హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI instant discount offers: మీకు స్టేట్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ఉందా? అయితే.. Amazonలో మీకు లభించే స్పెషల్ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి

SBI instant discount offers: మీకు స్టేట్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డు ఉందా? అయితే.. Amazonలో మీకు లభించే స్పెషల్ డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

దసరాకు (Dussehra 2022) కొన్ని రోజుల ముందే ఈ కామర్స్ (E-Commerce) దిగ్గజాలైన అమెజాన్ (Amazon Great Indian Festival Sale), ఫ్లిప్ కార్ట్ (Flipkart Big Billion Days Sale) ఈ రోజు నుంచి ఆఫర్ల పండుగను ప్రారంభించాయి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచ్ లు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు, రిఫ్రిజిరేటర్లు, ఫ్యాషన్ ఐటెమ్స్ పై భారీగా డిస్కౌంట్ ప్రకటించాయి ఈ ఈ-కామర్స్ సంస్థలు. చాలా వస్తువులపై 50 శాతానికి పైగా డిస్కౌంట్ ప్రకటించడంతో వినియోగదారులు పోటీలు పడీ మరీ షాపింగ్ చేస్తున్నారు. చాలా ఐటెమ్స్ పై గతంలో ఎన్నడూ లేని విధంగా తగ్గింపు అందిస్తున్నాయి ఆయా ఈ కామర్స్ సంస్థలు. దీంతో షాపింగ్ జోరుగా సాగుతోంది. అయితే.. ఈ ఆఫర్లతో పాటు బ్యాంకు ఆఫర్లు (Bank Offers) సైతం భారీగా అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో షాపింగ్ చేసిన వారికి అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభించనుంది. దీంతో వినియోగదారుల డిస్కౌంట్ మరింతగా పెరగనుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఎస్బీఐ కార్డుతో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో షాపింగ్ చేసి మంచి డిస్కౌంట్ తో తక్కవ ధరలకే మీకు కావాల్సిన వస్తువులను సొంతం చేసుకోండి.

Flipkart Big Billion Days Sale: రూ.7 వేలకే స్మార్ట్ టీవీ.. ఫ్లిప్‌కార్ట్ సేల్ లో కనీవినీ ఎరగని ఆఫర్లు.. ఓ లుక్కేయండి

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ మరియు మొబైల్ యాక్ససరీలను కేవలం రూ.149 ప్రారంభ ధర నుంచే కొనుగోలు చేయొచ్చు. బడ్జెట్ మొబైల్స్ రూ.5999 నుంచే అందుబాటులో ఉన్నాయి.ప్రముఖ కంపెనీల ట్రిమ్మర్లు రూ.600 నుంచే అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ బ్రాండ్ కు చెందిన మాస్కులు, టీషర్ట్ లు, సాక్స్ లు రూ.99 నుంచే అందుబాటులో ఉన్నాయి.

First published:

Tags: Dussehra 2022, E-commerce

ఉత్తమ కథలు