Amazon Great Indian Festival: అతి తక్కువ ధరలకే Amazonలో ఈయర్ ఫోన్స్‌

‘మ్యూజిక్ ఫెస్ట్’ పేరుతో హెడ్ ఫోన్స్, ఈయర్ బడ్స్, వైర్లెస్ ఈయర్ ఫోన్స్, వైర్లెస్ నెక్ బ్యాండ్.. వంటి ఆడియో ఉత్పత్తులపై ఒప్పందాలు, ఆఫర్లను Amazon అందిస్తోంది.

news18-telugu
Updated: November 9, 2020, 12:33 PM IST
Amazon Great Indian Festival: అతి తక్కువ ధరలకే Amazonలో ఈయర్ ఫోన్స్‌
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
Amazon music fest: ఈ కామర్స్ సంస్థ Amazon దీపావళి ఆఫర్లను ప్రకటించింది. ‘మ్యూజిక్ ఫెస్ట్’ పేరుతో హెడ్ ఫోన్స్, ఈయర్ బడ్స్, వైర్లెస్ ఈయర్ ఫోన్స్, వైర్లెస్ నెక్ బ్యాండ్.. వంటి ఆడియో ఉత్పత్తులపై ఒప్పందాలు, ఆఫర్లను Amazon అందిస్తోంది. ఇప్పుడు బోట్, సోనీ, జెబిఎల్, వన్‌ప్లస్, పిట్రాన్, జాబ్రా, రియల్‌ మి, ఒప్పో, శామ్‌సంగ్, సెన్‌హైజర్, ఇన్ఫినిటీ, ఎమ్ఐ, బ్లూపంక్ట్, బోస్... వంటి బ్రాండ్‌లకు చెందిన హెడ్‌ఫోన్‌లపై వినియోగదారులు 75 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. సోనీ ఉత్పత్తులపై 45 శాతం, జెబిఎల్ హెడ్‌ఫోన్‌లపై 50 శాతం వరకు తగ్గింపును Amazonఅందిస్తోంది. వీటితో పాటు వన్‌ప్లస్ ఈయర్‌ఫోన్‌లను రూ.1,999 నుంచి ప్రారంభమయ్యే ధరల్లో పొందవచ్చు. సెన్‌హైజర్, రియల్‌మే, ఒప్పో సంస్థల ఉత్పత్తులపై 50 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. మ్యూజిక్ ఫెస్ట్ సేల్స్‌లో వినియోగదారులు రూ.5,000, అంతకంటే ఎక్కువ విలువ చేసే ఉత్పత్తులను SBI క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.

ప్రతీకాత్మకచిత్రం


మ్యూజిక్ ఫెస్ట్ హెడ్‌ఫోన్ ఆఫర్‌లు...

boAt Rockerz 255 Sports- Bluetooth Neckband Earphone with Mic

రాకర్జ్ 255  ఈయర్‌ఫోన్‌ను బ్లూటూత్ 4.1-CSR8635 చిప్‌సెట్, 10 మిమీ డ్రైవర్లతో రూపొందించారు. ఇవి రూ.999కు లభిస్తున్నాయి.

Noise Shots X5 PRO- వైర్‌లెస్ ఈయర్‌బడ్స్

ఈ ఈయర్‌బడ్స్‌ బ్లూటూత్ 5.0, క్వాల్‌కామ్ 3020 చిప్‌సెట్తో పనిచేస్తాయి. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే, దాదాపు ఎనిమిది గంటల వరకు ప్లే టైంను పొందవచ్చు. ఈ ఈయర్‌బడ్స్‌కు క్యారీయింగ్ కేస్‌ 142 గంటల అదనపు ఛార్జింగ్‌ను అందిస్తుంది. వీటి ధర రూ.3,499.

Infinity Glide 120 Metal Wireless Flex Neckband

ఈ స్వెట్‌ ప్రూఫ్‌ ఈయర్‌ఫోన్స్‌ బ్లూటూత్ 5.0తో లభిస్తున్నాయి. ఇది ఏడు గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది. JBL సంస్థ నుంచి వచ్చిన ఈ ఈయర్‌ఫోన్స్‌ ధర రూ.899.

Jabra Elite 65t Alexa Enabled True Wireless Earbuds

జాబ్రా ఎలైట్ 65టి ఈయర్ బర్డ్స్ ఛార్జింగ్ కేసుతో 15 గంటల బ్యాటరీ సమార్థ్యాన్ని అందిస్తుంది. దీని 4-మైక్రోఫోన్ టెక్నాలజీ మెరుగైన కాల్ పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 3,999.

Sony WF-1000XM3 Noise Canceling Earbuds

 ఈ ఈయర్ ఫోన్స్‌లో ఉండే 24 బిట్ ఆడియో సిగ్నల్ ప్రాసెసింగ్, మెరుగైన సిగ్నల్ నిష్పత్తితో నాయిస్‌ను తగ్గిస్తుంది. పాటను మార్చడానికి, ఫోన్ వాయిస్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేయడానికి, కాల్‌ చేయడానికి వేళ్లతో ప్యానెల్‌ను స్వైప్ చేస్తే చాలు. వీటి ధర రూ.14,990.

Realme Buds Wireless

రియల్‌మి బడ్స్‌ 11.2 ఎంఎం బాస్ డ్రైవర్తో, 110 ఎంఏహెచ్ బ్యాటరీతో లభిస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే, 12 గంటల వరకు ప్లేబ్యాక్ టైమ్ ను పొందవచ్చు. ఇది Amazonలో రూ.1,799కు లభిస్తుంది.

boAt Airdopes 441 TWS Ear-Buds

ఈ ఈయర్ బడ్స్ 6 ఎంఎం డ్రైవర్స్‌తో, టచ్ కంట్రోల్స్‌తో లభిస్తున్నాయి. ఇది బ్లూటూత్ v5.0తో పనిచేస్తుంది. దీని ధర రూ.1,999.
Published by: Krishna Adithya
First published: November 9, 2020, 12:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading