AMAZON FOUNDER JEFF BEZOS HITS WEALTH RECORD OF 211 BILLION DOLLARS ON PENTAGON MOVE SK
Jeff Bezos Wealth: రూ. 1,56,98,97,00,00,000.. ఆల్‌టైం రికార్డు స్థాయికి అమెజాన్ వ్యవస్థాపకుడి సంపద
జెఫ్ బెజోస్
Jeff Bezos Net worth: జనవరిలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 210 బిలియన్ డార్లకు చేరుకుంది. ఇప్పటి వరకు అదే రికార్డు. తాజాగా ఆ రికార్డును అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బద్దలుకొట్టారు.
ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థపాకుడు జెఫ్ బెజోస్ ఆస్తులు మరింతగా పెరిగాయి. ఆయన సంపద ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. ఇంకెవరికీ సాధ్యం కానంతగా ఆయన ఆస్తులు పెరిగిపోతున్నాయి. బుధవారం అమెజాన్ షేర్లు 4.7 శాతం పెరగడంతో ఆయన నికర ఆస్తుల విలువ 211 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో దాని విలువ రూ.1,56,98,97,00,00,000. అంటే 15.69 లక్షల కోట్లు. మైక్రోసాఫ్ట్ సంస్థతో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్టును రద్దుచేసుకున్నట్లు పెంటగాన్ ప్రకటించడంతో అమెజాన్ షేర్లు దూసుకెళ్లాయి. నిన్న ఒక్క రోజే అమెజాన్‌కు 8.4 బిలియన్ డాలర్ల లాభం వచ్చింది. ఈ దెబ్బకు జెఫ్ బెజోస్ మొత్తం ఆస్తుల విలువ ఎక్కడికో వెళ్లిపోయింది. ఏకంగా 211 బిలియన్ డాలర్లకు చేరింది. గతంలో ఎవరూ ఈ మార్క్‌ను చేరుకోలేదు. జనవరిలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆస్తుల విలువ 210 బిలియన్ డార్లకు చేరుకుంది. ఇప్పటి వరకు అదే రికార్డు. తాజాగా ఆ రికార్డును అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ బద్దలుకొట్టారు.
గత జనవరిలో టెస్లా షేర్ల విలువ అనూహ్యంగా పెరగడంతో బెజోస్ నంబర్ వన్ స్థానాన్ని మస్క్ చేజిక్కించుకున్నారు. దాదాపు ఆరు వారాల తర్వాత టెస్లా షేర్లు పడిపోవడంతో బెజోస్ మళ్లీ నెంబర్ వన్ స్థానానికి వెళ్లారు. అంతేకాదు మార్చ్ నెల మధ్య నుంచి అమెజాన్ షేర్లు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటి వరకు 20శాతం వరకు వృద్ధి నమోదు చేయడంతో జెఫ్ బెజోస్ ఖాతాకు భారీగా సంపద వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుల జాబితాలో జెఫ్ బెజోసే మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. ఇక మంగళవారం టెస్లా షేర్లు పడిపోవడంతో ఎలన్ మస్క్ ఆస్తులు 180.80 బిలియన్లకు డార్లకు పడిపోయాయి. జెఫ్ బెజోస్ తర్వాత ఆయన రెండో స్థానంలో ఉన్నారు. 168.6 బిలియన్ డాలర్ల ఆస్తులతో ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ అర్నాల్ట్ మూడో స్థానంలో ఉన్నారు.
కాగా, జులై 5న అమెజాన్ సీఈఓ బాధ్యతల నుంచి జెఫ్ బెజోస్ తాజాగా వైదొలిగారు. ఆయన వారసుడిగా జెఫ్ బెజోస్ స్థానంలో అమెజాన్ వెబ్ సర్వీస్ హెడ్ ఆండీ జెస్సీ నియమితులయ్యారు. ఇక జెఫ్ బెజోస్ అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కాబోతున్నారు. ఆ కంపెనీలో అతిపెద్ద వాటాదారుగానూ కొనసాగనున్నారు. సంస్థ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న సందర్భంగా.. తన సరికొత్త ప్రయాణం గురించి ఉత్సహాంగా ఉన్నట్టు బెజోస్ తెలిపారు.
77 ఏళ్ల బెజోస్ 1994లో అమెజాస్‌ను స్థాపించారు. ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు ఈ సంస్థను ప్రారంభించారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే దిగ్గజ సంస్థగా నిలిచింది. అంతేకాదు బెజోస్ ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ప్రస్తుతం అమెజాన్ ఆస్తుల విలువ 1.7 ట్రిలియన్ డాలర్లు. కొత్త సీఈవోగా బాధ్యతలు తీసుకోనున్న ఆండీ జెస్సీ.. 1997లో అమెజాన్‌లో మార్కెటింగ్ మేనేజర్‌గా చేరారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. 2003లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటులో జెస్సీ కీలక భూమిక పోషించారు. మొన్నటి వరకు అమెజాన్ వెబ్ సర్వీసెస్ హెడ్‌గా ఉన్న ఇప్పుడు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.