Home /News /business /

ALL YOU NEED TO KNOW ABOUT NETWORK HOSPITALS IN HEALTH INSURANCE MK GH

Insurance Network Hospitals: ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా? నెట్‌వర్క్ ఆసుపత్రుల గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు ఇవే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు... చివరి క్షణం వరకు డబ్బు సమకూర్చుకోవడం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్య బీమాదారు నేరుగా నెట్‌వర్క్ ఆసుపత్రి బిల్లులను కట్టేస్తారు. తద్వారా పాలసీదారుడిపై ఆసుపత్రిలో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఎలాంటి భారం పడదు.

ఇంకా చదవండి ...
ఎంత జాగ్రత్తగా ఉన్నా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరూ ప్రాణాంతకమైన వ్యాధుల బారిన పడతారని కరోనా మనందరికీ తెలియజేసింది. అనారోగ్యానికి గురై ఆసుపత్రి బారిన పడితే ఆ ఖర్చులు భరించడం ఎంత కష్టమో కూడా అందరికీ తెలిసొచ్చింది. ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయాల్సిన అవసరం.. క్లెయిమ్‌లను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆసుపత్రుల కీలక పాత్రలను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యంగా మారింది. అయితే ఆసుపత్రిలో చేరి ఆరోగ్య బీమా క్లెయిమ్ చేసే సమయం వచ్చే వరకూ చాలామంది బీమాలోని నాన్-నెట్‌వర్క్ హాస్పటల్స్, నెట్‌వర్క్ హాస్పటల్స్ గురించి తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు ఇంతకీ ఈ రెండు హాస్పిటల్స్ జాబితాకి మధ్య తేడాలు ఏంటి? వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటి? తెలుసుకుందాం

Life Certificate: లైప్‌ సర్టిఫికేట్‌ సమర్పించకపోతే పెన్షన్‌ కట్.. బ్యాంకుకు వెళ్లకుండా దీన్ని సమర్పించడం ఎలా?


నెట్‌వర్క్ హాస్పిటల్స్ వర్సెస్ నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్స్

మీరు సమగ్ర ఆరోగ్య బీమా పథకాన్ని కొనుగోలు చేసినప్పుడు.. బీమా కంపెనీ మీకు నెట్‌వర్క్ హాస్పిటల్స్ కి సంబంధించి ఒక లిస్ట్ అందిస్తుంది. ఈ జాబితాలో పేర్కొన్న నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ బీమా కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఉంటాయి. బీమా కంపెనీలు, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ రెండూ కలిసి పాలసీదారునికి బీమా లేదా నగదు రహిత(cashless) ఆసుపత్రి ప్రయోజనాన్ని అందిస్తాయి.

నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు... చివరి క్షణం వరకు డబ్బు సమకూర్చుకోవడం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆరోగ్య బీమాదారు నేరుగా నెట్‌వర్క్ ఆసుపత్రి బిల్లులను కట్టేస్తారు. తద్వారా పాలసీదారుడిపై ఆసుపత్రిలో జాయిన్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఎలాంటి భారం పడదు.

అయితే మీరు నాన్-నెట్‌వర్క్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందితే.. ఆ సమయంలో అన్ని ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది. తరువాత మీరు మీ వైద్య ఖర్చులకు తిరిగి పొందుతారు.

నెట్‌వర్క్ ఆసుపత్రులు ఎలా పని చేస్తాయి?

ఆసుపత్రిలో చేరుతున్నట్లు ముందుగానే ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేస్తే నెట్‌వర్క్ హాస్పిటల్ కూడా తెలుసుకుంటుంది. తర్వాత పాలసీదారుడు లేదా అతని/ఆమెపై ఆధారపడే వ్యక్తులు బీమా, నగదు రహిత క్లెయిమ్ సంబంధిత ప్రశ్నలను పరిష్కరించడానికి ప్రతి ఆసుపత్రి బీమా డెస్క్ వద్ద అందుబాటులో ఉన్న ప్రీ-ఆథరైజేషన్ ఫారమ్‌ను దాఖలు చేయాలి. మీరు థర్డ్-పార్టీ అడ్మినిస్ట్రేటర్ (TPA) వెబ్‌సైట్ నుంచి డాక్యుమెంట్ ప్రింట్ అవుట్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారమ్ నింపిన తర్వాత, బీమా కొనుగోలు చేసిన వ్యక్తిని అడ్మిట్ చేసుకుంటారు. ఫారమ్‌ను సబ్మిట్ చేసిన తర్వాత హాస్పిటల్.. బీమా ఖాతాదారుడి వివరాలను వెరిఫై చేస్తుంది.

Amazon India: అమెజాన్ లో వెలుగుచూసిన అక్రమాలు.. ఆ మోసాలకు పాల్పడిందంటున్న నివేదికలు..


అలాగే మీ క్లెయిమ్‌కు సంబంధించిన వివరాలను మీ బీమా కంపెనీకి తెలియజేస్తుంది. అనంతరం మీ బీమా కంపెనీ క్లెయిమ్ రిక్వెస్ట్ అప్రూవ్ చేస్తుంది. మీ బీమా కంపెనీ వైద్య ప్రక్రియకు సంబంధించిన మొత్తం అమౌంట్ పేర్కొంటూ ఆసుపత్రికి ఒక అధికార లేఖను పంపుతుంది. ఆ తర్వాత మీరు క్లెయిమ్ చేసిన డబ్బును మీ బీమా సంస్థ నేరుగా ఆసుపత్రికి చెల్లిస్తుంది. బీమా సంస్థను బట్టి ఈ చెల్లింపుల ప్రక్రియ సుమారు 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుతుంది.

నాన్-నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చేరితే బీమా పాలసీ నిబంధనల ప్రకారం అప్రూవల్ పొందడానికి తగిన, సరైన కొన్ని ఖర్చులను కూడా బీమా కంపెనీ కవర్ చేయకపోవచ్చు. అందుకే వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం నెట్‌వర్క్ ఆసుపత్రుల జాబితాను చెక్ చేసుకొని ఆ ఆస్పత్రిలో చికిత్స పొందడమే ఉత్తమమైన పని. నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో చేరడం వల్ల ఎలాంటి భారీ పేపర్ వర్క్ లేకుండా నగదు రహిత క్లెయిమ్స్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్లు, బిల్స్ ఇలా అన్నిటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
Published by:Krishna Adithya
First published:

Tags: Health Insurance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు