Amazon TV Stick: అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ లాంచ్​.. మీ టీవీని స్మార్ట్​టీవీగా మార్చుకోండి

ప్రతీకాత్మక చిత్రం

Amazon TV Stick: ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్​ కొత్త ఫైర్​ టీవీ స్టిక్​ను లాంచ్​ చేసింది. ఫైర్​ టీవీ స్టిక్ 4కె మాక్స్​ (Fire TV Stick 4K Max) పేరుతో ఇది భారత మార్కెట్​లోకి విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్​లో అమ్మకానికి వచ్చింది.

  • Share this:
ఈ-కామర్స్​ దిగ్గజం అమెజాన్ (Amazon)​ కొత్త ఫైర్​ టీవీ స్టిక్​ను లాంచ్​ చేసింది. ఫైర్​ టీవీ స్టిక్ 4కె మాక్స్​ (Fire TV Stick 4K Max) పేరుతో ఇది భారత మార్కెట్​లోకి విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (Great Indian Festival) సేల్​లో అమ్మకానికి వచ్చింది. అమెజాన్​ నుంచి ఇప్పటివరకు విడుదలైన అన్ని ఫైర్ టీవీ స్టిక్స్​లో కెల్లా ఇదే అత్యంత శక్తిమంతమైన స్ట్రీమింగ్​ స్టిక్​గా కంపెనీ పేర్కొంది. ఇది Wi-Fi 6 కనెక్టివిటీతో వస్తుంది. డాల్బీ విజన్ ప్లేబ్యాక్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫైర్ టీవీ స్టిక్ 4K మాక్స్ ఉన్న వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)తో సహా ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్స్​లోని 4K కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు.

IMPS Transaction: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి అలర్ట్... లిమిట్ పెంచిన ఆర్‌బీఐ

* ధర, సేల్స్​ వివరాలు

భారతదేశంలో అమెజాన్​ ఫైర్​ టీవీ 4కె మాక్స్​ రూ. 6,499 ధర వద్ద విడుదలైంది. అమెజాన్​ ఫెస్టివల్​ సేల్​లో దీన్ని ఆఫర్​ కింద కొనుగోలు చేయవచ్చు. లేదంటే అమెజాన్ కియోస్క్‌ మాల్​లో కూడా కొనుగోలు చేయవచ్చు.

PM Kisan: పీఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారా ? 10వ విడత డబ్బులు పడేది అప్పుడే..

* అమెజాన్​ ఫైర్​ టీవీ 4K మాక్స్​ స్పెసిఫికేషన్లు

అమెజాన్ ఫైర్ టీవీ 4 కె మాక్స్ గతంలో లాంచ్​ అయిన ఫైర్ టీవీ స్టిక్ 4 కె కంటే 40 శాతం ఎక్కువ శక్తిమంతమైనదిగా కంపెనీ పేర్కొంది. ఇందులో మీడియాటెక్​ ఎంటీ 8696 ప్రాసెసర్​ను అందించారు. ఇది 2 జీబీ ర్యామ్​, 8 జీబీ స్టోరేజ్​తో వస్తుంది. ఇందులో వైఫై కనెక్టివిటీని కూడా అందించింది. దీంతో పాటు బ్లూటూత్​ వీ 5.0, డాల్బీ విజన్​, డాల్బీ అట్మాస్​ లకు సపోర్ట్​ చేయనుంది. దీని సహాయంతో బ్లూటూత్​ స్పీకర్లు, హెడ్​ ఫోన్లు, వీడియో గేమ్​ కంట్రోలర్లు వంటి వాటిని కనెక్ట్ చేసుకోవచ్చు.

Reliance Trends: బతుకమ్మతో సెల్ఫీ పంపండి... రూ.1,500 గిఫ్ట్ కార్డ్ గెలుచుకోండి

మూడో తరం అలెక్సా రిమోట్​ను కూడా ఈ స్టిక్​తో పాటు అందించనున్నారు. ఈ అలెక్సా రిమోట్​ మార్చిలో లాంచ్​ అయ్యింది. దీనిలో అమెజాన్​ ప్రైమ్​ వీడియో, అమెజాన్​ మ్యూజిక్​, నెట్​ఫ్లిక్స్​లకు ప్రత్యేకమైన బటన్లను అందించింది.
Published by:Shiva Kumar Addula
First published: