హోమ్ /వార్తలు /బిజినెస్ /

Jeff Bezos Letter: అమెజాన్ లో షాపింగ్ చేయడం ఇంత లాభం ఉందా..? ప్రత్యేకంగా ఓ లేఖను రాసిన అమెజాన్ సీఈవో

Jeff Bezos Letter: అమెజాన్ లో షాపింగ్ చేయడం ఇంత లాభం ఉందా..? ప్రత్యేకంగా ఓ లేఖను రాసిన అమెజాన్ సీఈవో

జెఫ్ బెజోస్

జెఫ్ బెజోస్

అమెజాన్ సీఈవో జెఫ్ బేజోస్ ఓ ప్రత్యేక లేఖను రాశారు. ఆ లేఖలో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అది చదివిన వాళ్లు ‘అవునా.. అమెజాన్ లో షాపింగ్ చేయడం వల్ల ఇంత గొప్ప లాభం ఉందా?’ అని ఆశ్చర్యపోతున్నారు.

షాపింగ్ కోసం ప్రస్తుతం ఎక్కువగా ఈ-కామర్స్ సైట్లనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు వినియోగదారులు. వీటి ద్వారా అందుబాటులో ధరకే వస్తువులు దొరకడంతో పాటు సమయం కూడా ఆదా చేసుకోవచ్చు. అందులోనూ అమెజాన్ లాంటి దిగ్గజ గ్లోబల్ ప్లాట్ ఫాం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా ఆ సంస్థ సీఈఓ జెఫ్ బేజోస్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అమెజాన్ లో షాపింగ్ చేయడం ద్వారా డబ్బుతో పాటు ఏడాదిలో 75 గంటల సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. సంపద సృష్టి, ప్రజలు డబ్బును ఎలా ఉపయోగించుకోవాలో అనే అంశంపై తన స్టేక్ హోల్డర్లకు ఓ ఉత్తరం ద్వారా తెలియజేశారు."అత్యవసర పరిస్థితుల్లో, నూతన వ్యాపారం కోసం, విహారయాత్రలు, ఛారిటీ, గృహాలు ఇలా ఎన్నో రకాలుగా సొమ్మును ప్రజలు వినియోగిస్తారు.

అయితే అమెజాన్ లో షాపింగ్ చేయడం ద్వారా డబ్బును మాత్రమే కాదు సమయాన్ని కూడా ఆదా చేయవచ్చు. అమెజాన్ డెలివరీ సేవల ద్వారా ప్రజలు ఏడాదిలో 72 గంటల సమయాన్ని పొదుపు చేసుకోవచ్చు. మేము తక్కువ ధరలకే కాకుండా ఎన్నో విభిన్న రకాల సెలక్షన్లు, వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తాం. అంతేకాకుండా వారు పెట్టే రూపాయికి విలువ చేకూర్చడంతో పాటు వినియోగదారుల సమయం ఆదా చేస్తాం. అమెజాన్ వినియోగదారుల్లో 28 శాతం మంది కేవలం 3 నిమిషాల్లోనే కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తారు. ఇందులో సగం మంది కొనుగోలు దారులు 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో షాపింగ్ పూర్తి చేస్తారు.

ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

సాధారణంగా షాపింగ్ చేయాలంటే స్టోర్ కు డ్రైవింగ్ చేస్తూ వెళ్లడమే కాకుండా పార్కింగ్, అవసరమైన వస్తువుల కోసం వెతకడం, చెక్ అవుట్ కోసం క్యూలో ఎదురుచూడటం, మళ్లీ కారు దగ్గరకు చేరుకొని ఇంటికి సురక్షితంగా చేరుకోవడం లాంటి దశలు దాటాలి. ఈ విధానంలో గంటల సమయం వృథా అవుతుంది. అదే అమెజాన్ లో గరిష్ఠంగా 15 నిమిషాల్లో షాపింగ్ పూర్తి చేయవచ్చు. అంటే వారంలో రెండు సార్లు స్టోర్ కు వెళ్లే సమయాన్ని ఈ విధానంలో ఆదా చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..

తద్వారా డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు. గంటకు 10 డాలర్ల విలువనిస్తే ఏడాదికి 75 గంటలంటే.. 750 డాలర్లు(రూ.55 వేలు) మీకు మిగిలినట్లే. అదే ప్రైమ్ మెంబర్ అయితే ఆ ఖర్చును మినహాయిస్తే 630 డాలర్లు మిగులుతాయి. మాకు ప్రపంచ వ్యాప్తంగా 200 మిలియన్ల ప్రైమ్ మెంబర్లు ఉన్నారు. 2020 నాటికి దీని మొత్తం విలువ 120 బిలియన డాలర్లు. మీరు వ్యాపారంలో విజయవంతం కావాలంటే మీరు వినియోగించే దానికంటే ఎక్కువ సృష్టించాలి. మీరు ఇంటరాక్ట్ అయ్యే ప్రతి ఒక్కరి క్రియేట్ వ్యాల్యూ లక్ష్యంగా పెట్టుకోవాలి" అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ తన ఉత్తరంలో తెలియజేశారు.

ఇది కూడా చదవండి: ప్రియుడితో తల్లి ఎస్కేప్.. తండ్రి బాధను చూడలేక.. పదేళ్ల తర్వాత కన్న కొడుకే పనోడిలా చేరి ఇలా పగతీర్చుకున్నాడు..!

First published:

Tags: Amazon, Amazon Great Indian Festival Sale, AMAZON PAY, Flipkart, Swiggy

ఉత్తమ కథలు