Alert: ట్రాన్సాక్షన్స్‌లో ఈ 6 తప్పులు చేస్తే జరిమానా తప్పదు

భారీ లావాదేవీలు చేసేవాళ్లు, కోట్లల్లో డబ్బులు పంపేవాళ్లకే ఐటీ నోటీసులు వస్తాయనుకుంటే పొరపాటే. చిన్నచిన్న తప్పులు చేస్తే మీకూ ఐటీ నోటీసులు రావచ్చు జాగ్రత్త.

news18-telugu
Updated: February 9, 2019, 5:06 PM IST
Alert: ట్రాన్సాక్షన్స్‌లో ఈ 6 తప్పులు చేస్తే జరిమానా తప్పదు
Alert: ట్రాన్సాక్షన్స్‌లో ఈ 6 తప్పులు చేస్తే జరిమానా తప్పదు
news18-telugu
Updated: February 9, 2019, 5:06 PM IST
నల్లధనాన్ని అరికట్టేందుకు ఆదాయపు పన్ను శాఖ నిబంధనల్ని కఠినతరం చేస్తోంది. ఇప్పటికే వేలాది మంది ట్యాక్స్ పేయర్స్‌కి నోటీసులు వెళ్తున్నాయి. కారణం చిన్నచిన్న తప్పులే. తెలియక చాలామంది అలాంటి తప్పులు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నారు. మరి మీరు కూడా లావాదేవీల సమయంలో అలాంటి తప్పులే చేస్తే నోటీసులు, జరిమానాలు తప్పవు. మరి ఆ తప్పులేంటీ? మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకోండి.

1. రూ.20,000 కన్నా ఎక్కువ నగదు అప్పుగా ఇవ్వడం, డిపాజిట్ చేయడం


అప్పులు చేయనివాళ్లుండరు. ఏదో ఓ అవసరానికి అప్పులు తప్పవు. అయితే రూ.20,000 కన్నా ఎక్కువ నగదు రూపంలో అప్పు తీసుకున్నా, అప్పు ఇచ్చినా అంతే మొత్తం జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం రూ.20,000 కన్నా ఎక్కువ నగదు రూపంలో లావాదేవీలు జరగకూడదు. ఈ తప్పు చేస్తే సెక్షన్ 271డీ ప్రకారం జరిమానా తప్పదు.

Read this: IRCTC Account: ఐఆర్‌‌సీటీసీ అకౌంట్ కావాలా? ఇలా క్రియేట్ చేసుకోండి

income tax notice, income tax penalty, income tax act, income tax prosecution, it act, it notice, ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్, ఐటీ నోటీస్, ఇన్‌కమ్ ట్యాక్స్ పెనాల్టీ, ఐటీ పెనాల్టీ


2. వృత్తి, వ్యాపారానికి సంబంధించిన ఖర్చుల కోసం రూ.10,000 కన్నా ఎక్కువ నగదు రూపంలో చెల్లించడం
మీకేదైనా వ్యాపారం ఉందా? లేక ఉద్యోగం చేస్తున్నారా? అందుకు సంబంధించి ఏవైనా ఖర్చుల కోసం రూ.10,000 కన్నా ఎక్కువ నగదు రూపంలో లావాదేవీలు జరపడం కూడా తప్పే. ఇలాంటి ఖర్చులపై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌లో ఎలాంటి మినహాయింపులు ఉండవు.

3. ట్రస్టులు, రాజకీయ పార్టీలకు రూ.2,000 కన్నా ఎక్కువ నగదు విరాళం ఇవ్వడం


పన్ను మినహాయింపుల కోసం విరాళాలు ఇవ్వడం చాలామందికి అలవాటు. కానీ ఇక్కడే ఓ చిన్న తిరకాసు ఉంది. నగదు రూపంలో ఇస్తే రూ.2,000 లోపే ఉండాలి. అంతకన్నా ఎక్కువ నగదు రూపంలో ఇచ్చారంటే, ఆ విరాళాలపై ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ కింద మినహాయింపులు పొందలేరు. అంతేకాదు మనీ లాండరింగ్‌ను ప్రోత్సహిస్తున్నందుకు సదరు రాజకీయ పార్టీ లేదా ట్రస్టుపై చర్యలు ఉంటాయి.

Read this: SBI Prize: ఎస్‌బీఐ నుంచి రూ.5 లక్షల ప్రైజ్ మనీ... పోటీ ఇదే

income tax notice, income tax penalty, income tax act, income tax prosecution, it act, it notice, ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్, ఐటీ నోటీస్, ఇన్‌కమ్ ట్యాక్స్ పెనాల్టీ, ఐటీ పెనాల్టీ


4. ప్రభుత్వానికి టీడీఎస్ డిపాజిట్ చేయకపోవడం


టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్ట్ అట్ సోర్స్. ట్యాక్స్ పేయర్స్‌కి టీడీఎస్ కట్ అవుతూ ఉంటుంది. అయితే ఒకవేళ టీడీఎస్ డిడక్ట్ చేయకపోయినా, డిడక్ట్ చేసిన టీడీఎస్ ప్రభుత్వానికి చెల్లించకపోయినా తప్పే. టీడీఎస్ డిఫాల్ట్‌గా గుర్తించి జరిమానా వేస్తుంది ఆదాయపు పన్నుశాఖ. అంతేకాదు నెలకు 1.5% వడ్డీ వసూలు చేస్తుంది. రూ.5,00,000 కన్నా ఎక్కువ డిఫాల్ట్ అయితే ప్రాసిక్యూషన్ నోటీసులు వస్తాయి.

5. ఫ్లాట్, నగలు కోసం రూ.2,00,000 కన్నా ఎక్కువ నగదు చెల్లించడం


మీరు నగల కోసమో, ఫ్లాట్‌కు అడ్వాన్స్ ఇవ్వడానికో బ్యాంకు నుంచి రూ.5 లక్షలు డ్రా చేసి ఉంటారు. ఆ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. ఈ తప్పు చాలు మీరు బుక్కైపోవడానికి. ఎందుకంటే రూ.రూ.2,00,000 కన్నా ఎక్కువ నగదు చెల్లించడం తప్పే. ఎంత చెల్లిస్తే అంత జరిమానా పడుతుంది. ఒకవేళ మీ అకౌంట్ నుంచి మీ స్నేహితులు ఇలాంటి లావాదేవీలు చేస్తే ఇబ్బందుల్లో పడేది మీరే. ఆ లావాదేవీలు మీ అకౌంట్ నుంచి జరుగుతాయి కాబట్టి మీరే బాధ్యులు.

Read this: SmartSIP: మ్యూచువల్ ఫండ్‌లో కొత్తగా స్మార్ట్‌సిప్... నిజంగా స్మార్టేనా?

income tax notice, income tax penalty, income tax act, income tax prosecution, it act, it notice, ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్, ఐటీ నోటీస్, ఇన్‌కమ్ ట్యాక్స్ పెనాల్టీ, ఐటీ పెనాల్టీ


6. పన్ను చెల్లించకుండా ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం


మీరు చెల్లించాల్సిన పన్నులు కట్టకుండా రిటర్న్స్ ఫైల్ చేస్తే జరిమానా చెల్లించక తప్పదు. ఒకవేళ నోటీసుకు ముందే మీరు పన్నులు చెల్లించినా చిక్కుల్లో పడ్డట్టే. ప్రాసిక్యూషన్ నోటీస్ కూడా వస్తుంది.

భారీ లావాదేవీలు చేసేవాళ్లు, కోట్లల్లో డబ్బులు పంపేవాళ్లకే ఐటీ నోటీసులు వస్తాయనుకుంటే పొరపాటే. చిన్నచిన్న తప్పులు చేస్తే మీకూ ఐటీ నోటీసులు రావచ్చు జాగ్రత్త.

ఇవి కూడా చదవండి:

Good News: కేవలం 24 గంటల్లో ఐటీఆర్ రీఫండ్స్

మీకు LIC నుంచి SMS వచ్చిందా? రాకపోతే ఇలా చేయండి...

Shock: పేటీఎం మాల్‌లో ఇక క్యాష్‌బ్యాక్ ఉండదా?
First published: February 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...