ALERT TO SENIOR CITIZENS THESE BANKS OFFERS 7 5 INTEREST RATES ON FIXED DEPOSITS NS GH
Fixed Deposits: సీనియర్ సిటిజన్ ఎఫ్డీలపై అధిక వడ్డీ అందిస్తోన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు.. వడ్డీ రేట్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
ఇటీవలి కాలంలో ప్రముఖ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. కానీ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం పోటీపోటీగా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.
భారతీయులు పొదుపుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. తమ ఆదాయంలో కొంత మొత్తాన్ని మంచి రాబడి వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్లో ఎన్ని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఉన్నా సరే.. ఫిక్స్డ్ డిపాజిట్ల వైపు ఎక్కువ మంది మొగ్గుచూపుతుంటారు. నష్టభయం లేని సురక్షిత పెట్టుబడి మార్గంగా ఫిక్స్డ్ డిపాజిట్లకు పేరుంది. అందుకే, రిస్క్ తక్కువగా తీసుకునే సీనియర్ సిటిజన్లు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో ప్రముఖ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. కానీ కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు మాత్రం పోటీపోటీగా ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తున్నాయి. ఏ బ్యాంకు ఎంత వడ్డీ ఇస్తుందో తెలుసుకుందాం.
జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఏడాది నుండి ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై, జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 7.55% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ వడ్డీ రేటు 2022 జనవరి 11 వర్తిస్తుంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50% వరకు వడ్డీ రేటును అందిస్తుంది. 366 రోజుల నుండి 729 రోజుల వరకు, 730 రోజుల నుండి 1095 కంటే తక్కువ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది. ఇక, 777 రోజుల్లో మెచ్యూర్ అయ్యే టర్మ్ డిపాజిట్లపై 7.50%, సాధారణ ప్రజలకు 7.00% వడ్డీ రేటు అందిస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్ల ఎఫ్డీపై మెరుగైన వడ్డీ అందజేస్తుంది. 365 రోజుల నుండి 699 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7% వడ్డీ రేటును అందిస్తుంది. 1000 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.40% వడ్డీ చెల్లిస్తుంది. ఈ రేట్లు 20 జనవరి 2022 నుండి వర్తిస్తాయి.
సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు వారి ఫిక్స్డ్ డిపాజిట్లపై 7% కంటే ఎక్కువ రాబడిని అందిస్తుంది. సీనియర్ సిటిజన్లు 3 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7.30%, 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 7% వడ్డీ రేటును పొందవచ్చు. ఈ వడ్డీ రేట్లు 9 సెప్టెంబర్ 2021 నుండి అమలులోకి వస్తాయి.
ఫిన్కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
59 నెలల నుండి 66 నెలల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.25% వడ్డీ రేటును అందిస్తుంది. ఈ రేట్లు 11 ఫిబ్రవరి 2022 నుండి వర్తిస్తాయి.
యస్ బ్యాంక్
మూడేళ్ల నుండి పదేళ్ల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7% వడ్డీ రేటు అందిస్తోంది. ఈ రేట్లు 4 జనవరి 2022 నుండి వర్తిస్తాయి.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.