Home /News /business /

ALERT TO POST OFFICE CUSTOMERS KNOW ABOUT THESE NEW RULES FOR POST OFFICE SAVINGS ACCOUNT NS GH

Postal Savings Account New Rules: పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్‌ ఖాతాదారులకు అలర్ట్.. మారిన రూల్స్.. తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోస్టల్ డిపార్ట్‌మెంట్ (Postal Department) నవంబర్ 5న ఒక ముఖ్యమైన సర్క్యులర్‌ జారీ చేసింది. పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ (POSB) అకౌంట్ల నిర్వహణకు సంబంధించిన నియమ, నిబంధనలను అందులో వివరించింది.

భారతదేశం(India)లోని వివిధ బ్యాంకులు(Banks), ఆర్థిక సంస్థల మాదిరిగానే పోస్టాఫీసులు(Post Office) కూడా ఆర్థిక సేవలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ (Postal Department) నవంబర్ 5న ఒక ముఖ్యమైన సర్క్యులర్‌ జారీ చేసింది. పోస్టాఫీస్ సేవింగ్స్ సేవింగ్స్ బ్యాంక్ (POSB) అకౌంట్ల నిర్వహణకు సంబంధించిన నియమ, నిబంధనలను అందులో వివరించింది. కొత్త పాస్‌బుక్ జారీ చేయడం, జాయింట్ అకౌంట్ తెరవడం, POSB చెక్ జారీ చేయడం.. వంటి వివిధ POSB కార్యకలాపాలపై మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ జాబితాలో ఉన్న ఎనిమిది అంశాలను చూద్దాం.

1. ఏదైనా ఇతర CBS POలో పాత పాస్‌బుక్‌కు బదులుగా తాజా పాస్‌బుక్ జారీ
పాత లేదా ఉపయోగించిన పాస్‌బుక్‌కు బదులుగా కొత్త పాస్‌బుక్ జారీ చేసే విధానాలను POSB CBS (కోర్ బ్యాంకింగ్ సర్వీసెస్‌) మాన్యువల్‌లోని రూల్ 44లో పోస్టల్ విభాగం నిర్దేశించింది. ఏదైనా CBS పోస్టాఫీస్‌కు సంబంధించిన పాత పాస్‌బుక్‌కు బదులుగా.. ఇతర CBS POలో తాజా పాస్‌బుక్‌ను జారీ చేయవచ్చని స్పష్టం చేసింది.
Motor Insurance: మీ మోటారు బీమా పాలసీని రెన్యువల్ చేస్తున్నారా? ఈ 5 విషయాలను తప్పక గుర్తుంచుకోండి..

2. జాయింట్ అకౌంట్
18.12.2019న జారీ చేసిన SB ఆర్డర్ నంబర్ 13/2019 సర్క్యులర్‌లో.. GSPR 2018 రూల్ 5(5) ఉంది. దీని ప్రకారం అంధులు లేదా దృష్టిలోపం ఉన్నవారు లేదా నిరక్షరాస్యులైన డిపాజిటర్లు.. అక్షరాస్యులైన డిపాజిటర్‌తో కలిసి జాయింట్ అకౌంట్ తెరవవచ్చు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ నిరక్షరాస్యులైన డిపాజిటర్లు సంయుక్తంగా జాయింట్ అకౌంట్ తెరవడంపై ఎలాంటి పరిమితులు లేవు. ఇద్దరు లేదా ముగ్గురు నిరక్షరాస్యులైన డిపాజిటర్లు సంయుక్తంగా లేదా నిరక్షరాస్యులైన డిపాజిటర్, అక్షరాస్యుడైన డిపాజిటర్ సంయుక్తంగా జాయింట్ అకౌంట్‌ తెరవవచ్చని స్పష్టం చేసింది.
Savings Account: బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? సేవింగ్స్ అకౌంట్స్ ఎన్ని రకాలో తెలుసా?

3. POSB చెక్
POSB CBS మాన్యువల్, POSB మాన్యువల్ వాల్యూమ్- Iలోని నిబంధనల ప్రకారం.. చెక్ సదుపాయాన్ని పొందాలనుకున్న డిపాజిటర్ అక్షరాస్యులై ఉండాలి. అకౌంట్‌లో రూ. 500 బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయడంతోపాటు సంతకం చేయగలగాలి. మైనర్లు సొంతంగా నిర్వహించుకునే అకౌంట్లకు చెక్ సౌకర్యం కల్పించలేదు. అక్షరాస్యులు, నిరక్షరాస్యులైన డిపాజిటర్లు తెరిచిన జాయింట్ సేవింగ్స్ అకౌంట్‌కు సంబంధించిన చెక్కు విషయంలో స్పష్టత లేదు.
Business Ideas: ఈ 8 ఐడియాలతో ఇంటి నుంచే డబ్బులు సంపాదించొచ్చు

4. ఇప్పటికే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ 'సింగిల్' అకౌంట్ ఉన్నవారు బేసిక్ సేవింగ్స్ అకౌంట్‌ తీసుకోవడం
ఏదైనా ఒక విభాగానికి సంబంధించి.. ఒక వ్యక్తి ఒక అకౌంట్‌ తీసుకోవడానికి మాత్రమే అర్హులని పోస్టల్ నిబంధనలు చెబుతున్నాయి. అయితే సంబంధిత నిబంధనల ప్రకారం బేసిక్ సేవింగ్స్ అకౌంట్‌ను ప్రత్యేక రకమైన అకౌంట్‌గా పరిగణించాలి. అంటే ఒక వ్యక్తి పోస్టాఫీస్ సేవింగ్స్ సింగిల్ అకౌంట్‌తో పాటు బేసిక్ సేవింగ్స్ అకౌంట్‌ కూడా తీసుకోవచ్చు.

5. బ్రాంచ్ పోస్టాఫీస్‌లో డిపాజిట్ల పరిమితి
చిన్న పొదుపు పథకాలైన MIS, SCSS, KVP, NSC, PPF డిపాజిట్లను ఫోస్టాఫీసులు స్వీకరించడానికి సంబంధించిన నిబంధనలను గతంలో నిర్దేశించారు. బ్రాంచ్ పోస్టాఫీస్‌లో ఒక రోజులో ఒక అకౌంట్‌లో నగదు స్వీకరించే పరిమితిని (Cash acceptance limit) రూ.25,000 నుంచి రూ. 50,000కు పెంచారు. అయితే విత్‌డ్రా ఫారం, చెక్కు ద్వారా క్యాష్ విత్‌డ్రాకు సంబంధించి ఒక రోజులో రూ.50,000 నిబంధన వర్తించదు.

6. ఏదైనా అకౌంట్‌కు సంబందించి సంరక్షకుడిని మార్చడం
GSPR 2018- రూల్ 10 (4) ప్రకారం.. సంరక్షకుడు మరణించిన సందర్భంలో మైనర్ లేదా అన్‌సౌండ్ మైండ్ వ్యక్తుల అకౌంట్‌లను వేరే సంరక్షకులు ఆపరేట్ చేయడానికి అర్హులు. అయితే ఇప్పటికే ఉన్న సంరక్షకుని మరణం లేదా కోర్టు ఆదేశాలపై మాత్రమే సంరక్షకుల మార్పు అంశం ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే ఉన్న సంరక్షకుని మరణ ధృవీకరణ పత్రం లేదా కోర్టు ఆదేశాలను కొత్త గార్డియన్ తాజా దరఖాస్తు ఫారమ్ (SB-AOF), KYC డాక్యుమెంట్‌లతో కలిపి సమర్పించాల్సి ఉంటుంది.

7. అకౌంట్ తీసుకునే సమయంలో డిపాజిటర్ హాజరు
GSPR 2018- రూల్ 4 ప్రకారం.. జాతీయ (చిన్న) పొదుపు పథకాలకు సంబంధించిన అకౌంట్లు తెరవడానికి భారతదేశ పౌరులు మాత్రమే అర్హులు. GSPR 2018- రూల్ 5 ప్రకారం.. సంబంధిత కార్యాలయాల్లోనే డిపాజిటర్ అకౌంట్ తెరవవచ్చు. అనుమతించిన ఎలక్ట్రానిక్ మోడ్‌ల ద్వారా కూడా ఇలాంటి అకౌంట్లు ఆన్‌లైన్‌ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన విధానాలకు అనుగుణంగా సంబంధిత ప్రభుత్వ సేవింగ్స్ బ్యాంక్ ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ల సాయంతో కూడా అకౌంట్ తీసుకోవచ్చు.

అయితే పోస్టాఫీసులో అకౌంట్ తీసుకునే వారు.. అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో తప్పకుండా హాజరు కావాలి. ఒకవేళ మైనర్ తరపున గార్డియన్ అకౌంట్ తెరిస్తే.. సంరక్షకుల హాజరు తప్పనిసరి. అధీకృత ఏజెంట్ల (SAS & MPKBY) ద్వారా అకౌంట్ తీసుకునే విషయంలో డిపాజిటర్ల హాజరు ఐచ్ఛికమని నిబంధనలు చెబుతున్నాయి. అయితే అకౌంట్ ఓపెనింగ్ ఫారంలు, KYC డాక్యుమెంట్‌లను పోస్టాఫీస్ సిబ్బంది సేకరించి, అధికారుల ముందు డిపాజిటర్ సంతకం తీసుకుంటే.. అలాంటి డిపాజిటర్ల హాజరు తప్పనిసరి కాదు.

8. జాయింట్ అకౌంట్‌లో జాయింట్ డిపాజిటర్ మార్పు
ఇప్పటికే తెరిచిన జాయింట్ అకౌంట్లోని డిపాజిటర్ల పేర్లను మార్చడం కుదరదు. జాయింట్ అకౌంట్‌లో డిపాజిటర్‌ను మార్చడానికి లేదా కొత్త డిపాజిటర్‌ను చేర్చుకోవడానికి అనుమతి లేదని నిబంధనలు చెబుతున్నాయి.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Indian postal, Post office, Post office scheme

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు