మీరు ప్రతీ ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్స్ (IT Returns) ఫైల్ చేస్తుంటారా? అయితే అలర్ట్. ఆదాయపు పన్ను శాఖ సరికొత్త సర్వీస్ ప్రారంభించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త పోర్టల్‌లో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS) ఫీచర్‌ను అందిస్తోంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో సేవింగ్స్ అకౌంట్ ద్వారా పొందిన వడ్డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ, డివిడెండ్, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్స్, మ్యూచువల్ ఫండ్ ట్రాన్సాక్షన్స్, ఫారిన్ రెమిటెన్స్ లాంటి వివరాలన్నీ ఉంటాయి. అంటే ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ఓ ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయ వివరాలన్నీ అందులో అంటాయి. https://eportal.incometax.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు.
Aadhaar e-KYC: గుడ్ న్యూస్... ఆధార్ ఇ-కేవైసీతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు
యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫామ్ 26AS ఇక అందుబాటులో ఉండదు. ట్రెసెస్ పోర్టల్ నుంచి ఈ ఫామ్‌ను తొలగిస్తుంది ఆదాయపు పన్ను శాఖ. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌లో ఆదాయ వివరాలతో పాటు ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ కూడా ఉంటుంది. ఇందులో ట్యాక్స్‌పేయర్ పేరు, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, రిజిస్టర్డ్ ఇమెయిల్ ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లాంటి వివరాలన్నీ ఉంటాయి. పన్ను చెల్లింపుదారులు సులువుగా రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి. మరి మీరు కూడా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ యాక్సెస్ చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవండి.
Dhanteras 2021: రేపే ధంతేరాస్... బంగారం కొనడానికి ఈ టిప్స్ గుర్తుంచుకోండి
Income Tax Dept rolls out the new Annual Information Statement(AIS) on the Compliance Portal. It provides a comprehensive view of information to taxpayer, with facility to capture online feedback. Click on link 'AIS' under the 'Services' tab on https://t.co/GYvO3n9wMf to access. pic.twitter.com/Ub4EAgmkLq
— Income Tax India (@IncomeTaxIndia) November 1, 2021
ముందుగా https://eportal.incometax.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
మీ పాన్ నెంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
హోమ్ పేజీలో Services సెక్షన్‌లో Annual Information Statement (AIS) లింక్ పైన క్లిక్ చేయాలి.
Proceed పైన క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇన్‌స్ట్రక్షన్స్ చదివిన తర్వాత AIS పైన క్లిక్ చేయాలి.
అందులో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
Taxpayer Information Summary (TIS) పైన క్లిక్ చేస్తే పన్నుచెల్లింపుదారుల సమాచారం ఉంటుంది.
Annual Information Statement (AIS) పైన క్లిక్ చేస్తే వార్షిక సమాచార వివరాలు ఉంటాయి.
ఇందులో సమాచారంలో ఏవైనా మార్పులు ఉన్నట్టైతే పన్నుచెల్లింపుదారులు ఫీడ్‌బ్యాక్ కూడా ఇవ్వొచ్చని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) తెలిపింది. ఒకవేళ ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్టైతే, అందులో సమాచారాన్ని వెల్లడించకపోతే, రిటర్న్స్‌ని రివైజ్ చేసి సరైన సమాచారాన్ని ఇవ్వొచ్చు. ప్రస్తుతం ఉన్న ఫామ్ 26AS స్థానంలో యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్‌ను రీప్లేస్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ భావిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR, Personal Finance