ఉద్యోగంలో బిజీగా ఉండటం వల్ల కొన్ని విషయాలు పట్టించుకోరు. తీరా చివరి తేదీ దగ్గరకు వచ్చినప్పుడు హడావుడి పడుతుంటారు. లేదా చివరి తేదీ దాటిన తర్వాత జరిమానాలు చెల్లిస్తూ ఉంటారు. అందుకే ఆర్థిక అంశాలకు (Financial Matters) సంబంధించి అలర్ట్‌గా ఉండటం అసరం. ఉద్యోగులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ (Income Tax Returns) ఫైల్ చేయడానికి గడువు దగ్గరకు వచ్చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ (IT Returns) ఫైల్ చేయడానికి జూల్ 31 చివరి తేదీ. కాబట్టి చివరి రోజు వరకు వెయిట్ చేయకుండా ఐటీ రిటర్న్స్ ముందే ఫైల్ చేయడం మంచిది.
ఐటీ రిటర్న్స్ గడువులోగా ఫైల్ చేయకపోతే చిక్కులు తప్పవు. జూలై 31 గడువులోగా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయనివారు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234ఎఫ్ ప్రకారం ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఫైన్ చెల్లించి బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయొచ్చు. ఆగస్ట్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే రూ.5,000 ఫైన్ చెల్లించాలి. వార్షికాదాయం రూ.5,00,000 కన్నా ఎక్కువ ఉన్నవారికి రూ.5,000 జరిమానా వర్తిస్తుంది. ఒకవేళ వార్షికాదాయం రూ.5,00,000 లోపు ఉంటే రూ.1,000 జరిమానా చెల్లించాలి. ఈ ఫైన్ చెల్లించి డిసెంబర్ 31 లోగా బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఫైన్‌తో పాటు సెక్షన్ 234ఏ ప్రకారం చెల్లించాల్సిన ట్యాక్స్‌పై వడ్డీ పెనాల్టీ కూడా ఉంటుంది.
LIC Policy: ప్రతీ ఏటా డబ్బులు వచ్చే ఎల్ఐసీ పాలసీ ఇది... రోజూ రూ.45 చెల్లిస్తే చాలు
ఒకవేళ ఆదాయపు పన్ను శాఖ జూలై 31 గడువును పొడిగిస్తే పొడిగించిన గడువులోగా ఫైన్ లేకుండా రిటర్న్స్ ఫైల్ చేయొచ్చు. మరి ఆదాయపు పన్ను శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ఐటీ రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలో తెలుసుకోండి.
Step 1- ట్యాక్స్‌పేయర్స్ ముందుగా ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal ఓపెన్ చేయాలి.
Step 2- File Your ITR పైన క్లిక్ చేయాలి.
Step 3- కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది.
Step 4- అందులో మీ వివరాలతో లాగిన్ కావాలి.
Step 5- అసెస్‌మెంట్ అయర్ సెలెక్ట్ చేయాలి.
Step 6- ఆ తర్వాత ఫామ్ సెలెక్ట్ చేయాలి. ITR1 లేదా ITR4 ఫామ్ సెలెక్ట్ చేయాలి.
Step 7- ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
Step 8- తర్వాతి పేజీలో మీ ఆదాయానికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయి.
Step 9- వివరాలన్నీ సరిచూసుకొని ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయాలి.
ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత వెరిఫై చేయడం మర్చిపోవద్దు. వెరిఫికేషన్ తప్పనిసరి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Income tax, ITR, Itr deadline, ITR Filing, Personal Finance