Kia EV9: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) అదిరిపోయే డిజైన్లతో, అధునాతన టెక్నాలజీలతో వాహనాలను రిలీజ్ చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUVని పరిచయం చేసింది. EV9 అని పిలిచే ఈ SUVలో ఏడుగురు ప్రయాణికులు కూర్చోవచ్చు. ఇందులో 3 సీట్ల వరుస ఉంటుంది. అధునాతన టెక్నాలజీ, మోడర్న్ డిజైన్‌తో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటోన్న ఈ EV9 ఎస్‌యూవీ కొరియన్ మార్కెట్‌లో మొదటగా అమ్మకానికి రానుంది. ఈ ఫ్లాగ్‌షిప్ ఈవీ9 గురించి రేంజ్, స్పీడ్ వంటి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
కొరియన్ మార్కెట్‌లో EV9 ప్రీ-ఆర్డర్లు 2023 రెండవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. అలానే 2023, ద్వితీయార్థంలో కొన్ని ప్రపంచ మార్కెట్‌లలో సేల్స్ ప్రారంభం కానున్నాయి. EV9 ఫుల్ ఛార్జ్‌పై 541 కి.మీ కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ కారు 800-వోల్ట్ సిస్టమ్‌తో త్వరగా ఛార్జ్ అవుతుంది. కేవలం 15 నిమిషాలు ఛార్జ్ చేయడం ద్వారా 239 కి.మీలు ప్రయాణించవచ్చు.
కియా EV9 ఎలక్ట్రిక్ SUV సహజమైన, ఆధునిక అంశాలను మిళితం చేసే ప్రత్యేకమైన డిజైన్‌తో వచ్చింది. ఈ డిజైన్ మోడర్న్‌గా ఉంటూనే అందంగా కనిపిస్తుంది. ఇది క్లియర్-కట్ లైన్లు, సర్ఫేస్‌లు, వెర్టికల్ హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ ప్యాటర్న్ లైటింగ్ గ్రిల్ వంటి ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్లతో సింపుల్ ఇంకా బోల్డ్ డిజైన్‌తో చాలా అట్రాక్టివ్‌గా ఉంది.
ఇక GT-లైన్ మోడల్ బ్లాక్ కలర్ పాలెట్, ప్రత్యేకమైన లైటింగ్ గ్రిల్ (Digital Pattern Lighting Grille)తో కారు లుక్‌ను మారుస్తుంది. కియా మోటార్స్ ప్రెసిడెంట్, CEO హో సంగ్ సాంగ్ మాట్లాడుతూ.. EV9 ఎలక్ట్రిక్ SUV సాంప్రదాయ SUV డిజైన్, ఇంజనీరింగ్‌లో ఒక పురోగతికి నిదర్శనం అన్నారు. ఇది కుటుంబ సభ్యులందరి అవసరాలను తీరుస్తుందని పేర్కొన్నారు.
HDFC: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్.. పెరిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
* బ్యాటరీ, స్పీడ్ రేంజ్
కియా EV9 ఏరోడైనమిక్ డిజైన్, వివిధ సీటింగ్ ఆప్షన్స్‌తో అద్భుతమైన పనితీరును కనబరుస్తుంది. ఇది విభిన్న ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ కాన్ఫిగరేషన్‌లతో వస్తుంది. EV9 RWD లాంగ్ రేంజ్ మోడల్‌లో 150 kW ఎలక్ట్రిక్ మోటారు ఇవ్వగా, అది 9.4 సెకన్లలో 0-100 kmph వెళ్లగలదు. అయితే AWD వేరియంట్ రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో గంటకు 0-100కి.మీ వేగాన్ని కేవలం 6.0 సెకన్లలో చేరుకోగలదు.
బ్యాటరీ నుంచి శక్తిని డిశ్చార్జ్ చేయడానికి వెహికల్-టు-లోడ్ (V2L) అనే ఫీచర్‌ను EV9 SUVలో ఇచ్చారు. ఇది హైవే డ్రైవింగ్ పైలట్ (HDP) సిస్టమ్‌తోనూ వస్తుంది. HDP అనేది షరతులతో కూడిన లెవెల్ 3 అటానమస్ డ్రైవింగ్‌ను ఆఫర్ చేస్తుంది. EV9 GT-లైన్ మోడల్‌లో HDP సిస్టమ్‌ను పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది. దీని వల్ల డ్రైవర్ కొన్ని ప్రాంతాలలో వాహనాన్ని డ్రైవ్/కంట్రోల్ చేయకుండా కొంత సమయం పాటు విరామం తీసుకోవచ్చు.
* సేఫ్టీ ఫీచర్లు
ఈ కారు రిమోట్ స్మార్ట్ పార్కింగ్ అసిస్ట్ 2 (RSPA 2), లేన్ కీపింగ్ అసిస్ట్ (LKA), బ్లైండ్-స్పాట్ కొలిషన్-ఎవాయిడెన్స్ అసిస్ట్ (BCA), నావిగేషన్ ఆధారిత స్మార్ట్ క్రూయిజ్ కంట్రోల్ (NSCC) వంటి భద్రతా ఫీచర్లు ఉన్న అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), హైవే డ్రైవింగ్ అసిస్ట్ 2 (HDA 2), ఇంటెలిజెంట్ స్పీడ్ లిమిట్ అసిస్ట్ (ISLA), పార్కింగ్ కొలిజన్- అవైడెన్స్ అసిస్ట్ (PCA), రియర్ క్రాస్-ట్రాఫిక్ కొలిజన్-అవాయిడెన్స్ (RCCA)తో వస్తుంది. RSPA 2 వాహనాన్ని డ్రైవర్ లేకుండానే పార్క్ చేసేలా చేస్తుంది. ఇతర ఫీచర్లు డ్రైవర్‌కి సురక్షితంగా డ్రైవ్ చేయడానికి తోడ్పడతాయి. కియా ప్రపంచవ్యాప్తంగా EV9ని సియోల్ మొబిలిటీ షో 2023లో ప్రారంభించి, ఆపై ఏప్రిల్‌లో జరిగే న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షోలో ప్రమోట్ చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Electric Car, Kia cars, KIA Motors