మీకు ఉద్యోగం లేదా? చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారా? ఒకవేళ ఉద్యోగం చేస్తున్నా జీతం సరిపోవడం లేదా? ఐతే రోజుకు 4 గంటల పాటు పనిచేస్తూ.. నెలకు ఈజీగా 60వేలు సంపాదించే మార్గం ఒకటుంది. ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అందిస్తోంది. ఇందులో మీరు పార్ట్‌టైమ్‌గా పనిచేస్తూ.. పెద్ద మొత్తంలో ఆదాయం పొందవచ్చు. ఈ రోజుల్లో ఆన్‌లైన్ షాపింగ్ (Online Shopping) క్రేజ్ చాలా పెరుగుతోంది. చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువుల వరకు.. ఏం కావాలన్నా ఆన్‌లైన్లోనే షాపింగ్ చేస్తున్నారు. అందువల్ల ఈ కామర్స్ సంస్థలకు ప్రతి ఏరియాలో డెలివరీ బాయ్స్ (Delivery Boys) పెద్ద సంఖ్యలో అవసరం. డెలివరీ బాయ్స్ అమెజాన్ (Amazon) వేర్‌హౌస్ నుంచి పార్శిల్‌ను తీసుకొని.. వాటిని బుక్ చేసిన వారికి డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక డెలివరీ బాయ్ ఒక రోజులో 100 నుంచి 150 ప్యాకేజీల వరకు డెలివరీ చేయొచ్చు.
బైక్, స్కూటర్లపై బంపరాఫర్లు.. 5.5 శాతానికే రుణం, 1 ఈఎంఐ కట్టక్కర్లేదు.. ఆ చార్జీలు మాఫీ!
ఢిల్లీలో అమెజాన్‌కు దాదాపు 20 కేంద్రాలు ఉన్నాయి. ఢిల్లీతో పాటు చెన్నై, హైదరాబాద్ , ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి పెద్ద పెద్ద నగరాల్లో తమ కేంద్రాలను ప్రారంభించింది. అక్కడి నుంచి ప్యాకేజీలను తీసుకొని సరైన అడ్రస్‌కు చేరవేయడమే డెలివరీ బాయ్స్ పని. ఇందుకోసం రోజంతా పనిచేయాల్సిన అవసరం లేదు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు.. మీకు వీలైన సమయంలోనే డెలివరీ చేయొచ్చు. ఢిల్లీకి చెందిన డెలివరీ బాయ్‌లు రోజుకు 4 గంటల్లో 100 ప్యాకేజీల వరకు డెలివరీ చేస్తారని చెప్పారు. దీని కోసం మీకు ప్రత్యేక డిగ్రీ అవసరం లేదు. ఒక బైక్ , లైసెన్స్ ఉంటే చాలు. మీరుండే ప్రాంతంపై చక్కటి అవగాహన కలిగి ఉంటే.. తక్కువ సమయంలో ఎక్కువ ప్యాకేజీలను డెలివరీ చేయొచ్చు.
డెలివరీ బాయ్స్ ఉద్యోగం కోసం Amzon flex అప్లికేషన్‌లో దరఖాస్తు చేయవచ్చు. డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ.. నెలకు 60,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. వీరికి సుమారు 15 వేల రూపాయల ఫిక్స్‌డ్ శాలరీ ఉంటుంది. ఇది కాకుండా ప్రతి డెలివరీపై 10 నుంచి 15 రూపాయలు అదనంగా పొందుతారు. డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ ప్రకారం.. ప్రతిరోజూ 100 ప్యాకేజీల చొప్పున డెలివరీ చేస్తే.. నెలకు రూ. రూ. 55000 నుంచి రూ.60వేల వరకు ఈజీగా సంపాదించవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Business, Business Ideas, Deliver Boys