హోమ్ /వార్తలు /బిజినెస్ /

BYD ATTO 3 SUV: ఇండియాలో బీవైడీ అట్టో 3 ఎస్‌యూవీ లాంచ్.. ధర, ఫీచర్స్‌ ఇవే..

BYD ATTO 3 SUV: ఇండియాలో బీవైడీ అట్టో 3 ఎస్‌యూవీ లాంచ్.. ధర, ఫీచర్స్‌ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BYD ATTO 3 SUV: ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బీవైడీ ఇండియా (BYD India), సరికొత్త ఎలక్ట్రిక్ SUV అట్టో 3 (BYD ATTO 3)ను భారత్‌లో లాంచ్ చేసింది. ఆల్ ఎలక్ట్రిక్ SUVగా వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ SUV కారు ధరను రూ.33.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఆల్ ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

BYD ATTO 3 SUV: ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఈ నేపథ్యంలో వాహన తయారీ కంపెనీలు సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బీవైడీ ఇండియా (BYD India) కూడా సరికొత్త ఎలక్ట్రిక్ SUV అట్టో 3 (BYD ATTO 3)ను భారత్‌లో లాంచ్ చేసింది.

బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఇండియా భారత మార్కెట్లో అట్టో 3 EV SUVని అక్టోబర్ నెలలోనే ఆవిష్కరించింది. అలానే ఈ ఎలక్ట్రిక్ SUV బుకింగ్స్‌ను రూ.50,000 టోకెన్ అమౌంట్‌తో అక్టోబర్ 11న ప్రారంభించింది. కాగా ఇప్పటివరకు దాదాపు 1,500 బుకింగ్స్‌ నమోదైనట్లు కంపెనీ వెల్లడించింది. మొదటి 500 యూనిట్ల డెలివరీలు 2023, జనవరి నుంచి ప్రారంభిస్తామని పేర్కొంది. ఈ కారు అన్ని BYD ఇండియా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. షోరూమ్‌కి వెళ్లి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ కారు బౌల్డర్ గ్రే, పార్కర్ రెడ్, స్కీ వైట్, సర్ఫ్ బ్లూ అనే నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో వచ్చింది.

భారీ షాక్.. ఏకంగా రూ.5,400 వరకు పెరిగిన బంగారం, వెండి! జస్ట్ 7 రోజుల్లోనే.

* BYD ATTO 3 ఫీచర్స్

అట్టో 3 SUVలో L2 అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) BYD డిపైలట్, 7 ఎయిర్‌బ్యాగ్స్‌, పనోరమిక్ సన్‌రూఫ్, 12.8-అంగుళాల అడాప్టివ్ రొటేటింగ్ స్క్రీన్, 360° హోలోగ్రాఫిక్ ట్రాన్స్‌పరెంట్‌ ఇమేజింగ్ సిస్టమ్, NFC కార్డ్ కీ.. వెహికల్ టు లోడ్ (VTOL) మొబైల్ పవర్ స్టేషన్, వైర్‌లెస్ ఛార్జింగ్, వన్-టచ్ ఎలక్ట్రిక్ కంట్రోల్ టెయిల్‌గేట్, 8-స్పీకర్ ఆడియో సిస్టమ్, ఎలక్ట్రిక్ సీట్ అడ్జస్ట్‌మెంట్, వాయిస్ కంట్రోల్, LED హెడ్‌ల్యాంప్‌లు, LED బ్యాక్ లైట్లు, మల్టీ-కలర్ గ్రేడియంట్ యాంబియంట్ లైటింగ్, PM 2.5 ఎయిర్ ఫిల్టర్, CN95 ఎయిర్ ఫిల్టర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

Maruti Cars: గుడ్ న్యూస్ చెప్పిన మారుతి సుజుకీ.. పెరగనున్న ఆ కార్ల మైలేజీ... లీటర్‌కు ఎంతంటే..

* బ్యాటరీ, ఛార్జింగ్, రేంజ్

బీవైడీ అట్టో 3 ఎస్‌యూవీ బోర్న్ EV ప్లాట్‌ఫామ్ (e-Platform 3.0) ఆధారంగా బ్లేడ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ కారు కేవలం 50 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఇది 60.48kWh హయ్యర్ బ్యాటరీ కెపాసిటీతో సింగిల్ ఛార్జ్‌పై 521 కి.మీల రేంజ్ ఆఫర్ చేస్తుంది. ఇది జస్ట్ 7.3 సెకన్లలోనే 0 నుంచి 100kmph స్పీడ్ అందుకుంటుంది. దీనిని కొనుగోలు చేసే వారికి కంపెనీ 7kW హోమ్ ఛార్జర్... దాని ఇన్‌స్టాలేషన్ సర్వీస్, 3kW పోర్టబుల్ ఛార్జింగ్ బాక్స్, 3 సంవత్సరాల ఉచిత 4G డేటా సబ్‌స్క్రిప్షన్, 6 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 6 ఫ్రీ మెయింటెనెన్స్ సర్వీసులు అందిస్తోంది.

* బ్యాటరీ వారంటీ

బీవైడీ అట్టో 3 ట్రాక్షన్ బ్యాటరీకి 8 ఏళ్లు లేదా 1.6 లక్షల కిలోమీటర్లు (ఏది ముందు అయితే అది), మోటారు & మోటార్ కంట్రోలర్‌కి 8 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్లు (ఏది ముందు అయితే అది), వెహికల్‌కి 6 ఏళ్లు లేదా 1.5 లక్షల కిలోమీటర్ల (ఏది ముందు అయితే అది) వారంటీని కంపెనీ ఆఫర్ చేస్తోంది.

ఆల్ ఎలక్ట్రిక్ SUVగా వస్తున్న ఈ ఫ్లాగ్‌షిప్ SUV కారు ధరను రూ.33.99 లక్షలు (ఎక్స్‌షోరూం, ఆల్ ఇండియా)గా కంపెనీ నిర్ణయించింది. ఈ కారుకు హ్యుందాయ్ కోనా, MG eZS ఎలక్ట్రిక్ కార్లు పోటీ ఇవ్వనున్నాయి. అయితే అట్టో 3 ధర వీటి కంటే దాదాపు రూ.10 లక్షలు ఎక్కువ ఉండటం గమనార్హం.

First published:

Tags: Business, Electric cars

ఉత్తమ కథలు