Amazon | భోజన ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్..

Amazon Food Delivery : భోజన ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లకు దీటుగా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

news18-telugu
Updated: February 28, 2020, 11:43 AM IST
Amazon | భోజన ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్..
అమెజాన్
  • Share this:
amazon food delivery : భోజన ప్రియులకు అమెజాన్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. స్విగ్గీ, జొమాటో లాంటి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లకు దీటుగా ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వచ్చే నెలలోనే దీన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే ముందు టెస్టింగ్ కోసం బెంగళూరులోని కొన్ని రెస్టారెంట్ల నుంచి ఫుడ్ డెలివరీ చేస్తోంది. హెచ్‌ఎస్‌‌ఆర్, బెలందూర్, హారలూర్, మారథహలి, వైట్‌ ఫీల్డ్ అడ్రస్‌లకు ఫుడ్ అందజేస్తోంది. ప్రస్తుతం అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ ఫుడ్ డెలివరీపై దృష్టి సారించినట్లు తెలిసింది. గత దీపావళి నాటికే ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు వార్తలు వెలువడ్డా.. ఏవో కారణాల రీత్యా అది వాయిదా పడుతూ వచ్చింది.

అమెజాన్ ఫుడ్ డెలివరీని ప్రారంభిస్తే స్విగ్గీ, జొమాటో గట్టి పోటీని ఎదుర్కోనున్నాయి. ఆ సంస్థలు భారీగా డిస్కౌంట్లకు కోత పెట్టిన తరుణంలో అమెజాన్ ఈ వ్యాపారంలోకి ప్రవేశించబోతుండటం ఆసక్తిని రేపుతోంది. పైగా, 10 నుంచి 15 శాతం కమీషన్ ఆఫర్ కూడా అందజేయనుందని సమాచారం.
Published by: Shravan Kumar Bommakanti
First published: February 28, 2020, 11:43 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading