ఆటోమొబైల్ కంపెనీలు ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో ప్యాసింజర్ వెహికల్స్‌తో పాటు ఎస్‌యూవీలను కూడా రూపొందిస్తున్నాయి. భవిష్యత్తులో ప్రీమియం ఈవీ మోడల్స్ మార్కెట్లో ఎక్కువగా సందడిచేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో హైరేంజ్ వెహికల్స్‌ను తయారుచేసే జర్మన్ ఆటోమోటివ్ బ్రాండ్ ఆడి కంపెనీ కూడా తాజాగా ఒక ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. ‘ఆడి Q8 ఇ-ట్రాన్ SUV’ పేరుతో దీన్ని డిజైన్ చేసింది. ఇది బ్రాండ్ నుంచి రానున్న ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUVగా గుర్తింపు పొందింది. ఈ లేటెస్ట్ వెహికల్స్ ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు చూద్దాం.
ఆడి క్యూ8 ఇ-ట్రాన్ ఎస్‌యూవీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 330 మైళ్ల (సుమారు 531 కిమీ) WLTP డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ లేటెస్ట్ SUVతో పాటు కంపెనీ Q8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ వెర్షన్‌ను కూడా రూపొందిస్తోంది. ఆడి SQ8 స్పోర్ట్‌బ్యాక్ ఇ-ట్రాన్ పేరుతో ఇది రిలీజ్ కానుంది. ఈ కారు 343 మైళ్ల (సుమారు 550+ కిమీ) WLTP రేంజ్‌ను అందిస్తుంది. క్యూ8 ఇ-ట్రాన్ మూడు వేరియంట్లతో కలిపి ఆడి మొత్తం నాలుగు మోడళ్లను ఆవిష్కరించింది. కొత్త క్యూ8 ఇ-ట్రాన్, క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్, ఎస్‌క్యూ8 ఇ-ట్రాన్, ఎస్‌క్యూ8 ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్‌లను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనుంది. SUV వెర్షన్ 2023 మధ్యలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ధర ఎంత?
ఈ SUV సేల్స్ నవంబర్ మధ్యలో UKలో ప్రారంభం కానున్నాయి. కంపెనీ అదే సమయంలో దీని ధరను ప్రకటించనుంది. ఈ వెహికల్ డెలివరీలు 2023 ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. అంటే కంపెనీ 2023 రెండో అర్ధభాగంలో దీన్ని ఇండియాలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
బ్యాటరీ, డ్రైవింగ్ రేంజ్
క్యూ8 ఇ-ట్రాన్ మోడల్, ఆడి క్వాట్రో ఆల్-వీల్-డ్రైవ్ స్టాండర్డ్ ఫీచర్‌తో వస్తుంది. ఇది మొత్తం మూడు డ్రైవ్‌ట్రెయిన్ వేరియంట్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ ఆడి Q8 50 ఇ-ట్రాన్ (Audi Q8 50 e-tron) వేరియంట్ 95kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో ఇది రన్ అవుతుంది. ఇవి 337 bhp పవర్‌ను, 664 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వేరియంట్ 200 kmph గరిష్ట వేగాన్ని అందుకోగలదు. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కిమీల డ్రైవ్ రేంజ్‌ను అందిస్తుంది.
మిడ్ రేంజ్ ఆడి క్యూ8 55 ఇ-ట్రాన్ (Audi Q8 55 e-tron)లో 114kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంట్లోని రెండు ఎలక్ట్రిక్ మోటార్లు 404 బీహెచ్‌పీ పవర్ అవుట్‌పుట్, 664 ఎన్ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. సింగిల్ ఛార్జ్‌తో ఇది 531 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఈ సిరీస్‌లో టాప్ వెర్షన్ అయిన ఆడి SQ8 ఇ-ట్రాన్ (Audi SQ8 e-tron)లో మూడు ఎలక్ట్రిక్ మోటార్లు ఉంటాయి. వీటి సాయంతో వెహికల్ గరిష్టంగా 497 bhp పవర్‌ను, 973 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీకి కాగా, డ్రైవింగ్ రేంజ్ 457 కిమీ వరకు ఉంటుంది.
డిజైన్
కొత్త Q8 ఇ-ట్రాన్ కార్పొరేట్ ఐడెంటిటీతో వస్తుంది. బయటివైపు ఐకానిక్ ఫోర్ రింగ్ టూ-డైమెన్షనల్ ఐకాన్ ఉంది. కొత్తగా B-పిల్లర్‌పై ఆడి లోగోతో మోడల్ లెటరింగ్ ఉంది. 4,915 mm పొడవు, 1,937 mm వెడల్పు, 1,633 mm ఎత్తు ఉండే ఈ ఎలక్ట్రిక్ SUV వీల్ బేస్ 2,928 mm, బూట్ కెపాసిటీ 569 లీటర్లుగా ఉంది. ముందు భాగంలో 62 లీటర్ల 'ఫ్రాంక్' స్పేస్, ఈ వెహికల్ మరో ప్రత్యేకత.
ఆడి Q8 ఇ-ట్రాన్ ఫీచర్లు
ఎలక్ట్రిక్ SUV ఎయిర్-స్ప్రింగ్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), రిమోట్ పార్క్ అసిస్ట్ ప్లస్, డిజిటల్ మ్యాట్రిక్స్ LED హెడ్‌లైట్స్, 10.1-అంగుళాల డిస్‌ప్లే, వాయిస్ కంట్రోల్‌తో కూడిన MMI టచ్ రెస్పాన్స్ ఆపరేటింగ్ సిస్టమ్, ఫుల్ HD ఆడి వర్చువల్ కాక్‌పిట్ వంటివి.. Q8 ఇ-ట్రాన్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు. ఆడి క్యూ8 ఇ-ట్రాన్‌లో ఐదు రాడార్ సెన్సార్లు, ఐదు కెమెరాలు, 12 అల్ట్రాసోనిక్ సెన్సార్లు ఉంటాయి. వీటి సాయంతో దాదాపు 40 డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి.
ఛార్జింగ్ స్పెసిఫికేషన్లు
ఈ ఎలక్ట్రిక్ SUV బ్యాటరీని DC ఛార్జింగ్ స్టేషన్‌లో కేవలం 31 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ SUVని 11kW AC ఛార్జర్ సహాయంతో కూడా ఛార్జ్ చేయవచ్చు. కంపెనీ 22kW వరకు ఆప్షనల్ AC ఛార్జింగ్ అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. అయితే Q8 ఇ-ట్రాన్‌ను పూర్తిగా ఛార్జ్ చేయడానికి 11kW పవర్ సోర్స్‌పై దాదాపు తొమ్మిది గంటల 15 నిమిషాలు, 22kW పవర్ సోర్స్‌పై దాదాపు నాలుగు గంటల 45 నిమిషాల సమయం పడుతుంది. Q8 55 e-tronలోని పెద్ద బ్యాటరీని 11 kW వద్ద 11 గంటల 30 నిమిషాలలో, 22 kW వద్ద ఆరు గంటలలో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు.
పాత మోడళ్లకు బదులుగా..
ఆడి కంపెనీ ఇండియా సహా గ్లోబల్ మార్కెట్లలో ఇంతకుముందు విక్రయించిన ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ SUV స్థానంలో Q8 ఇ-ట్రాన్ మార్కెట్లోకి రానుంది. అన్ని కొత్త మోడళ్లు పాత లైనప్‌తో పోలిస్తే అనేక డిజైన్ మార్పులతో వస్తాయి. కార్ల పనితీరును పెంచే కొత్త బ్యాటరీలను కంపెనీ వీటిలో అందించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.