AMAZFIT BIP U PRO SMARTWATCH HAS BEEN ANNOUNCED FOR THE INDIAN MARKET HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS GH
Amazfit Bip U Pro: అమేజ్ ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్ వాచ్ విడుదల.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
హువామి సంస్థ అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యుకు కొనసాగింపుగా వస్తోంది. ఈ వాచ్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకప్పుడు వాచ్ అంటే కేవలం టైం చూసుకోవానికే పనికొచ్చేది అనుకునేవారు.. కానీ, మార్కెట్లోకి స్మార్ట్‌వాచ్‌ల రాకతో దీని అర్థం పూర్తిగా మారిపోయింది. అనేక కంపెనీలు వినూత్న ఫీచర్లతో స్మార్ట్‌వాచ్‌లను పరిచయం చేస్తున్నాయి. దీంతో యువతలోనూ వీటి పట్ల క్రేజ్ పెరుగుతోంది. తాజాగా, హువామి సంస్థ అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌వాచ్ గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యుకు కొనసాగింపుగా వస్తోంది. గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యు ధర రూ.3,499 ఉండగా, తాజాగా విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో రూ .4,999లకు లభిస్తుంది. అమేజ్‌ఫిట్ బిపి యు ప్రో స్మార్ట్వాట్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌వాచ్‌గా పరిచయం అవుతోంది. ఇది రియల్మీ వాచ్ ఎస్, హానర్ వాచ్ ఈఎస్, ఎంఐ బ్యాండ్ 6 వంటి స్మార్ట్‌వాచ్‌లతో పోటీ పడనుంది. అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రో ఇప్పటికే హువామి అధికారిక వెబ్సైట్, అమెజాన్ సైట్లో అమ్మకానికి లిస్ట్ చేయబడింది. ఇది మొత్తం మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది. ఈ స్మార్ట్‌వాచ్‌లో అద్భుతమైన ఫీచర్లను చేర్చింది. అమాజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో 1.43- అంగుళాల ఐపిఎస్ ఎల్సిడి డిస్ప్లే, 2.5 డి గొరిల్లా గ్లాస్ యాంటీ ఫింగర్ ప్రింట్ కోంటింగ్ని అందించింది.
దీనిలో 320 x 302 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన ఎల్సిడి హైక్వాలిటీ ప్యానెల్‌ను చేర్చింది. హార్ట్ రేట్ మానిటరింగ్ కోసం దీనిలో ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, బ్లడ్ ఆక్సిజన్ (SpO2) సెన్సార్, ట్రై-యాక్సిస్ యాక్సిలెరోమీటర్, ట్రై-యాక్సిస్ గైరో, జియో మాగ్నెటిక్ వంటి సెన్సార్లను జోడించింది. అమేజ్‌ఫిట్ బిప్ యు స్మార్ట్‌వాచ్‌తో పోలిస్తే ప్రో స్మార్ట్‌వాచ్‌లో అప్డేటెడ్ ఫీచర్లను అందించింది. దీనిలో బిల్ట్ ఇన్ జిపిఎస్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అనే కొత్త ఫీచర్లను చేర్చింది. తద్వారా, ఈ స్మార్ట్‌వాచ్ పెట్టుకొని జాగింగ్, రన్నింగ్, ఇతర క్రీడా కార్యకలాపాలకు బయలుదేరే సమయంలో మీతో పాటు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకెళ్లవలసిన అవసరం లేదు. కాగా, గతేడాది విడుదలైన అమేజ్‌ఫిట్ బిప్ యులో ఈ ఫీచర్ ఉండేది కాదు.
మొత్తం మూడు కలర్ వేరియంట్లలో..
అమెజ్‌ఫిట్ బిప్ యు ప్రోలో స్లీప్, స్ట్రెస్ ట్రాకింగ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మెనుస్ట్రువల్ ట్రాకింగ్ వంటి అద్భుతమైన ఫీచర్లను చేర్చారు. వీటి సహాయంతో 60 కంటే ఎక్కువ విభిన్న క్రీడా కార్యకలాపాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌వాచ్ 50కి పైగా వాచ్ ఫేస్‌లకు మద్దతు ఇస్తుంది. దీనిలోని 5ATM డస్ట్, వాటర్ రెసిస్టన్స్ మీ వాచ్‌ను ఎప్పుడు కొత్తదానిలా, స్టైలిష్ లుక్‌లో కనబడేటట్లు చేస్తుంది.
అమేజ్‌ఫిట్ బిప్ యు ప్రోతో సహాయంతో మీ ఫోన్లో వచ్చే నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. అంతేకాక, మ్యూజిక్ కంట్రోల్ చేయవచ్చు. మీ ఫోన్ లొకేషన్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఇది బ్లూటూత్ 5.0, 230 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. కేవలం రెండు గంటల్లో ఈ స్మార్ట్‌వాచ్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. సాధారణ వాడకంపై 9 రోజులు, భారీ వాడకంపై 5 రోజుల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది.