Home /News /business /

ALERT FOR TAXPAYERS NOT REPORTING THESE HIGH VALUE TRANSACTIONS TO INCOME TAX DEPARTMENT WILL ATTRACT IT NOTICE SS

Income Tax Notice: అలర్ట్... ఈ లావాదేవీలకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది జాగ్రత్త

Income Tax Notice: అలర్ట్... ఈ లావాదేవీలకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది జాగ్రత్త
(ప్రతీకాాత్మక చిత్రం)

Income Tax Notice: అలర్ట్... ఈ లావాదేవీలకు ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుంది జాగ్రత్త (ప్రతీకాాత్మక చిత్రం)

Income Tax Notice | ఇన్‌‌కమ్ ట్యాక్స్ నోటీసు వస్తే ఎందుకు వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటారు. అయితే కొన్ని లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించకపోతే ఐటీ నోటీసు (IT Notice) వస్తుంది.

నిత్యం ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) జరిపేవారికి అలర్ట్. భారీ మొత్తంలో జరిపే లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లాలి. లేకపోతే ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు (Income Tax Notice) వచ్చే అవకాశం ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్స్ జరిపితే వాటిని ఆదాయపు పన్ను శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి. ప్రతీ లావాదేవీకి లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ లోపు జరిపే ట్రాన్సాక్షన్స్‌తో ఇబ్బంది ఉండదు. కానీ ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్స్ జరిపితే వాటికి లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అందులో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్, సేవింగ్స్ అకౌంట్ లావాదేవీలు ఉన్నాయి. మరి ఈ రూల్స్ గురించి తెలుసుకోండి.

Savings Bank Account: సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా లావాదేవీలు జరిపితే ఆ వివరాలు ఐటీ శాఖకు వెల్లడించాలి. అలాగే కరెంట్ అకౌంట్‌లో ఈ లిమిట్ రూ.50 లక్షలు ఉంటుంది.

SBI Service Charges: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? ఈ ఛార్జీల గురించి తెలుసా?

Fixed Deposits: ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌లో రూ.10 లక్షలకు పైగా డిపాజిట్ చేస్తే ఐటీ శాఖకు వివరాలు ఇవ్వాలి. బ్యాంకు కూడా ఈ ఆర్థిక లావాదేవీల స్టేట్‌మెంట్‌ను ఫామ్ 61A ద్వారా ఐటీ డిపార్ట్‌మెంట్‌కు వెల్లడించాలి. ఒక అకౌంట్ హోల్డర్ ఒకే ట్రాన్సాక్షన్ లేదా వేర్వేరు ట్రాన్సాక్షన్స్‌లో ఈ లిమిట్ దాటితే బ్యాంకు ఆ వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ రూ.1,00,000 దాటితే ఐటీ శాఖకు తెలపాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లించినా ఈ రూల్ వర్తిస్తుంది. అన్ని క్రెడిట్ కార్డ్ లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖ పర్యవేక్షిస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా ఎక్కువ మొత్తంలో లావాదేవీలు జరిపితే వాటిని కార్డ్ హోల్డర్లు రిపోర్ట్ చేయాలి. లేకపోతే ఐటీ నోటీసు రావడం ఖాయం.

Property: రూ.30 లక్షలకు పైనా స్థిరాస్తి అమ్మకాలు లేదా కొనుగోలు జరిగితే ప్రాపర్టీ రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖ అధికారులకు తెలపాలి.

Post Office Scheme: రిస్కు లేకుండా తక్కువ టైమ్‌లో రూ.2.78 లక్షల రిటర్న్స్... పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వివరాలివే

Investments: షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్స్, బాండ్స్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలకు పైగా ఇన్వెస్ట్ చేస్తే ఆ వివరాలు ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించాలి. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ స్టేట్‌మెంట్‌లో ఈ వివరాలన్నీ ఉంటాయి. ఫామ్ 26AS లోని పార్ట్ లో కూడా హై వ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ వివరాలు చూడొచ్చు.

Foreign Currency: ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ ఫారిన్ కరెన్సీ అమ్మినట్టైతే ఆ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు తెలపాలి.



ఎవరైనా హైవ్యాల్యూ ట్రాన్సాక్షన్స్ జరిపి, వాటిని ఆదాయపు పన్ను శాఖకు వెల్లడించకపోతే పాన్ నెంబర్ ద్వారా సంబంధిత వ్యక్తులకు ఐటీ డిపార్ట్‌మెంట్ ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం ఇస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Income tax, ITR, ITR Filing, Personal Finance, Tax returns

తదుపరి వార్తలు