Home /News /business /

ALL 12 DIGIT NUMBERS ARE NOT AADHAAR SAYS UIDAI KNOW HOW TO VERIFY AADHAAR NUMBER THROUGH ONLINE AND OFFLINE SS

Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా

Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Aadhaar Number: ఆధార్ నెంబర్ సరైనదేనా? వెరిఫై చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Verify Aadhaar Number | ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందో లేదో తెలుసుకోవాలా? ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఆధార్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    ఆధార్ నెంబర్‌లో 12 అంకెలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే 12 అంకెలు ఉన్నంతమాత్రాన అది ఆధార్ నెంబర్ కాదంటోంది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI. ఉదాహరణకు ఎవరిదైనా ఐడీ ప్రూఫ్ కోసం ఆధార్ నెంబర్ తీసుకున్నట్టైతే ఆ ఆధార్ నెంబర్‌ను వెరిఫై చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. 12 అంకెలు ఉన్నంత మాత్రానా అది ఆధార్ నెంబర్ కాదని, ఈ తరహా ఆధార్ మోసాలు జరుగుతున్నాయని యూఐడీఏఐ అప్రమత్తం చేస్తోంది. ఎవరైనా ఐడీ ప్రూఫ్‌గా ఆధార్ నెంబర్ ఇస్తే ఆ నెంబర్‌ను వెరిఫై చేయాలని కోరుతోంది. https://uidai.gov.in/ లేదా https://resident.uidai.gov.in/ వెబ్‌సైట్లలో ఆధార్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. మరి ఆధార్ నెంబర్‌ను ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోండి.

    Verify Aadhaar Number: ఆన్‌‌లైన్‌లో ఆధార్ నెంబర్ వెరిఫై చేయండి ఇలా


    ముందుగా UIDAI అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో My Aadhaar సెక్షన్‌లో Aadhaar services లిస్ట్‌లో Verify an Aadhaar Number పైన క్లిక్ చేయాలి.
    కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
    పైన చెప్పిన స్టెప్స్ కాకుండా నేరుగా https://resident.uidai.gov.in/ లింక్ ఓపెన్ చేసినా ఆధార్ వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది.
    అందులో 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Proceed to Verify పైన క్లిక్ చేయాలి.
    ఆ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా? లేదా డీయాక్టివేట్ చేశారా? అసలు అది ఆధార్ నెంబరేనా? అన్న విషయం తెలుస్తుంది.
    గ్రీన్ టిక్‌తో Aadhaar Number xxxxxxxxxxxx Exists అని కనిపిస్తే ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉన్నట్టే.

    Aadhaar Card Services: ఆధార్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... ఆ రెండు సేవల్ని నిలిపేసిన UIDAI

    Aadhaar Card: ఇంటర్నెట్ లేకపోయినా ఈ ఆధార్ సేవలు పొందొచ్చు


    ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్‌ను కూడా ఇలాగే వెరిఫై చేయొచ్చు. తమ ఆధార్ నెంబర్ యాక్టీవ్‌లో ఉందా లేదా అన్న విషయం తెలుసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే కాదు... ఆఫ్‌లైన్‌లో కూడా ఆధార్ నెంబర్ యాక్టీవ్‌గా ఉందో లేదో వెరిఫై చేయొచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.

    ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అవుతుందా?


    ఆధార్ కార్డు ఒకసారి జారీ చేసిన తర్వాత డీయాక్టివేట్ అవుతుందా అన్న సందేహం రావడం మామూలే. కొన్ని సందర్భాల్లో ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అవుతుంది. వరుసగా మూడేళ్లు ఆధార్ నెంబర్ ఎక్కడా ఉపయోగించకపోయినా డీయాక్టివేట్ అవుతుంది. ఐదేళ్ల లోపు పిల్లలు ఆధార్ కార్డు తీసుకున్నప్పుడు ఐదేళ్ల వయస్సు దాటగానే ఓసారి, 15 ఏళ్ల వయస్సు దాటగానే మరోసారి బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాలి. పిల్లలు తమ బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయించకపోయినా ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అవుతుంది.

    Aadhaar Bank Link: మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందా? తెలుసుకోండి ఇలా

    PAN Aadhaar Link Status: గతంలో పాన్, ఆధార్ లింక్ చేశారా? ఓసారి స్టేటస్ చెక్ చేయండి ఇలా

    డీయాక్టివేట్ అయిన ఆధార్ నెంబర్ ఎలా యాక్టీవ్ చేయించాలి?


    ఒకవేళ మీ ఆధార్ నెంబర్ డీయాక్టివేట్ అయినట్టైతే మళ్లీ యాక్టీవ్ చేయించడానికి ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లడం తప్పనిసరి. ఆధార్ అప్‌డేషన్ ఫామ్ తీసుకొని వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేయాలి. బయోమెట్రిక్ అప్‌డేట్ కోసం రూ.100 చెల్లించాలి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Aadhaar, Aadhaar card, AADHAR, UIDAI

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు