అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకులు: ఇక అత్యంత సంపన్నుడు బిల్ గేట్సా?

జెఫ్ బెజోస్, మెకెంజీ బెజోస్ దంపతులకు నలుగురు పిల్లలు. అయితే వైవాహిక బంధానికి తెరపడుతున్నా, వ్యాపారంలో వీరి బంధం కొనసాగేలా ఉంది. గతంలో చేపట్టిన వెంచర్లు, ప్రాజెక్టుల్నీ ఇద్దరూ కలిసే కొనసాగించే అవకాశం ఉంది.

news18-telugu
Updated: January 10, 2019, 5:21 PM IST
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకులు: ఇక అత్యంత సంపన్నుడు బిల్ గేట్సా?
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకులు
  • Share this:
అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్, భార్య మెకెంజీ బెజోస్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. చాలా కాలంగా వేర్వేరుగా ఉంటున్న భార్యాభర్తలు ఇద్దరూ ఇక విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లైన పాతికేళ్ల తర్వాత ఇద్దరూ విడిపోతున్నారు. ఇదే విషయాన్ని తమ ట్విట్టర్‌లో వెల్లడించారు. జెఫ్ బెజోస్, మెకెంజీ బెజోస్ దంపతులకు నలుగురు పిల్లలు. అయితే వైవాహిక బంధానికి తెరపడుతున్నా, వ్యాపారంలో వీరి బంధం కొనసాగేలా ఉంది. గతంలో చేపట్టిన వెంచర్లు, ప్రాజెక్టుల్నీ ఇద్దరూ కలిసే కొనసాగించే అవకాశం ఉంది.

అమెజాన్‌తో ఆన్‌లైన్ బుక్ సెల్లర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన జెఫ్ బెజోస్... ఇప్పుడు అదే అమెజాన్ నుంచి ప్రపంచంలో ప్రతీ వస్తువును అమ్ముతుండటం విశేషం. దేశదేశాలకు అమెజాన్‌ను విస్తరించిన జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే ధనవంతుల జాబితాలో టాప్‌లో నిలిచాడు. మైక్రోసాఫ్ట్‌ను దాటేసి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది అమెజాన్. ప్రస్తుతం జెఫ్ బెజోస్ సంపద 137 బిలియన్ డాలర్లు. అందులో మెకెంజీ పేరు మీద 69 బిలియన్ డాలర్లున్నాయి. ఇద్దరూ సంపదను పంచుకుంటే జెఫ్ బెజోస్ ఆస్తులు 68 బిలియన్ డాలర్లకు పడిపోతుంది. అదే జరిగితే జెఫ్ బెజోస్ ఇక ప్రపంచంలోని సంపన్నుడి స్థానాన్ని కోల్పోతారు. 93 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ మొదటి స్థానంలోకి వస్తారు. ఆ తర్వాత స్థానాల్లో వారెన్ బఫెట్(80.8 బిలియన్ డాలర్లు), బెర్నార్డ్ ఆర్నాల్ట్(72.6 బిలియన్ డాలర్లు) ఉన్నారు.


ఇవి కూడా చదవండి:

Good News: వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్

WhatApp Stickers: వాట్సప్‌లో స్టిక్కర్లు ఎలా తయారు చేయాలో తెలుసుకోండి

పబ్‌జీ గేమ్ ఆడితే పిచ్చెక్కింది... జమ్మూలో ఆస్పత్రిపాలైన ఫిట్‌నెస్ ట్రైనర్PUBG Mobile: పబ్‌జీ ఆడుతున్నారా? ఈ 10 తప్పులు చేస్తే నిషేధం తప్పదు
Published by: Santhosh Kumar S
First published: January 10, 2019, 5:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading