Amazon కంపెనీపై CAIT విమర్శలు…మరో ఈస్టిండియా కంపెనీ అంటూ ధ్వజం...

Amazon, రిలయన్స్ గ్రూపుల మధ్య ఇటీవల జరిగిన ఒప్పందానికి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ నిబంధనలను అమలు చేయాలని Amazon ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని CAIT ఖండిస్తోంది.

news18-telugu
Updated: November 2, 2020, 6:56 PM IST
Amazon కంపెనీపై CAIT విమర్శలు…మరో ఈస్టిండియా కంపెనీ అంటూ ధ్వజం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశంలో ఈకామర్స్ వ్యాపారం ఎప్పటికప్పుడు వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ సంస్థలపై మిమర్శలూ పెరుగుతున్నాయి. విదేశీ ఈ కామర్స్ కంపెనీలు భారత వ్యాపార మూలాలను దెబ్బతీస్తున్నాయని దేశీయ సంస్థలు విమర్శిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ ను కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చింది. బ్రిటీషర్లు భారత రాష్ట్రాలను ఒక్కొక్కటిగా సొంతం చేసుకొని, భారతీయ వ్యాపారాలను గుత్తాధిపత్యం చేసుకున్నట్లుగానే ఇప్పుడు Amazon ప్రవర్తిస్తోందని CAIT సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెబుతున్నారు. Amazon ఎక్వజిషన్ పాలసీల వల్ల మన దేశానికి చెందిన ఫ్యూచర్ రిటైల్ గ్రూప్ లిక్విడేషన్‌కు వెళ్లింది. దీనిపై ప్రవీణ్‌ తీవ్రంగా స్పందించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగానే భారత వ్యాపార వ్యవస్థను Amazonదెబ్బతీస్తోందని ఆయన తెలిపారు.

ఇది భారత ప్రభుత్వానికి, దేశీయ కార్పొరేట్ సంస్థలకు హెచ్చరిక లాంటిందని ప్రవీణ్‌ చెబుతున్నారు. భారతీయ రిటైల్ వాణిజ్యాన్ని నియంత్రించడానికి విదేశీ నిధులు పొందుతున్న MNCల లక్ష్యాలు ప్రపంచానికి తెలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘ప్రభుత్వ FDI పాలసీలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్, భారతదేశంలో దర్యాప్తును ఎదుర్కొంటోంది. ఇలాంటి అభియోగాలను మనదేశ న్యాయ వ్యవస్థ ప్రకారం కాకుండా, ఒక విదేశీ ప్యానెల్ ద్వారా ఎదుర్కొనేందుకు ఆర్బిట్రేషన్‌ అధికార పరిధిని ఆ సంస్థ ఏర్పరచుకుంటుంది’ అని తెలిపారు.

దేశీయ సంస్థలకు మద్దతిస్తాం

మన దేశానికి చెందిన ఫ్యూచర్ రిటైల్ కంపెనీ ఉనికి ప్రమాదంలో ఉన్నందున, తాము ఆ సంస్థకు సంఘీభావంగా నిలుస్తున్నామని CAIT జాతీయ అధ్యక్షుడు B.C. భార్తియా చెబుతున్నారు.  విదేశీ కంపెనీలతో పోరాటం చేసే భారతీయ సంస్థలకు ఏడు కోట్ల మంది వ్యాపారులు తోడుంటారని ఆయన చెప్పారు. దేశంలో పరిశ్రమలు, వాణిజ్యానికి న్యాయవాదులమని చెప్పుకునే FICCI, CII సంస్థలు దీనిపై ఎందుకు మాట్లాడట్లేదని ఆయన ప్రశ్నించారు. విదేశీ కంపెనీలు భారతీయ వ్యాపార వ్యవస్థపై దాడి చేసే ప్రయత్నాలను CAIT అడ్డుకుంటుందని  ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఆ ఒప్పదం వద్దు

Amazon, రిలయన్స్ గ్రూపుల మధ్య ఇటీవల జరిగిన ఒప్పందానికి సింగపూర్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ నిబంధనలను అమలు చేయాలని Amazon ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని CAIT ఖండిస్తోంది. ఈ చర్య ద్వారా ఫ్యూచర్ రిటైల్ గ్రూపులకు చెందిన 1500 రిటైల్ దుకాణాలపై నియంత్రణ ఉంచాలని Amazon భావిస్తోందని సంస్థ ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ఏదైనా వివాదం తలెత్తినప్పుడు Amazonఇండియన్ ఆర్బిట్రేషన్ యాక్ట్ ప్రకారం నడుచుకోవాలి. కానీ మధ్యవర్తిత్వం కోసం సింగపూర్ ఆధారిత ప్యానెల్ను ఎంచుకోవడం కుట్రపూరితమే అని వారు చెప్పారు.

భారత సంస్థలు దృష్టి పెట్టాలి

విదేశీ నిధుల ద్వారా దేశీయ వ్యాపారాలను శాసించాలనుకునే  MNCలపై దృష్టి పెట్టాలని భారతీయ కార్పొరేట్ రంగ సంస్థలను ట్రేడ్ యూనియన్ హెచ్చరిస్తోంది. MNCలతో ఒప్పందం కుదుర్చుకునే ముందు, కార్పొరేట్ రంగం తగిన శ్రద్ధ వహించాలని వారు సూచిస్తున్నారు. 40 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న రిటైల్ రంగంపై ప్రభావం పడకుండా ఒప్పందాలు ఉండాలని ఆ సంస్థ చెబుతోంది. ఫ్యూచర్ రిటైల్ డిస్ట్రిబ్యూటర్లు, సరఫరాదారుల చెల్లింపులు వీలైనంత త్వరగా జరిగేలా చూడాలని ఆ సంస్థ ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీని కోరింది.
Published by: Krishna Adithya
First published: November 2, 2020, 6:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading