ALERT FOR STATE BANK OF INDIA CUSTOMERS SBI INTRODUCES SIM BINDING FEATURE ON YONO LITE APP FOR SECURE ONLINE TRANSACTIONS KNOW HOW THIS FEATURE WORKS SS
SBI New Feature: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి
SBI New Feature: ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్... వెంటనే ఈ ఫీచర్ వాడుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
SBI New Feature | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI కస్టమర్లకు శుభవార్త. సైబర్ నేరాలు, బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడానికి ఎస్బీఐ సరికొత్త ఫీచర్ రూపొందించింది. ఆ ఫీచర్ మీరూ వాడుకోండి ఇలా.
యోనో లైట్ యాప్‌లో ఆన్లైన్ లావాదేవీలను సురక్షితం చేయడానికి సిమ్ బైండింగ్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. కరోనా వైరస్ మహమ్మారితో ఆన్లైన్ లావాదేవీలు పెరిగిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరగడంతో బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగాయి. కస్టమర్లకు సైబర్ నేరగాళ్లు వల వేసి లక్షలకు లక్షలు దోచేస్తున్నారు. ఈ సైబర్ నేరాలను అడ్డుకోవడం బ్యాంకులకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఎప్పటికప్పుడు కస్టమర్లను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి బ్యాంకులు. అంతేకాదు... బ్యాంకింగ్ మోసాలను అడ్డుకోవడానికి కొత్తకొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎస్బీఐ సిమ్ బైండింగ్ ఫీచర్‌ను రూపొందించింది. యోనో లైట్ యాప్‌లో ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. యోనో లైట్ యాప్ ఉపయోగిస్తున్నవారు లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యోనో లైట్ యాప్ 5.3.48 వర్షన్లో సిమ్ బైండింగ్ ఫీచర్ ఉంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈ ఫీచర్ యాక్టివేట్ చేయొచ్చు.
ఎస్బీఐ ఆన్లైన్ బ్యాంకింగ్ ఇక సురక్షితమని, లేటెస్ట్ యోనో లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI తమ కస్టమర్లను కోరుతోంది. సిమ్ బైండింగ్ సరికొత్త టెక్నాలజీ. ఒక యూజర్ ఒక డివైజ్‌లోనే తమ అకౌంట్ లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోనే యాప్‌లో లాగిన్ కావొచ్చు. ఇతర స్మార్ట్ఫోన్లలో బ్యాంకింగ్ యాప్ డౌన్లోడ్ చేసి లాగిన్ చేయడానికి కుదరదు. ఆ మొబైల్లో రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ ఉండాలి. సిమ్ బైండింగ్ టెక్నాలజీతో కేవలం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సిమ్ కార్డ్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లోనే బ్యాంకింగ్ యాప్ ఉపయోగించుకోవచ్చు. మీరు యోనో లైట్ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే సిమ్ బైండింగ్ ఫీచర్ ఎలా యాక్టివేట్ చేయాలో తెలుసుకోండి.
— State Bank of India (@TheOfficialSBI) July 27, 2021
ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎస్బీఐ యోనో లైట్ యాప్ అప్డేట్ చేయండి. లేదా యాప్ అన్ఇన్స్టాల్ చేసి కొత్తగా ఇన్స్టాల్ చేయండి.
ఆ తర్వాత ఎస్బీఐ యోనో లైట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత SIM 1 లేదా SIM 2 ఆప్షన్ కనిపిస్తుంది.
మీ ఎస్బీఐ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఏ స్లాట్‌లో ఉంటే ఆ స్లాట్ సెలెక్ట్ చేయండి.
ఉదాహరణకు ఎస్బీఐలో రిజిస్టరైన మీ మొబైల్ నెంబర్ SIM 1 లో ఉంటే ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
ఒకవేళ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఒకటే సిమ్ కార్డ్ ఉంటే సిమ్ సెలెక్షన్ అవసరం లేదు.
మీ మొబైల్ నెంబర్ వేలిడేషన్ కోసం మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఓ ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది.
ఇందుకోసం Proceed పైన క్లిక్ చేయాలి.
యూనిక్ కోడ్‌తో ఎస్ఎంఎస్ వెళ్తుంది.
వెరిఫికేషన్ పూర్తైన తర్వాత రిజిస్ట్రేషన్ స్క్రీన్ కనిపిస్తుంది.
అందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత register పైన క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నియమనిబంధనలు అంగీకరించి టర్మ్స్ అండ్ కండీషన్స్ అంగీకరించాలి.
ఆ తర్వాత OK ఫైన క్లిక్ చేయాలి.
మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్‌కు యాక్టివేషన్ కోడ్ వస్తుంది.
ఆ కోడ్ 30 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది.
యాక్టివేషన్ కోడ్ ఎంటర్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
ఇక మీరు ఎప్పట్లాగే యోనో లైట్ యాప్ ఉపయోగించుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.