ఈ-కామర్స్‌లో తనదైన ముద్ర వేసిన అమెజాన్ (Amazon) ఇప్పుడు భారత్(India)లో ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సేవలను ప్రారంభిస్తోంది. అమెరికా, యూరోప్ తరువాత భారత్‌లోనే సేవలు అందించాలని ఈ కంపెనీ నిర్ణయించింది. భారత్‌లో Amazon.com Inc. ప్రారంభించబోయే ఎయిర్ కార్గో సేవలను నాలుగు నగరాల్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైల్లో షిప్‌మెంట్‌లను ప్రారంభించడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌లో సేవలు ప్రారంభించడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భాగ్యనగరంతో అమెజాన్ లవ్ స్టోరీ కొనసాగుతోందని ట్వీట్ చేశారు.
* క్విక్‌జెట్‌తో భాగస్వామ్యం
మన దేశంలో కార్గో సేవలు అందించేందుకు క్విక్‌జెట్ కార్గోతో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. బెంగళూరుకు చెందిన ఫ్రైట్ క్యారియర్ అయిన క్విక్‌జెట్ కార్గో ఎయిర్‌లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న బోయింగ్ 737-800 విమానంలో కార్గో సామర్థ్యాన్ని అమెజాన్ ఉపయోగిస్తుందని ఆ సంస్థ కస్టమర్ ఫుల్‌ఫీల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు.
* మూడవ మార్కెట్ భారత్
అమెజాన్ ఎయిర్‌ను 2016లో ఆ కంపెనీ ప్రారంభించింది. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ సేవలపై కంపెనీ దృష్టి పెట్టింది. తొలుత అమెరికా, యూరప్‌లో మాత్రమే సేవలు అందించింది. క్రమంగా లాభాల బాట పట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు తొలిసారిగా ఆసియా దేశమైన భారత్‌లోకి అడుగుపెట్టింది. అమెజాన్ ఎయిర్ అడుగుపెట్టిన మూడవ మార్కెట్‌గా భారత్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా ప్రదేశాలకు వెళ్లే 110కి పైగా జెట్‌ల నెట్‌వర్క్‌ను అమెజాన్ మెయింటైన్ చేస్తోంది.
* ప్రముఖ సంస్థలకు సవాలు
2016లో కార్గో రంగంలోకి అడుగుపెట్టిన Amazon అనతి కాలంలోనే వృద్ధిని నమోదు చేసింది. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్న ప్రముఖ కార్గో సేవలకు పోటీగా నిలిచింది. యునైటెడ్ పార్సెల్ సర్వీస్ ఇంక్., ఫెడ్‌ఎక్స్(FedEx) వంటి సంస్థలకు అమెజాన్ ఓ సవాలుగా నిలిచింది. Amazon Air దాని గిడ్డంగులకు దగ్గరగా ఉన్న చిన్న ప్రాంతీయ విమానాశ్రయాలను మేనేజ్ చేయడం కూడా ఆ సంస్థ వృద్ధికి ఓ కారణం. దీంతో ఎండ్-టు-ఎండ్ ఆర్డర్లు డెలివరీ అనేది చాలా సులభమైంది.
తన కార్గో జెట్‌లలో ఉపయోగించని స్థలాన్ని విక్రయించేందుకు అమెజాన్ ట్రై చేస్తోంది. ఎందుకంటే, ఇటీవల లేఆఫ్‌లు ప్రకటించిన అమెజాన్ ఇప్పుడు వర్క్ ఫోర్స్‌లో 6 శాతం మందిని తగ్గించవలసి వచ్చింది. ఆ సిబ్బంది సంఖ్య 12,000 మందితో సమానం. ఇప్పటికిప్పుడు అంతే స్థాయిలో రిక్రూట్‌మెంట్ జరిగే అవకాశం లేదు. మెయింటెనెన్స్ భారం మరింత పెరుగుతుంది కాబట్టి, ఉద్యోగులను తీసుకోవటానికి బదులుగా ఖాళీగా ఉన్న కార్గోను అమ్మేస్తే కాస్త లాభపడవచ్చని అమెజాన్ అధికార వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, Hyderabad, KTR