Indian Railways: ఇక రైల్వేస్టేషన్లలో ఒకే ఎంట్రీ... ఎయిర్‌పోర్ట్ లాంటి సెక్యూరిటీ

Indian Railways | ప్రస్తుతం బిజీ రైల్వే స్టేషన్లలో వీలైనన్ని ఎక్కువ మార్గాలు ఉండటంతో ప్రయాణికులు మాత్రమే కాకుండా నేరగాళ్లు, అసాంఘిక శక్తులు సైతం రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: June 5, 2019, 6:18 PM IST
Indian Railways: ఇక రైల్వేస్టేషన్లలో ఒకే ఎంట్రీ... ఎయిర్‌పోర్ట్ లాంటి సెక్యూరిటీ
Indian Railways: ఇక రైల్వేస్టేషన్లలో ఒకే ఎంట్రీ... ఎయిర్‌పోర్ట్ లాంటి సెక్యూరిటీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ సరిగ్గా ఉండదని, తనిఖీలు కూడా అంతంతమాత్రంగా ఉందని కంప్లైంట్ చేసేవారికి శుభవార్త. ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా ఎయిర్‌పోర్ట్ లాంటి సెక్యూరిటీ ఏర్పాట్లు కనిపించనున్నాయి. ప్రయాణికుల భద్రత కోసం దేశంలోని ప్రధానమైన రైల్వే స్టేషన్లలో సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేయనునుంది భారతీయ రైల్వే. స్టేషన్లలో అన్ని మార్గాలను మూసేస్తారు. కేవలం సెక్యూరిటీ చెకింగ్ ఉన్న మార్గాన్ని మాత్రమే తెరిచి ఉంటుంది. టికెట్లు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు భద్రతా సిబ్బంది. దీని ద్వారా ఎవరుపడితే వాళ్లు రైల్వే స్టేషన్‌లోకి వచ్చి ప్లాట్‌ఫామ్‌పై టైంపాస్ చేసే దృశ్యాలు ఇక కనిపించవు. అంతేకాదు... టికెట్ లేకుండా రైలు ఎక్కే ప్రయాణికులకు కూడా అడ్డుకట్ట వేయొచ్చు. ప్రస్తుతం బిజీ రైల్వే స్టేషన్లలో వీలైనన్ని ఎక్కువ మార్గాలు ఉండటంతో ప్రయాణికులు మాత్రమే కాకుండా నేరగాళ్లు, అసాంఘిక శక్తులు సైతం రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అందుకే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్‌ని తగ్గించి వాటిని ఆర్‌పీఎఫ్ ఆధీనంలోకి తీసుకోనుంది.

Read this: Cricket Score: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై లైవ్ క్రికెట్ స్కోర్... గూగుల్ స్పెషల్ ఫీచర్ ఇలా వాడుకోండి

రైల్వే స్టేషన్ ఎంట్రీ పాయింట్స్‌లో స్కానింగ్ గ్యాడ్జెట్స్ కూడా ఉంటాయి. సుశిక్షితులైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండోలను ఎంట్రీ పాయింట్ దగ్గర రైల్వే నియమించనుంది. రైల్వే స్టేషన్లలో భద్రతా చర్యల్ని పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం రూ.114.18 కోట్లు మంజూరు చేసింది. మొదట ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో అత్యాధునిక భద్రతా ఏర్పాట్లను చేస్తారు. ఆ తర్వాత మిగతా రైల్వే స్టేషన్లలో భద్రత పెంచుతారు. ఏఏ రైల్వే స్టేషన్లలో ఎయిర్‌పోర్ట్ తరహా భద్రతా ఏర్పాట్లు చేయాలో ఇప్పటికే నిపుణులు గుర్తించారు. మొదట హాబీగంజ్, గాంధీనగర్ రైల్వే స్టేషన్లలో మొదట భద్రతను పెంచనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై రైల్వే స్టేషన్లలో సరికొత్త భద్రతా వ్యవస్థను రూపొందిస్తారు.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

IRCTC: ఐఆర్‌సీటీసీ టీడీఆర్... ప్రయాణికులు తెలుసుకోవాల్సిన అంశాలివేIRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

IRCTC: ఐఆర్‌సీటీసీ టికెట్ బుకింగ్ ఏజెంట్ మీరూ కావొచ్చు... వివరాలు ఇవే
First published: June 5, 2019, 6:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading