AMAZON BANS SOME CHINESE PRODUCTS HERE ARE FULL DETAILS BA GH
Amazon: చైనా కంపెనీల దొంగ తెలివి.. భారీ షాకిచ్చిన అమెజాన్
ప్రతీకాత్మక చిత్రం
చైనాకు చెందిన మరో మూడు ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ షాక్ ఇచ్చింది. ఆ సంస్థల ఉత్పత్తులను పూర్తిగా నిషేధించింది. కస్టమర్లకు గిఫ్ట్‌కార్డులు ఇస్తూ తమ ప్రొడక్టులకు అమెజాన్‌లో ఫేక్‌గా పాజిటివ్ రివ్యూలను రాయించుకుంటున్నట్టు తేలడంతో వేటు వేసింది.
చైనాకు చెందిన మరో మూడు ఎలక్ట్రానిక్స్ సంస్థలకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ షాక్ ఇచ్చింది. ఆ సంస్థల ఉత్పత్తులను పూర్తిగా నిషేధించింది. కస్టమర్లకు గిఫ్ట్‌కార్డులు ఇస్తూ తమ ప్రొడక్టులకు అమెజాన్‌లో ఫేక్‌గా పాజిటివ్ రివ్యూలను రాయించుకుంటున్నట్టు తేలడంతో వేటు వేసింది. ఇది వరకే 16 చైనీస్ బ్రాండ్లను నిషేధించిన అమెజాన్ తాజాగా మరో మూడు బ్రాండ్లపై కొరడా ఝుళిపించింది. దీంతో బ్యాన్ అయిన చైనీస్ సంస్థల సంఖ్య 19కి చేరింది. తమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందునే ఆ కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. బైట్‌డాన్స్ మద్దతిస్తున్న ఓ చైనీస్ సంస్థను కూడా అమెజాన్ బ్యాన్ చేసింది. దీంతో 1 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు సస్పెండ్ అయిపోయాయి.
అమెజాన్ ఇప్పటి వరకు… ఆర్ఏవీపవర్ పవర్ బ్యాంక్స్, హెడ్‌ఫోన్స్ తయారు చేసే టాట్రోనిక్స్, స్మార్ట్ కెమెరాల సంస్థ వీఏవీఏ కెమెరాస్, ఆట్మోకో, ఔకీ, అస్టర్, హొమాసీ, హోమిట్, హోమ్‌టెక్, లిటోమ్, ఎంపౌ, ఓక్మీ, ఒమోరోక్, సెనియో, ట్రాక్లైఫ్, టాప్ ఎలెక్, ట్రోడీమ్, విక్ట్సింగ్, వీటిన్ అనే చైనీస్ ఎలక్ట్రానిక్స్ సంస్థలను బ్యాన్ చేసింది. అమెజాన్‌లో పాజిటివ్ రివ్యూలు రాసేందుకు సిద్ధంగా ఉన్న వారికి గిఫ్ట్‌కార్డులు ఇస్తామని ఆ సంస్థలు తమ వెబ్‌సైట్స్‌లో పెట్టాయి. దీన్ని గుర్తించిన ఈకామర్స్ దిగ్గజం.. సదరు కంపెనీల ఉత్పత్తులను తన ప్లాట్‌ఫాంలో నిషేధించింది. రివ్యూ సిస్టమ్‌ను అపహాస్యం చేసేలా ఆ సంస్థలు వ్యవహరించాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.
బైట్‌డాన్స్‌కు చెందిన ఎంపౌ, షియామీ మద్దతిస్తున్న పాటోజొన్ కూడా అమెజాన్ బ్యాన్ చేసిన లిస్ట్‌లో ఉన్నాయి. 2020 తొలి ఆరు నెలల్లో పాటోజొన్కు చెందిన 2 బిలియన్ యువాన్ల ఎగుమతులు జరిగినట్టు ఓ ఫైనాన్సియల్ నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్స్‌లో కొన్ని సంవత్సరాలుగా చైనీస్ మర్చంట్లకు చెందిన ప్రాడక్టులు చాలా అధింకగా ఉన్నాయి. అమెజాన్, ఈబేతో పాటు చాలా ఈ కామర్స్ సైట్లలో చైనీస్ ఉత్పత్తులే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇదే అదునుగా కొన్ని సంస్థలు ఫేక్ రివ్యూలు రాయిస్తూ ఈ కామర్స్ కస్టమర్లను తప్పుదారి పట్టిస్తున్నాయి. దీంతో గట్టి హెచ్చరికలు పంపేందుకు అమెజాన్ కఠిన నిర్ణయాలు తీసుకుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.