Amazon నుంచి ఇకపై ఆఫ్ లైన్ స్టోర్స్...భారీగా ఉపాధి అవకాశాలు...

అమెజాన్ ఈజీ స్టోర్ ఫార్మాట్‌ను విడుదల చేసింది. అమెజాన్ ఈజీ అనేక సేవలకు సింగిల్ టచ్ పాయింట్ గా పనిచేస్తుంది. అమెజాన్ ఈజీ ఫార్మాట్‌లో, ప్రజలకు Touch & Feel అవకాశం లభిస్తుంది.

news18-telugu
Updated: August 10, 2020, 3:34 PM IST
Amazon నుంచి ఇకపై  ఆఫ్ లైన్ స్టోర్స్...భారీగా ఉపాధి అవకాశాలు...
Amazon India (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈజీ స్టోర్ ఫార్మాట్‌ను విడుదల చేసింది. అమెజాన్ ఈజీ అనేక సేవలకు సింగిల్ టచ్ పాయింట్ గా పనిచేస్తుంది. అమెజాన్ ఈజీ ఫార్మాట్‌లో, ప్రజలకు Touch & Feel అవకాశం లభిస్తుంది. దీనిలో వస్తువుల ప్రదర్శన జరుగుతుంది. అమెజాన్ ఫార్మాట్ లో ఇది చాలా వినూత్నమైనది ఎందుకంటే చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌లో సౌకర్యంగా ఫీల్ అవ్వడం లేదు. ఎందుకంటే వారు ఉత్పత్తిని చూడలేరు. అలాగే దాన్ని టచ్ చేసి చూసే అనుభూతి చెందలేరు. ఇప్పుడు అలాంటి ఫిర్యాదులకు అమెజాన్ ఈజీ స్టోర్ ద్వారా ఒక సమాధానం ఇవ్వనుంది. అమెజాన్ ఈజీ స్టోర్ నుండి, వినియోగదారులు ఏదైనా వస్తువుల కోసం ఆర్డర్ ఇవ్వవచ్చు. ఈ స్టోర్ లో గైడెడ్ అసిస్టెంట్ ద్వారా సహాయం పొందవచ్చు. ఈ రకమైన ఈజీ స్టోర్ నుండి వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. లేదంటే అక్కడ నుంచే తీసుకోవచ్చు. లేదా దాన్ని హోం డెలివరీ పొందవచ్చు.

ఇలాంటి అమెజాన్ దుకాణాలు దేశవ్యాప్తంగా తెరుస్తామని తెలిపారు. కంపెనీ పాత, కొత్త నెట్‌వర్క్ భాగస్వాములతో కలిసి ఈ వ్యాపారం ప్రారంభిస్తామని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ & మార్కెటింగ్) కిషోర్ తోటా తెలిపారు. అమెజాన్ యొక్క ఈజీ స్టోర్ ఆన్‌లైన్ షాపింగ్‌ను ఆకర్షించడంలో సహాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే స్థానిక స్థాయిలో ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా ఇది ఎంతో సహాయపడుతుందని అన్నారు.
Published by: Krishna Adithya
First published: August 10, 2020, 3:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading