హోమ్ /వార్తలు /బిజినెస్ /

Money: మైండ్‌‌బ్లోయింగ్.. 15 రోజుల్లోనే రూ.లక్షకు రూ.2,65,000!

Money: మైండ్‌‌బ్లోయింగ్.. 15 రోజుల్లోనే రూ.లక్షకు రూ.2,65,000!

Money: మైండ్‌‌బ్లోయింగ్.. 15 రోజుల్లోనే రూ.లక్షకు రూ.2,65,000!

Money: మైండ్‌‌బ్లోయింగ్.. 15 రోజుల్లోనే రూ.లక్షకు రూ.2,65,000!

Multibagger Stock | మీరు స్టాక్ మార్కెట్‌ ఫాలో అవుతూ ఉంటారా? అయితే ఈ స్టాక్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ షేర్లు కేవలం 15 రోజుల్లోనే భారీ లాభాలు అందించి పెట్టాయి. ఒక షేరు ఏకంగా రూ.లక్షను రూ.2 లక్షలుగా మార్చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Multibagger Share | మతిపోయే ప్రాఫిట్ అంటే ఇదేనేమో. ఎందుకని అనుకుంటున్నారా? కేవలం 15 రోజుల్లోనే రూ. లక్ష ఏకంగా రూ.2.5 లక్షలుకు పైగా మారిపోయాయి. ఎలా? అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. రెండు వారాల వ్యవధిలోనే భారీ లాభాలు ఎలా వచ్చాయో చూద్దాం. స్టాక్ మార్కెట్‌లోనే (Stock Market) ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మార్కెట్‌లో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ (Stocks) ఇన్వెస్టర్లకు కళ్లుచెదిరే ప్రాఫిట్ అందించాయి.

నెట్‌వర్క్ పీపుల్ సర్వీస్ టెక్నాలజీ, 3పీ ల్యాండ్ హోల్డింగ్స్, కోల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ వంటి షేర్లు భారీ లాభాలు పంచిపెట్టాయి. నెట్‌వర్క పీపుల్ సర్వీస్ టెక్నాలజీ షేరు 165 శాతం ర్యాలీ చేసింది. 3పీ ల్యాండ్ హోల్డింగ్స్ 116 శాతం పెరిగింది. ఇక కోల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ షేరు 104 శాతం మేర పరుగులు పెట్టింది. దీంతో ఈ షేర్లలో డబ్బులు పెట్టిన వారి పంట పండిందని చెప్పుకోవచ్చు.

రూ.400తో కన్యాకుమారి నుంచి కశ్మీ‌ర్ వెళ్లొచ్చు.. ఎలక్ట్రిక్ బైక్ అదిరింది!

కోల్ క్యాప్స్ ఇండస్ట్రీస్ షేరు రూ. 501 వద్ద ఉంది. వారం కిందట ఈ షేరు ధర రూ. 375. అంటే షేరు ధర 33 శాతం పెరిగింది. నెల రోజుల కాలంలో చూస్తే.. ఈ స్టాక్ 108 శాతం రాబడిని ఇచ్చింది. గత మూడు నెలల కాలంలో చూస్తే.. ఈ షేరు 188 శాతం పెరిగింది. షేరు 52 వారాల కనిష్ట స్థాయి రూ. 41గా ఉంది. 3పీ ల్యాండ్ హోల్డింగ్స్ కూడా దుమ్మురేపింది. ఈ షేరు వారంలో 32 శాతం పెరిగింది. నెల రోజుల్లో 91 శాతం ర్యాలీ చేసింది. అయితే గత 15 రోజుల్లో మాత్రం తగ్గింది. ఈ షేరు 52 వారాల గరిష్ట స్థాయి 36గా, కనిష్ట స్థాయి రూ. 13గా ఉంది.

రూ.58 పొదుపుతో రూ.8 లక్షలు పొందండి.. ఎల్ఐసీ అద్భుతమైన స్కీమ్!

అలాగే నెట్‌వర్క్ పీపుల్ సర్వీసెస్ టెక్నాలజీ విషయానికి వస్తే.. ఈ షేరు నెల రోజుల్లో 170 శాతం పెరిగింది. మూడు నెలల్లో చూస్తే. . షేరు ధర 173 శాతం పైకి కదిలింది. ఏడాదిలో ఈ కంపెనీ షేరు 378 శాతం పెరిగింది. అలాగే 15 రోజుల్లో చూస్తే షేరు 165 శాతం పెరిగింది. అంటే ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ.2.65 లక్షలకు చేరి ఉండేది. కాగా స్టాక్ మార్కెట్‌లో భారీ రిస్క్ ఉంటుంది. అందువల్ల డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహా తీసుకోండి. లేదంటే పెట్టిన డబ్బులు పోగొట్టుకోవాల్సి వస్తుంది. భారీ నష్టాలు రావొచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండాలి.

First published:

Tags: Money, Multibagger stock, Share Market Update, Stock Market, Stocks

ఉత్తమ కథలు