Bank Locker Rules: బ్యాంకు లాకర్ ఉపయోగిస్తున్న వారికి అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

లాకర్ భద్రత, బ్యాంకులు లాకర్లను నిర్వహిస్తున్న తీరును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమీక్షించింది. ఇందుకు సంబంధించిన పాత నిబంధనలు మార్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

  • Share this:
బ్యాంకు లాకర్ల (Bank Locker) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది తమ విలువైన ఆభరణాలు, ఆస్తుల పత్రాలను బ్యాంకు లాకర్లో భద్రపరుస్తుంటారు. లాకర్ సైజును బట్టి సంవత్సర కాలానికి వివిధ బ్యాంకులు వివిధ రకాలుగా ఛార్జీలు (Locker Rent) వసూలు చేస్తూ ఉంటాయి. ఈ లాకర్ల అద్దె ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా ఉంటుంది. కొన్ని బ్యాంకులైతే ఏకంగా టర్మ్ డిపాజిట్ (Term Deposit) చేస్తేనే లాకర్ కేటాయిస్తాయి. లాకర్ తెరవాలంటే సవాలక్ష నిబంధనలు పెడుతూ ఉంటాయి. అయితే తాజాగా లాకర్ భద్రత, బ్యాంకులు లాకర్లను నిర్వహిస్తున్న తీరును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సమీక్షించింది. ఇందుకు సంబంధించిన పాత నిబంధనలు (new locker guidelines) మార్చింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

కొత్త మార్గదర్శకాలు
చాలా బ్యాంకులు లాకర్ కేటాయించాలంటే కొంత మొత్తం టర్మ్ డిపాజిట్ చేయాలని ఒత్తిడి చేస్తుంటాయి. లాకర్ కేటాయించగానే యాన్యువల్ చార్జీలు వసూలు చేస్తాయి. అయితే తాజా నిబంధనల ప్రకారం బ్యాంకులో ఖాతా కలిగిన వ్యక్తులకు లాకర్ కేటాయించాలంటే టర్మ్ డిపాజిట్ చేయాలని వారిపై ఒత్తిడి చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఖాతాదారుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
SBI New Feature: మీరు ఎస్‌బీఐ కస్టమరా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

లాకర్ అద్దెను అడ్వాన్స్ గా తీసుకుని ఉంటే...
లాకర్ అద్దెను బ్యాంకులు అడ్వాన్స్‌గా తీసుకుని ఉంటే.. ఆ మొత్తాన్ని ఖాతాదారులకు తిరిగి చెల్లించాలి. ఎంతయితే లాకర్ అడ్వాన్స్ గా వసూలు చేశారో ఆ మొత్తం వారికి తిరిగి చెల్లించాలని ఆర్బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రకృతి విపత్తులు సంభవిస్తే బ్యాంకులు సాధ్యమైనంత త్వరగా ఖాతాదారులకు తెలియజేసేందుకు సమగ్ర పాలసీతో ముందుకు రావాలని సూచించింది.
Personal Loan: ఎలాంటి అవసరాల కోసం పర్సనల్ లోన్‌ను ఎంచుకోవాలి? రుణం పొందడానికున్న ఆప్షన్లు ఏవంటే..

లాకర్ జాగ్రత్తలు
లాకర్ లను జాగ్రత్తగా చూసుకునే విషయంలోనూ ఆర్బీఐ మార్గదర్శకాల్లో వివరించింది. లాకర్ సిస్టమ్, లాకర్ నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. లాకర్లు దొంగతనాలు, దోపిడీలకు గురైతే బ్యాంకులు బాధ్యత వహించాలని రిజర్వు బ్యాంకు ఆదేశించింది.
Bank of India: ఇల్లు, వాహనాలు కొనాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. వడ్డీరేట్లు తగ్గించిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. తాజా వడ్డీ రేట్లను పరిశీలించండి

కొత్త నిబంధనలు
కొత్త నిబంధనల ప్రకారం భూకంపాలు, వరదలులాంటి ప్రకృతి విపత్తుల కారణంగా లాకర్లకు నష్టం వాటిల్లితే బ్యాంకులు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అయితే అలాంటి విపత్తుల నుంచి రక్షించుకునేందుకు బ్యాంకులు సరైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ కొత్త మార్గదర్శకాల్లో సూచించింది. కొత్త నిబంధనల ప్రకారం లాకర్లలో ఎలాంటి ప్రమాదకర వస్తువులను దాచడానికి వీల్లేదనే నిబంధనను లాకర్ అగ్రిమెంటులో చేర్చాలని బ్యాంకులకు తెలిపింది. అగ్ని ప్రమాదం, బిల్డింగ్ కూలిపోవడం వల్ల నష్టం వాటిల్లితే లాకర్ అద్దెకు వందరెట్లకు సమానమైన మొత్తాన్ని బాధితులకు చెల్లించాలని ఆర్బీఐ మార్గదర్శకాల్లో పేర్కొంది.
Published by:Nikhil Kumar S
First published: