Home /News /business /

ALERT FOR TAXPAYERS CENTRAL GOVERNMENT TO IMPLEMENT NEW GST RULES FROM 2022 JANUARY 1 SS GH

New Tax Rules: వ్యాపారులకు అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్

New Tax Rules: వ్యాపారులకు అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్
(ప్రతీకాత్మక చిత్రం)

New Tax Rules: వ్యాపారులకు అలర్ట్... జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ రూల్స్ (ప్రతీకాత్మక చిత్రం)

New Tax Rules | వ్యాపారులకు అలర్ట్. 2022 జనవరి 1 నుంచి కొత్త జీఎస్‌టీ నియమనిబంధనలు (New GST Rules) అమలులోకి రానున్నాయి. ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి.

కొత్త సంవత్సరంలో మారనున్న నియమ నిబంధనలపై పన్ను చెల్లింపుదారులు దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు. పరోక్ష పన్ను (indirect tax) విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ జనవరి 1 నుంచి సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (CGST) చట్టానికి పదికి పైగా సవరణలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పులు ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంట్ ఆమోదించిన ఆర్థిక చట్టం- 2021లో భాగంగా ఉన్నాయి. అయితే వాటి అమలు తేదీని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ మార్పులు ట్యాక్సబుల్ సప్లై, ట్యాక్స్ క్రెడిట్‌లకు అర్హత, నిర్దిష్ట సందర్భాలలో అప్పీళ్లను దాఖలు చేసే నిబంధనలు వంటి అనేక సమస్యలను కవర్ చేస్తాయి.

ఒక వ్యక్తి, లేదా సంస్థ.. సభ్యులకు చేసే నగదు, వాయిదా వేసిన చెల్లింపులు లేదా ఇతర విలువైన కన్సిడరేషన్స్ కోసం జరిపే లావాదేవీలు పన్ను పరిధిలోకి వచ్చే సరఫరాగా (taxble supply) పరిగణిస్తారని ఒక సవరణ పేర్కొంది. సభ్యుల నుంచి ఎంటిటీకి జరిగే ఇలాంటి లావాదేవీలు కూడా అదే విధంగా పరిగణనలోకి వస్తాయి. అంటే అన్ని క్లబ్‌లు, అసోసియేషన్‌లు సభ్యులతో జరిపే లావాదేవీలు GSTకి లోబడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

SBI Loan: రైతులకు శుభవార్త... తక్కువ వడ్డీకే రుణాలు ప్రకటించిన ఎస్‌బీఐ

జనవరి నుంచి అమల్లోకి వచ్చే మరో నిబంధన.. ముడి పదార్థాలు, వ్యాపారాలు సేకరించే ఇతర సేవలపై చెల్లించే పన్నులకు క్రెడిట్‌ల మంజూరును నియంత్రించే నిబంధనలను కఠినతరం చేస్తుంది. ఒక వస్తువు అమ్మేవారు తమ నెలవారీ అమ్మకాల రిటర్న్‌లో ఇన్‌వాయిస్ వివరాలను వెల్లడించకపోతే (ఫారమ్ GSTR-1లో), అప్పుడు కొనుగోలుదారు ఆ వస్తువుపై చెల్లించిన పన్నుల కోసం క్రెడిట్‌ను పొందలేరు.

పన్ను ఎగవేతలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర అధికారులు పన్ను రాయితీలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నారు. నకిలీ ఇన్‌వాయిస్‌లను ఉపయోగించి అక్రమ సంస్థలు పరోక్ష పన్ను ఎగవేయడం అనేది ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉంది. అయితే కఠినమైన ట్యాక్స్ క్రెడిట్ నియమాలు.. సరఫరాదారులు నెలవారీ అమ్మకాల రిటర్న్‌లలో లావాదేవీ వివరాలను వెంటనే బహిర్గతం చేసేలా బిజినెస్‌లకు హామీ ఇస్తున్నాయి. పన్ను సమ్మతిని (tax compliance) మెరుగుపరచడానికి రిపోర్టింగ్ అవసరాలు, సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించాలనేది అసలు ఉద్దేశం. ఇది విశ్వసనీయమైన, చట్టాన్ని గౌరవించే సరఫరాదారుల నుంచి సోర్స్ మెటీరియల్స్, సేవలకు వ్యాపారాలను ప్రోత్సహిస్తుంది.

Tokenisation Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌కు కొత్త రూల్స్... మీరేం చేయాలంటే

నిబంధనలను ఉల్లంఘించి చేసే నిల్వ లేదా రవాణా కోసం వస్తువులను స్వాధీనం చేసుకున్న సందర్భాల్లో అధికారుల ఆదేశాలకు వ్యతిరేకంగా అప్పీల్ చేసినందుకు వ్యాపారాలు 25% జరిమానా చెల్లించాలి. ఈ నిబంధన కూడా జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది.

పన్నుల రికవరీని బలోపేతం చేయడం, ఆస్తుల తాత్కాలిక అటాచ్మెంట్, ట్యాక్స్ క్రెడిట్ అర్హతను కఠినతరం చేయడం, ఏదైనా విషయంపై ఏ వ్యక్తి నుంచి అయినా సమాచారం కోసం పిలవడానికి అధికార పరిధి కమీషనర్‌కు ఇవ్వడం, క్లబ్‌లు/అసోసియేషన్‌లపై పన్ను పరిధిని పెంచడం.. తదితర లక్ష్యాల కోసం ఈ మార్పులను తీసుకువస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ సిస్టమ్ సంస్కరణలను బలోపేతం చేయాలని చూస్తున్న తరుణంలో.. అధికారులు ఈ మార్పులను ప్రతిపాదించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని మంత్రుల బృందం జీఎస్టీ సిస్టమ్ రిఫామ్స్‌పై కసరత్తు చేస్తోంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Business, GST, Income tax, Personal Finance, TAX SAVING

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు