Jeff Bezos: 15 నిమిషాల్లో రూ.94 వేల కోట్ల సంపాదన... అమెజాన్ అధిపతి సంచలనం

Amazon CEO Jeff Bezos | ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ కొత్త రికార్డ్ సృష్టించారు. మరో రూ.94 వేల కోట్లను 15 నిమిషాల్లో సంపాదించేశారు.

news18-telugu
Updated: January 31, 2020, 10:44 AM IST
Jeff Bezos: 15 నిమిషాల్లో రూ.94 వేల కోట్ల సంపాదన... అమెజాన్ అధిపతి సంచలనం
Jeff Bezos: 15 నిమిషాల్లో రూ.94 వేల కోట్ల సంపాదన... అమెజాన్ అధిపతి సంచలనం (Amazon CEO Jeff Bezos File Photo)
  • Share this:
ఎంత ధనవంతులైనా 15 నిమిషాల్లో ఎంత సంపాదిస్తారు? లక్షలు లేదా కోట్ల రూపాయలు. అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మాత్రం కోట్లు అంటే వంద కోట్లు, వెయ్యి కోట్లు కాదు... ఏకంగా 94 వేల కోట్ల రూపాయలు సంపాదించారు. ఇది అక్షరాలా నిజం. సరిగ్గా 15 నిమిషాల్లో రూ.94,276 కోట్ల సంపాదనను కూడగట్టుకున్నారు. ఇ-కామర్స్ కంపెనీ అమెజాన్ నాలుగో త్రైమాసిక ఫలితాలు విడుదలైన కొన్ని క్షణాల్లో వాల్ స్ట్రీట్‌లో జరిగిన అద్భుతం ఇది. డిసెంబర్ త్రైమాసికంలో అమెజాన్ లాభం 8% పెరిగింది. అంటే 3.3 బిలియన్ డాలర్లు. అంతే త్రైమాసిక ఫలితాలు విడుదల కాగానే న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో ఒక్కసారిగా Amazon.com Inc. స్టాక్ 12% పుంజుకుని 2,100 డాలర్లకు చేరుకుంది.

Amazon.com Inc. షేర్ ధర పెరగడంతో అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ సంపాదన కూడా అమాంతంగా పెరిగిపోయింది. కేవలం 15 నిమిషాల్లో తనకు ఉన్న సంపాదనకు మరో రూ.94,276 కోట్లు అదనంగా చేరడం సంచలనమే. ఇప్పటికే 56 ఏళ్ల జెఫ్ బెజోస్ ప్రపంచంలోనే ధనవంతుడు. అంతేకాదు... సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రస్తుతం ఆయన నెట్ వర్త్ 129.5 బిలియన్ డాలర్లు. అంటే రూ.9 లక్షల కోట్లకు పైనే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ విడాకులకు ఆమెతో ఎఫైర్ కారణమా?



PPF Rules: పీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసేముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి

Home Loan: హోమ్ లోన్‌కు అప్లై చేసేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి
First published: January 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు