్వారా షాపింగ్ చేస్తే 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందుతారు. Bajaj Finserv credit and debit cards ద్వారా షాపింగ్ చేస్తే నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందనున్నారు. అయితే రూ. 4500కు పైగా షాపింగ్ చేసిన వారికే ఈ సదుపాయం ఉంటుంది.

    భారీ ఆఫర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు ఇవే..


    -వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లపై భారీగా ఆఫర్లు అందించనున్నారు. ఈ సేల్ లో OnePlus 8T ఫోన్ల ప్రారంభ ధర రూ. 40,499 కాగా, OnePlus Nord 5G ప్రారంభ ధర రూ.27,999గా ఉండనుంది.
    -రూ.28,999 విలువ గల Galaxy M51 స్మార్ట్ ఫోన్ ఆఫర్లో రూ.20,999కే లభించనుంది.
    -Redmi 9 Pro Maxను రూ.14,999కే పొందొచ్చు.
    -రూ.69,990 ధర కలిగిన iPhone 12 miniని ఈ సేల్ లో రూ.59,990కే పొందొచ్చు.
    -రూ. 24,900 విలువైన AirPods Pro earbudsను ఈ ఆఫర్ లో రూ.20,999కే సొంతం చేసుకోవచ్చు.

    -టీవీలు, ఇతర గృహోపకరణాలపై సైతం భారీగా తగ్గింపులు ఉండనున్నాయి. Sony Bravia 55-inch 4K Smart LED TV, LG’s 43-inch 4K UHD Smart LED TVలపై భారీగా ఆఫర్లు ఉండనున్నాయి. Samsung 253 L Double Door Refrigeratorను ఆఫర్లో రూ. 23,350కే పొందొచ్చు.
    -ఈ సేల్ లో పుస్తకాలు, బొమ్మలు, ఆట వస్తువులపై 70 శాతం, ఫ్యాషన్ వస్తువులపై 80 శాతం తగ్గింపులు ఉండనున్నాయి.
    Published by:Nikhil Kumar S
    First published:January 18, 2021, 16:54 IST

    टॉप स्टोरीज