Breaking News | ఇన్ కం ట్యాక్స్ శాఖ సంచలన నిర్ణయం...

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేయాల్సిన ఆదాయపన్ను శాఖ రిటర్నులను దాఖలు చేసేందుకు ఈ ఏడాది జూలై 31 వరకు గడువు పొడిగిస్తూ ఇన్ కం ట్యాక్స్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Income Tax | రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది.

  • Share this:
    Income Tax | ఆదాయపన్ను శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ.5లక్షల కంటే తక్కువ ఉన్న పెండింగ్ ఇన్ కం ట్యాక్స్ రీ ఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయాలని నిర్ణయించింది. సుమారు 14 లక్షల మందికి దీని వల్ల లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అన్ని జీఎస్టీ, కస్టమ్ రీఫండ్స్‌ను వెంటనే రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించింది. దీని వల్ల సుమారు లక్ష సంస్థలకు, అందులోనూ చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు లబ్ధి చేకూరనున్నట్టు ఆదాయ పన్ను శాఖ పేర్కొంది. రూ.18,000 కోట్లను వెంటనే రీఫండ్ చేయడానికి ఆమోదం తెలిపింది. కరోనా వైరస్ వల్ల దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నెలకొంది. పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. ఈ సమయంలో ఐటీ శాఖ తీసుకున్న నిర్ణయం కంపెనీలకు కొంచెం ఊరట కలిగించే అవకాశంఉన్నట్టు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.



    ఇటీవల కేంద్ర ప్రభుత్వం రూ.లక్షా 70వేల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది. అందులో కంపెనీలకు కూడా కొన్ని ఉపశమనాలు కల్పించింది. 100 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగులు, అందులో 90 శాతం మంది రూ.15వేల కంటే తక్కువ నెలసరి వేతనాలు అందుకుంటుంటే, ఆయా కంపెనీల పీఎఫ్ నిధులను మూడు నెలల పాటు కేంద్రం చెల్లించేందుకు ముందుకొచ్చింది. దీని వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలగనుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: