Alexa Combo offers: Amazon Great Indian Festival సేల్స్‌లో అలెక్సా కాంబో ఆఫర్లు..

Amazon: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... (image: Amazon India)

త్వరలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానున్న తరుణంలో.. అలెక్సా కాంబో ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. స్మార్ట్‌ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్ ఆఫర్‌గా అందించనుంది. అలెక్సాలో రానున్న సరికొత్త కాంబో ప్రొడక్ట్స్ ఏవో తెలుసుకుందాం.

  • Share this:
Amazon Great Indian Festival: అమెజాన్‌కు చెందిన వాయిస్ అసిస్ట్ సర్వీస్ అలెక్సాను ఇటీవల కాలంలో చాలా మంది వినియోగిస్తున్నారు. రానున్న కాలంలో ఈ టెక్నాలజీ యూజర్లు మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానున్న తరుణంలో.. అలెక్సా కాంబో ఆఫర్లను ప్రకటించింది అమెజాన్. స్మార్ట్‌ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్ ఆఫర్‌గా అందించనుంది. అలెక్సాలో రానున్న సరికొత్త కాంబో ప్రొడక్ట్స్ ఏవో తెలుసుకుందాం.

ఎకో డాట్, విప్రో 9వాట్ ఎల్ఈడీ స్మార్ట్ కలర్ బల్బ్ కాంబో ఆఫర్
మూడోతరం అలెక్సా ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్, విప్రో 9 వాట్ల స్మార్ట్‌ కలర్ బల్బ్‌ను అమెజాన్‌ కాంబో ఆఫర్‌గా అందిస్తోంది. కాంపాక్ట్ డిజైన్‌తో వచ్చిన ఎకో డాట్ స్పీకర్‌ను.. సంగీతం, వార్తలు, సమాచారం, ఇంట్లో ఉండే స్మార్ట్ హోం డివైజెస్ కంట్రోల్స్ తదితర విషయాల గురించి అడగవచ్చు. మీరు మాట్లాడే విధానం, వకాబులరీకి అనుగుణంగా ఇది పనిచేస్తుంది. ఈ లైట్ వెయిట్ స్పీకర్ కేవలం 300 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఫైర్ ఓఎస్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజెస్ తో పాటు మీ వెబ్ బ్రౌజర్ నుంచి కూడా దీన్ని యాక్సెస్ చేయవచ్చు.

విప్రో స్మార్ట్ బల్బ్‌ను విప్రో స్మార్ట్ యాప్ లేదా అలెక్సాను ఉపయోగించి వాయిస్ కంట్రోల్‌తో ఎక్కడి నుంచైనా నియంత్రించవచ్చు. ఈ ఎల్ఈడీ స్మార్ట్ బల్బ్ 16 మిలియన్ల విభిన్న రంగులను డిస్‌ప్లే చేస్తుంది.

ఫైర్ టీవీ స్టిక్, విప్రో 9 వాట్ల ఎల్ఈడీ స్మార్ట్ కలర్ బ్లల్బుతో ఎకో డాట్ కాంబో..
ఈ కాంబో ఆఫర్‌లో మూడోతరం అలెక్సా స్మార్ట్ స్పీకర్, ఫైర్ టీవీ స్టిక్, విప్రో 9 వాట్ల ఎల్ఈడీ స్మార్ట్ బల్బు ఉన్నాయి. ఎకో డాట్ అనేది అమెజాన్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ స్పీకర్లలో ఒకటి. అంతేకాకుండా ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో పనిచేస్తుంది. బిల్లులు చెల్లించడం, సంగీతం ప్లే చేయడం, వాతావరణం, క్రికెట్ స్కోర్, నర్సరీ రైమ్స్, కథలు లాంటి విషయాల గురించి అలెక్సాను అడగవచ్చు. ఇంటిని స్మార్ట్ గా చేయడం, లైట్లు, ఇతర డివైజెస్ ను నియంత్రించడానికి మీ వాయిస్‌ను ఉపయోగించవచ్చు.

ఫుల్ హెచ్‌డీ ఫాస్ట్ స్ట్రీమింగ్ విషయంలో మూడో తరం అమెజాన్ ఫైర్‌స్టిక్.. పాత డివైజ్‌ల కంటే 50 శాతం ఎక్కువ శక్తివంతమైనది. ఇది పవర్, వాల్యూమ్ బటన్‌లతో వస్తుంది. ఇందులో అలెక్సా వాయిస్ రిమోట్‌ కూడా ఉంటుంది. దీని ద్వారా మీ టీవీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, వార్తలు, క్రీడలు, పిల్లల కంటెంట్‌ను నేరుగా ప్రసారం చేసుకోవచ్చు. విప్రో స్మార్ట్ బల్బ్‌.. విప్రో నెక్ట్స్‌ స్మార్ట్ యాప్‌ లేదా అలెక్సా ద్వారా పనిచేస్తుంది. వాయిస్ కంట్రోల్‌తో దీన్ని ఎక్కడి నుండైనా నియంత్రించవచ్చు.

అమెజాన్ 6ఏ స్మార్ట్ ప్లగ్, క్లాక్ బండిల్ తో పాటు వస్తున్న ఎకో డాట్..
ఈ నాలుగోతరం ఎకో డాట్ గోళాకార డిజైన్ ఉన్న గడియారంతో అందుబాటులోకి వచ్చింది. దీని ముందు తరం ఎకో స్పీకర్లతో పోలిస్తే బాస్ పర్ఫార్మెన్స్ మెరుగుపడింది. ఇంగ్లీష్, హిందీ భాషల్లో పనిచేసే ఈ అలెక్సా స్పీకర్ అమెజాన్ ప్రైమ్, స్పాటిఫై, జియో సావన్, గానా లేదా యాపిల్ మ్యూజిక్ నుంచి మీకు ఇష్టమైన భాషలో మిలియన్ల పాటలను వినిపిస్తుంది. స్మార్ట్ ప్లగ్ సహా స్మార్ట్ డివైజ్, పరికరాలను వాయిస్‌తో కంట్రోల్ చేయవచ్చు.

అమెజాన్ స్మార్ట్ ప్లగ్ అలెక్సాతో పనిచేస్తుంది. ఏ సాకెట్‌కు అయిపా వాయిస్ కంట్రోల్ ఇస్తుంది. దీన్ని సెట్ చేయడం కూడా చాలా సులభం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ప్లగ్‌కు కనెక్ట్ చేయడమే. అనంతరం అలెక్సా యాప్ నుంచి ఏదైనా ఎకో డాట్ స్పీకర్ ఉపయోగించి మీ వాయిస్‌తో కంట్రోల్ చేయవచ్చు.

అమెజాన్ 6ఏ స్మార్ట్ ప్లగ్ తో ఎకో ఫ్లెక్స్ బండిల్..
ఎకో ఫ్లెక్స్, అమెజాన్ స్మార్ట్ ప్లగ్ ఈ కాంబోలో వచ్చాయి. మీ డివైజెస్‌ను నియంత్రించే ఎకో స్పీకర్లకు వాయిస్ కంట్రోల్స్ ను జోడించేందుకు అమెజాన్ స్మార్ట్ ప్లగ్ సహాయపడుతుంది. మీ స్మార్ట్ హోం డివైజెస్ ను నియంత్రించడానికి ఇంట్లో అన్ని ప్రదేశాల్లో అమర్చేలా ఎకో ఫ్లెక్స్ డిజైన్‌ను రూపొందించారు. మీ ఫోన్ ఛార్జ్ చేసుకోవడానికి కూడా దీని యూఎస్బీ పోర్ట్ ఉపయోగించవచ్చు. ప్రైవసీ కంట్రోల్స్ కు సంబంధించి మల్టిపుల్ లేయర్స్ ఇందులో ఉన్నాయి. మైక్రోఫోన్ ఆఫ్ బటన్ ద్వారా ఎలక్రానికల్ గా మైక్రో ఫోన్ ను డిస్ కనెక్ట్ చేయవచ్చు.

అమెజాన్ స్మార్ట్ ప్లగ్ అలెక్సాతో పనిచేస్తుంది. అంతేకాకుండా ఏదైనా సాకెట్ కు వాయిస్ కంట్రోల్ ను అందిస్తుంది. దీన్ని సెట్ చేయడం కూడా సులభం. మీ డివైజ్ ను ప్లగ్ కనెక్ట్ చేసి అనంతరం అలెక్సా యాప్ నుంచి లేదా ఎకో డాట్ స్పీకర్ ఉపయోగించి మీ వాయిస్ తో కంట్రోల్ చేయవచ్చు.
Published by:Krishna Adithya
First published: