సరుకు రవాణాపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బ్రాడ్‌గేజీ ట్రాక్‌పై ప్రపంచంలోనే అత్యధిక వేగంతో నడిచే సరుకు రవాణా ఎలక్ట్రిక్ రైళ్లను త్వరలోనే పూర్తి స్థాయిలో ట్రాక్ పైకి ఎక్కించనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రపంచాన్నే తలదన్నే రీతిలో రూపు దిద్దుకుంటున్న ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైలు గురించి పూర్తి వివరాలు.. భారతీయ రైల్వే వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దడానికి కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. అటు ప్యాసెంజర్ రైళ్లను ఆధునికీకరించడం, వందేభారత్ లాంటి అధునాతన రైల్వే వ్యవస్థలను దేశంలో ప్రవేశపెట్టడంతో పాటు సరుకు రవాణా రైళ్ల తయారీలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ముఖ్యంగా సరుకు రవాణాను వేగవంతం చేసి వీలైనంత త్వరగా డెలివరీ అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా అత్యాధునికమైన ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్‌ను తయారు చేయిస్తోంది. ముఖ్యంగా 12,000 హార్స్ పవర్‌తో దూసుకెళ్లేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు ముస్తాబవుతున్నాయి.
WAG12 B ప్రత్యేకతలు
బ్రాడ్ గేజ్(Broad Gage-WA), ఆల్టర్నేటింగ్ కరెంట్(Alternating Current-AC), గూడ్స్ ట్రాఫిక్(G) లోకోమోటివ్, 12,000 హార్స్‌పవర్(12)లతో WAG 12B మోడల్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు తయారవుతున్నాయి. ప్రపంచంలోనే బ్రాడ్ గేజీ ట్రాక్‌పై నడిచే ఏకైక ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ట్రైన్‌గా WAG 12B రికార్డుకెక్కింది. చైనా, రష్యా , జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్ తర్వాత మన దేశంలోనే సరుకు రవాణా కోసం ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు తయారు అవుతున్నాయి. త్వరలోనే ఈ లోకోమోటివ్ రైళ్లు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి.
2021, మే నెలలోనే ఈ WAG12 B లోకోమోటివ్ రైలుని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి శివ్‌పూర్ వరకు తొలిసారిగా పట్టాలపై నడిపించి చూశారు.
మేకిన్ ఇండియా
బిహార్‌లోని మాధేపూర ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ(Madhepura Electric Locomotive Factory)లో ఈ లోకోమోటివ్ రైళ్లు తయారవుతున్నాయి. మేకిన్ ఇండియా(Make In India) కార్యక్రమంలో భాగంగా ఫ్రాన్స్ కంపెనీ అల్‌స్టోమ్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి భారత ప్రభుత్వం ఈ రైళ్ల తయారీ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. ఇప్పటివరకు ప్లాంటులో 100 ఇంజిన్ల వరకు తయారయ్యాయి. 12,000 హార్స్‌పవర్‌తో నడిచే విధంగా సుమారు 800 లోకోమోటివ్ రైళ్లను తయారు చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఉంది. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ట్రైన్ హైలెట్స్
రెండు ఇంజిన్లతో ఈ రైలు తయారవుతోది. ఒకటి మాస్టర్ లోకో కాగా, మరొకటి స్లేవ్ లోకో. రైలులో సరుకు భారం లేని సమయంలో ఒక ఇంజినుతోనే నడపవచ్చు. లేదా, మాస్టర్ లోకో పనిచేయని సమయంలో స్లేవ్ లోకో ద్వారా ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. క్యాబిన్ మొత్తం ఎయిర్ కండిషన్ చేసి ఉంటుంది. 9000 కిలో వాట్ల ఇన్సులేటెడ్ గేట్ బయో పోలార్ ట్రాన్సిస్టర్ ఆధారిత ఇంజిన్లను కలిగి ఉంది. ట్విన్ బో బో(Bo Bo) వీల్ అరేంజ్‌మెంట్ కలిగి ఉంటుంది. పూర్తి స్థాయి లోడుతో కూడా ఈ ట్రైన్ గంటకు 120కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రైలు ఇంజిన్ యాక్సిల్ లోడు 22.5 టన్నులు కాగా.. దీనిని 25 టన్నుల వరకు విస్తరించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.