హోమ్ /వార్తలు /బిజినెస్ /

Savings Scheme: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, ఇతర పథకాల్లో ఉన్నవారికి కొత్త రూల్

Savings Scheme: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, ఇతర పథకాల్లో ఉన్నవారికి కొత్త రూల్

Savings Scheme: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, ఇతర పథకాల్లో ఉన్నవారికి కొత్త రూల్
(ప్రతీకాత్మక చిత్రం)

Savings Scheme: సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, ఇతర పథకాల్లో ఉన్నవారికి కొత్త రూల్ (ప్రతీకాత్మక చిత్రం)

Savings Scheme | సుకన్య సమృద్ధి, పీపీఎఫ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ లాంటి పొదుపు పథకాల్లో పథకాల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనల్ని ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) లాంటి పొదుపు పథకాల్లో ఉన్నవారికి అలర్ట్. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో (Small Saving Schemes) డబ్బులు దాచుకోవాలంటే ఇకపై పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఈ కొత్త రూల్ ప్రకటిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2023 మార్చి 31న నోటిఫికేషన్ జారీ చేసింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు కేవైసీ నిబంధనల్లో భాగంగా ఈ మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇన్నాళ్లూ ఈ పథకాల్లో చేరాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి ఏమీ కాదు. కానీ ఇప్పటి నుంచి ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ తప్పనిసరి.

ఈ పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకోవడానికి ఇకపై ఆధార్ నెంబర్ తప్పనిసరి మాత్రమే కాదు. ప్రభుత్వం సూచించిన లిమిట్‌ను మించి డబ్బులు దాచుకోవాలంటే పాన్ కార్డ్ కూడా తప్పనిసరి. ఈ పథకాల్లో ఉంటూ, ప్రభుత్వం విధించిన లిమిట్ కన్నా ఎక్కువ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నట్టైతే పాన్ కార్డ్ సబ్మిట్ చేయాలి. పాన్ కార్డ్ లేనివాళ్లు తప్పనిసరిగా పాన్ కార్డ్ తీసుకోవాలి. అప్పుడే ఈ పథకాల్లో కొనసాగొచ్చు.

Money Rules: మీ డబ్బుపై ప్రభావం చూపే 7 మార్పులు... నేటి నుంచే అమలు

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఉన్నవారంతా 2023 సెప్టెంబర్ 30 లోగా తమ ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయాల్సిందే. అయితే పీపీఎస్, సుకన్య సమృద్ధి, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లాంటి చిన్న మొత్తాల పొదుపు ఖాతా తెరిచినప్పుడు ఆధార్ నెంబర్ ఇచ్చినట్టైతే మళ్లీ ఆధార్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు.

ఇకపై ఈ పొదుపు పథకాల్లో ఏదైనా ఒక స్కీమ్‌లో కొత్తగా చేరాలనుకునేవారు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ ఆధార్ నెంబర్ లేకుండా అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్టైతే, ఖాతా తెరిచిన ఆరు నెలల్లో ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇంకా ఆధార్ నెంబర్ అలాట్ కానివారు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ ఇవ్వొచ్చు.

Gold New Rules: బంగారం కొంటున్నారా? ఇక ఇలాంటి నగలే కొనాలి గుర్తుంచుకోండి

ఇక పాన్ కార్డ్ విషయానికి వస్తే రెండు సందర్భాల్లో పాన్ నెంబర్ లేదా ఫామ్ 60 సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా సందర్భంలో బ్యాలెన్స్ రూ.50 వేలు దాటినా ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక అకౌంట్‌లో రూ.1 లక్షకు మించి డబ్బులు జమ చేసినా లేదా ఒక నెలలో ఒక అకౌంట్ నుంచి రూ.10 వేలకు మించి విత్‌డ్రా లేదా బదిలీ చేసినా పాన్ నెంబర్ సబ్మిట్ చేయాలి. ఒకవేళ రెండు నెలల్లో పాన్ నెంబర్ సబ్మిట్ చేయకపోతే పాన్ నెంబర్ ఇచ్చేవరకు అకౌంట్‌ను ఫ్రీజ్ చేస్తారు. అయితే స్మాల్ సేవింగ్ స్కీమ్ అకౌంట్ తెరిచేప్పుడే పాన్ కార్డ్ సబ్మిట్ చేసినట్టైతే మళ్లీ పాన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

వడ్డీ రేట్లు పెంపు

ఇక కేంద్ర ప్రభుత్వం చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను భారీగా పెంచింది. 2023 మార్చి 31న రాబోయే మూడు నెలలకు సంబంధించిన వడ్డీ రేట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. వేర్వేరు పొదుపు పథకాలకు 10 బేసిస్ పాయింట్స్ నుంచి 70 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ రేట్లు పెంచింది కేంద్ర ప్రభుత్వం. చిన్నమొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను పెంచడం ఇది వరుసగా మూడోసారి.

First published:

Tags: AADHAR, PAN card, Personal Finance, Post office scheme, PPF, Sukanya samriddhi yojana

ఉత్తమ కథలు