అమెరికాలో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోవడం.. యూఎస్ మాంద్యంలోకి జారుకుంటుందనే భయం వల్ల అనేక బిగ్ టెక్ కంపెనీలు(Companies) ఖర్చు తగ్గించుకునేందుకు భారీ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తమ కార్యకలాపాలను తగ్గించడం, ఉద్యోగులను తొలగించడం చేస్తున్నాయి. అమెరికన్ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) కూడా ఇదే బాట పట్టింది. ఈ కంపెనీ ఖర్చు తగ్గించే అంశాలపై ఇంటర్నల్ రివ్యూను ప్రారంభించింది. నష్టాలను తెచ్చే బిజినెస్(Business) యూనిట్లపై కంపెనీ దృష్టి సారించనుందని నవంబర్ 10న ఒక నివేదిక తెలిపింది. అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆండీ జాస్సీ నేతృత్వంలో ఈ రివ్యూ(Review) జరుగుతోంది. అతను లాభాల్లోకి రాని సబ్-ఎంటిటీల పనితీరును అంచనా వేస్తున్నట్లు సమాచారం.
అమెజాన్ లాభదాయకం కాని కొన్ని యూనిట్లలో పని చేస్తున్న సిబ్బందిని తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీరందరినీ తన కంపెనీలోనే వేరే చోట ఉద్యోగాలు వెతుక్కోవాలని అమెజాన్ యాజమాన్యం కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. ఎందుకంటే వారు ప్రస్తుతం ఆన్‌బోర్డ్‌లో ఉన్న టీమ్‌లను క్లోజ్ చేస్తున్నారు లేదా సస్పెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రోబోటిక్స్, రిటైల్ స్టోర్ యాక్టివిటీస్ వంటి రంగాల టీమ్‌లలోని ఉద్యోగులను కంపెనీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని కోరుతున్నారు.
* ఆ ప్రాజెక్టులపై సమీక్ష
అమెజాన్ తన డివైజ్ డివిజన్, లాజిస్టిక్స్ యూనిట్స్‌పై ప్రస్తుత ఖర్చు తగ్గింపు సమీక్షలో దృష్టి సారిస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అమెజాన్ తన అలెక్సా బిజినెస్‌ను కూడా చాలా దగ్గరగా గమనిస్తోంది. ప్రస్తుతం వాయిస్ అసిస్టెంట్‌కి కొత్త ఫీచర్స్ యాడ్ చేయాలా వద్దా అని ఆలోచనలు చేస్తోంది. అసిస్టెంట్‌కి కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం వల్ల ఎక్కువ పెట్టుబడి అవసరమవుతుందని.. కస్టమర్లు దీనిని కొన్ని ఫంక్షన్‌ల కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. అలెక్సాను తయారు చేసే యూనిట్ సంవత్సరానికి 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆపరేటింగ్ లాస్ నమోదు చేసిందని ఒక రిపోర్టు వెల్లడించింది.
అయితే అసాధారణ స్థూల-ఆర్థిక వాతావరణం కారణంగా రాబోయే కొన్ని నెలల పాటు కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌కి నియామకాలను ఆపేస్తామని అమెజాన్ గత వారం తెలిపింది. "లాభాలను తీసుకురాని అనేక వస్తువులతో ప్రయోగాలు చేయడం, వాటిని అమలు చేయడం ఇకపై అమెజాన్ భరించలేని పని" అని గ్లోబల్‌డేటా విశ్లేషకుడు నీల్ సాండర్స్ కొద్ది రోజుల క్రితం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఖర్చు తగ్గింపుల సమీక్షకు అమెజాన్ శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
* ఇతర కంపెనీలు కూడా..
మరోవైపు, ఖర్చు తగ్గించుకునే ప్లాన్స్ లో భాగంగా ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్‌లు నవంబర్ 9న 11,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించాయి. ఇది మొత్తం వర్క్‌ఫోర్స్‌లో దాదాపు 13 శాతం. కొత్త నియామకాలపై విధించిన ఫ్రీజ్‌ను పొడిగించాలని కూడా కంపెనీ ఆలోచిస్తోంది. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కూడా రీసెంట్‌గా 3,700 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.