AMALGAMATION OF OBC UBI INTO PUNJAB NATIONAL BANK MK GH
PNB Amalgamation: ఈ మూడు బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉందా...అయితే మీరు తప్పనిసరిగా చదవాల్సిందే..
(ప్రతీకాత్మక చిత్రం)
ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. ఈ ప్రక్రియ 2021 ఏప్రిల్ 1న అధికారికంగా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాత బ్యాంకుల అకౌంట్ హోల్డర్లు.. డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు.
గత కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల విలీనాన్ని చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంకులో విలీనం చేశారు. ఈ ప్రక్రియ 2021 ఏప్రిల్ 1న అధికారికంగా పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పాత బ్యాంకుల అకౌంట్ హోల్డర్లు.. డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. యూబీఐ, ఓబీసీ కస్టమర్ల ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ మారనుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ తెలిపింది. బ్యాంకుల విలీనం తర్వాత 2021 ఏప్రిల్ 1 నుంచి MICR కోడ్, IFSC కోడ్లు కూడా మారనున్నాయి. కస్టమర్లు పాత యూజర్ ఐడీతో లావాదేవీలు చేయలేరు. పాత యూజర్ ఐడిని మార్చని యూబీఐ, ఓబీసీ కస్టమర్లు నెట్ బ్యాంకింగ్ సదుపాయన్ని ఉపయోగించలేరని పీఎన్బీ ప్రకటించింది.
రెండు బ్యాంకుల కస్టమర్లు వాడే ఏటీఎం లేదా డెబిట్ కార్డులు మాత్రం చెల్లుబాటు అవుతాయి. కార్డుపై ఉన్న వ్యాలిడిటీ డేట్ వరకు ఇవి పనిచేస్తాయి. ఈ గడువు ముగిసిన తరువాత పాత డెబిట్ కార్డులను పంజాబ్ నేషనల్ బ్యాంకుల్లో రెన్యువల్ చేసుకోవాలి. విలీనం తరువాత ఓబీసీ, యూబీఐ కస్టమర్లకు విస్తృతమైన ఏటీఎం సేవలు అందుబాటులోకి వస్తాయని పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రకటించింది. వీరు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పీఎన్బీ ఏటీఎం సేవలను వాడుకోవచ్చు.
క్రెడిట్ కార్డులు పనిచేస్తాయా?
PNB ఖాతాదారులు వాడుతున్న క్రెడిట్ కార్డులు ఎప్పటిలాగే పనిచేస్తాయి. కార్డుపై ఉండే వ్యాలిడిటీ తేదీ వరకు ఇవి చెల్లుబాటు అవుతాయి. క్రెడిట్ కార్డు గడువు ముగిసిన తరువాత PNB వాటిని రెన్యువల్ చేస్తుంది. OBC బ్యాంకు కస్టమర్లు వాడుతున్న క్రెడిట్ కార్డులు కూడా వ్యాలిడిటీ వరకు పనిచేస్తాయి. గడువు ముగిసిన తరువాత కొత్త క్రెడిట్ కార్డు కోసం PNBలో సంప్రదించాలి. UBI బ్యాంకు కస్టమర్లు వాడుతున్న క్రెడిట్ కార్డులు కూడా వ్యాలిడిటీ ఉన్నంత వరకు పనిచేస్తాయి. ఈ గడువు ముగిసిన తరువాత PNBలో రెన్యువల్ చేయించుకోవాలి.
రెండో పెద్ద బ్యాంకుగా మారనున్న PNB
గతంలో బ్యాంకింగ్ రంగం ఒడిదొడుకులను ఎదుర్కొన్న నేపథ్యంలో బ్యాంకుల విలీనం చేపట్టాలని నిర్ణయించామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ ప్రకటన 2019 ఆగస్టులో వెలువడింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో మిగతా రెండింటి విలీనం పూర్తయిన తరువాత, పీఎన్బీ రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారనుంది.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.