Home /News /business /

ALERT TO STATE BANK OF INDIA SBI CUSTOMERS ATM MONEY WITHDRAW RULES CHANGED HERE FULL DETAILS NS

State Bank of India: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATMలో డబ్బుల విత్ డ్రా రూల్స్ మార్పు.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) ఏటీఎం(ATM) విత్ డ్రా రూల్స్ లో మార్పులు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కస్టమర్లకు మెరుగైన సేవలను అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇంకా ఖాతాదారులు సైబర్ నేరాలకు(Cyber Frauds) గురి కాకుండా ఎప్పటికప్పుడు వారిని అలర్ట్ చేస్తూ ఉంటుంది. సైబర్ నేరగాళ్ల చేతుల్లో మోసపోకుండా ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయొద్దు? అన్న విషయాలపై ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా(Social Media) ఖాతాల ద్వారా వివరిస్తూ ఉంటుంది. తాజాగా స్టేట్ బ్యాంక్ ఏటీఎం(ATM) సెంటర్ల వద్ద మోసాలను నివారించడానికి కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. అదే ఓటీపీ(OTP) విధానం. ఈ విధానంతో స్టేట్ బ్యాంకు ఖాతాదారులు గతంలో లాగా ఏటీఎం సెంటర్ కు వెళ్లి క్యాష్ తీసుకోవడం కుదరదు. ఏటీఎం సెంటర్ కు వెళ్లే సమయంలో ఫోన్ ను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డబ్బులను విత్ డ్రా చేసే సమయంలో రిజిస్టర్ ఫోన్ నంబర్ కు వచ్చిన ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాతనే డబ్బులను విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

    ఇలా చేయడం ద్వారా నేరగాళ్ల నుంచి ఖాతాదారులకు రక్షణ ఏర్పడుతుందని బ్యాంకు తెలిపింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. అయితే ప్రస్తుతం ఈ విధానం SBI ఏటీఎంల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది. రూ. 10 వేల లోపు డబ్బులు డ్రా చేసుకునే వారు ఈ ఓటీపీ లేకుండానే డ్రా చేసుకోవచ్చు. రూ. 10 వేలు లేదా అంతకన్నా ఎక్కువ డ్రా చేసుకునే వారు మాత్రం తప్పనిసరిగా రిజిస్టర్ ఫోన్ నంబర్ కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సిందేనని బ్యాంకు స్పష్టం చేసింది.



    TSRTC MD Sajjanar: ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో శుభవార్త.. త్వరలోనే ఆ కార్డులు..

    ఈ విధానంతో డబ్బులు ఎలా డ్రా చేయాలంటే..
    -ఖాతాదారుడు ఏటీఎం సెంటర్ కు వెళ్లే సమయంలో డెబిట్ కార్డుతో పాటు, రిజిస్టర్ మొబైల్ నంబర్ ను వెంట తీసుకెళ్లాలి.
    -మొదట గతంలో లాగానే ఏటీఎం కార్డును ఇన్ సర్ట్ చేసి పిన్ నంబర్ ను నమోదు చేయాలి. అనంతరం విత్ డ్రా చేయాలనుకుంటన్న మొత్తాన్ని నమోదు చేయాలి.
    -అనంతరం మీరు విత్ డ్రా చేయాలనుకుంటున్న మొత్తం రూ. 10 వేల కన్నా ఎక్కువగా ఉంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు ఓటీపీ(OTP) వస్తుంది.
    -ఆ ఓటీపీని నమోదు చేసిన తర్వాత మీకు క్యాష్ వస్తుంది.
    -ఈ ఓటీపీ కేవలం ఒక సారి విత్ డ్రా చేసుకోవడానికి మాత్రమే పని చేస్తుంది. మళ్లీ విత్ డ్రా చేయాలంటే మరో సారి ఓటీపీ వస్తుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Atm withdrawal, Sbi, Sbi debit, State bank of india

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు