Home /News /business /

ALERT FOR STATE BANK OF INDIA LOAN CUSTOMERS EMIS WILL RISE AS SBI HIKES MCLR SS

SBI EMI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్... భారీగా పెరగనున్న ఈఎంఐలు

SBI EMI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్... భారీగా పెరగనున్న ఈఎంఐలు
(ప్రతీకాత్మక చిత్రం)

SBI EMI: ఎస్‌బీఐ కస్టమర్లకు షాక్... భారీగా పెరగనున్న ఈఎంఐలు (ప్రతీకాత్మక చిత్రం)

SBI EMI | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాక్ ఇచ్చింది. దీంతో ఈఎంఐలు భారీగా పెరగనున్నాయి. కొత్తగా రుణాలు తీసుకునేవారితో పాటు గతంలో లోన్స్ తీసుకున్నవారు ఈఎంఐలు అధికంగా చెల్లించాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రుణాల వడ్డీ రేట్లను భారీగా పెంచింది. దీంతో కస్టమర్లకు ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. పర్సనల్ లోన్, ఆటో లోన్, బిజినెస్ లోన్... ఇలా పలు రకాల రుణాలకు అధిక వడ్డీ చెల్లించక తప్పదు. రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (MCLR) పెంచింది ఎస్‌బీఐ. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 15 నుంచి అమలులోకి వచ్చాయి. మూడు నెలల వరకు ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుంచి 7.35 శాతానికి పెరిగింది. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.45 శాతం నుంచి 7.65 శాతానికి పెరిగింది. ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.5 శాతం నుంచి 7.7 శాతానికి, రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.7 శాతం నుంచి 7.9 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.8 శాతం నుంచి 8 శాతానికి పెరిగింది.

ఎస్‌బీఐ ఎంసీఎల్ఆర్‌ను 20 బేసిస్ పాయింట్స్ అంటే 20 పైసలు పెంచింది. రుణాలు తీసుకున్నవారు, కొత్తగా లోన్స్ తీసుకోవాలని అనుకునేవారు ఇకపై 20 పైసలు అధికంగా వడ్డీ చెల్లించాలి. కస్టమర్లకు ఈఎంఐలు మరింత భారం అవుతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల రెపో రేట్‌ను ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ పెంచిన సంగతి తెలిసందే. దీంతో రెపో రేట్ 5.40 శాతానికి పెరిగింది.

SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు

ఆర్‌బీఐ రెపో రేట్ పెంచడంతో బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. రుణాల వడ్డీ రేట్లు పెరగడంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఎస్‌బీఐ కూడా రెండు రోజుల క్రితం ఎఫ్‌డీ వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. ఎస్‌బీఐలో తాజాగా వడ్డీ రేట్లను చూస్తే 7 రోజుల నుంచి 45 రోజుల కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 2.90 శాతం వడ్డీ, 46 రోజుల నుంచి 179 రోజుల కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 3.90 శాతం వడ్డీ, 180 రోజుల నుంచి 210 రోజుల కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 4.55 శాతం వడ్డీ, 211 రోజుల నుంచి ఏడాది కాల్య వ్యవధి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 4.60 శాతం వడ్డీ, ఏడాది నుంచి రెండేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.45 శాతం వడ్డీ లభిస్తుంది.

IRCTC South India Tour: విశాఖపట్నం నుంచి 6 రోజులు సౌత్ ఇండియా టూర్... ప్యాకేజీ వివరాలు ఇవే



రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీపై 5.50 శాతం వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 5.60 శాతం వడ్డీ, ఐదేళ్ల నుంచి పదేళ్ల లోపు ఎఫ్‌డీలకు 5.65 శాతం వడ్డీ పొందొచ్చు. ఇక అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ అదనంగా లభిస్తుంది. ఎస్‌బీఐ వీకేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో డిపాజిట్ చేసినవారికి అదనంగా మరో 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ లభిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Personal Finance, Sbi, State bank of india

తదుపరి వార్తలు