ఈ వారంలో ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉన్నాయా? అయితే అలర్ట్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (AIBEA) ఒక రోజు సమ్మె ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు నవంబర్ 19న సమ్మెకు దిగబోతున్నాయి. దీంతో బ్యాంకింగ్, ఏటీఎం సేవలపై ప్రభావం తప్పదు. దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటారు. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నవంబర్ 19న సమ్మెకు దిగుతామని చాలారోజుల క్రితమే నోటీస్ ఇచ్చింది. ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్, మేనేజ్మెంట్స్తో సమావేశాలు కూడా జరిగాయి. చర్చలు సఫలం కానందున తాము నవంబర్ 19న సమ్మె చేస్తామని AIBEA స్పష్టం చేసింది.
నవంబర్ 19 మూడో శనివారం. సాధారణంగా మొదటి శనివారం, మూడో శనివారం బ్యాంకులకు వర్కింగ్ డే. ఆ రోజున బ్యాంకులు తెరిచే ఉంటాయి. అయితే నవంబర్ 19న బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు, ఏటీఎం సేవలకు అంతరాయం కలగక తప్పదు. మరుసటి రోజు ఆదివారం. ఆరోజున బ్యాంకులు తెరుచుకోవు. కాబట్టి వరుసగా రెండు రోజులు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. మళ్లీ నవంబర్ 21 నుంచి బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి.
ట్రేడ్ యూనియన్లపై దాడులు పెరుగుతుండటంతో పాటు ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రతపై భంగం కలుగుతోందని AIBEA ఆరోపిస్తోంది. ద్వైపాక్షిక సెటిల్మెంట్, I.D. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని AIBEA చెబుతోంది. సెటిల్ మెంట్లను ఉల్లంఘించి బదిలీల ద్వారా ఉద్యోగులపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోంది. ఇక CSB బ్యాంకులో వేతన సవరణ తిరస్కరించారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి వేధింపులు ఆపాలన్నది బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్. ద్వైపాక్షిక సెటిల్మెంట్ను గౌరవించాలని కోరుతున్నారు ఉద్యోగులు.
AIBEA పిలుపునిచ్చిన సమ్మెకు యునైటెడ్ ఫోరమ్ మద్దతు తెలిపింది. తమ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మేము వారి సమ్మె, డిమాండ్లకు మా పూర్తి మద్దతును అందిస్తామని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) తెలిపింది. తాము ద్వైపాక్షికత, పరస్పర చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి కూడా కట్టుబడి ఉన్నామని UFBU తెలిపింది.
Govt Schemes: మీకు ఏఏ ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి? సింపుల్‌గా తెలుసుకోండి ఇలా
ప్రభుత్వ బ్యాంకుస ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు దిగుతుండటంతో తమ బ్యాంక్ బ్రాంచ్‌లు, కార్యాలయాలు సమ్మెరోజున సజావుగా పనిచేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కార్యాలయాల పనితీరుపై ప్రభావం ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Holidays, Banking, Banking news, Banks strike, Personal Finance