పండుగ చేస్కోండి: 24-28 వరకు అమెజాన్‌లో మళ్లీ ఆఫర్లు

ఫస్ట్ సీజన్‌లో కొనలేకపోయాం.. ఆఫర్లు మిస్ అయ్యామనుకునేవారికి ఇది మరో చాన్స్.

news18-telugu
Updated: October 18, 2018, 7:51 PM IST
పండుగ చేస్కోండి: 24-28 వరకు అమెజాన్‌లో మళ్లీ ఆఫర్లు
IMAGE: REUTERS
  • Share this:
పండుగ అయిపోలేదు. ఇంకా ఉంది. గెట్ రెడీ అంటోంది అమెజాన్. ఇప్పటికే ఓ దఫా బంపర్ ఆఫర్లతో బీభత్సమైన వ్యాపారం చేసిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం మరోసారి ఆఫర్లతో సిద్ధమైంది. ఈనెల 24 నుంచి 28 వరకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫేజ్ ‌2 నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. దసరాకు ముందస్తుగా ఈనెల 10 నుంచి 15 వరకు అమెజాన్.. ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ నిర్వహించింది. భారీ ఆఫర్లు ప్రకటించి కొనుగోలుదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అదే సమయంలో మరో ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడా ఈనెల 10 నుంచి 14 వరకు ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో ఆఫర్ల వర్షం కురిపించింది. ఈ రెండు సంస్థలు కలిపి ఐదు రోజుల్లోనే సుమారు రూ.15,000 కోట్ల వ్యాపారం చేసినట్టు అంచనా.

ఫస్ట్ ఫేజ్ సేల్స్ ధూంధాంగా నిర్వహించిన అమెజాన్.. మరోసారి ఫేజ్‌2కి రెడీ అయింది. ఈ ఐదు రోజుల్లో టీవీలు, సెల్ ‌ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లను ప్రకటించనున్నట్టు అమెజాన్ తెలిపింది. కొన్ని ఫ్లాష్ సేల్స్ కూడా ఉన్నాయి. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 గంటలకు రెడ్‌మీ 6ఏ స్మార్ట్‌ఫోన్‌ ఫ్లాష్ సేల్స్ ఉంటాయని ప్రకటించింది. ఐసీఐసీఐ, సిటీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 10శాతం స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంటుంది.

అమెజాన్ ప్రైమ్ నౌ యాప్ కస్టమర్ల కోసం ఆ సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉండే కస్టమర్లు ప్రైమ్ నౌ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే.. వారికి కేవలం రెండు గంటల్లోనే ప్రొడక్ట్ డెలివరీ చేసేస్తామని ప్రకటించింది.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఫేజ్‌2కు పోటీగా ఫ్లిప్ కార్ట్ కూడా రానుంది. ‘ధమాకా సేల్’ పేరుతో త్వరలో ఆఫర్లను ప్రకటించడానికి రెడీ అవుతోంది. అయితే, ఫ్లిప్‌కార్ట్ కూడా అదే సమయంలో ప్రకటిస్తుందా లేకపోతే దీపావళికి అనౌన్స్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.ఫస్ట్ సీజన్‌లో కొనలేకపోయాం.. ఆఫర్లు మిస్ అయ్యామనుకునేవారికి ఇది మరో చాన్స్. పర్స్ రెడీ చేసుకోవడమే ఆలస్యం.
First published: October 18, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు