ALERT FOR STATE BANK OF INDIA CUSTOMERS SBI ACCOUNTS BLOCKED FOR NOT UPDATING KYC DETAILS KNOW HOW TO UPDATE KYC SS
SBI Account: ఎస్బీఐ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి... కస్టమర్లు వెంటనే ఇలా చేయాలి
SBI Account: ఎస్బీఐ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి... కస్టమర్లు వెంటనే ఇలా చేయాలి
(ప్రతీకాత్మక చిత్రం)
SBI Account Blocked | భారతదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్నవారి ఎస్బీఐ అకౌంట్స్ (SBI Accounts) బ్లాక్ అవుతున్నాయి. తమ అకౌంట్స్ బ్లాక్ అయ్యాయని, లావాదేవీలు జరపలేకపోతున్నామని కస్టమర్లు ఎస్బీఐకి కంప్లైంట్ చేస్తున్నారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్. దేశవ్యాప్తంగా కొందరి ఎస్బీఐ అకౌంట్లు బ్లాక్ అవుతున్నాయి. కస్టమర్లు నో యువర్ కస్టమర్ అంటే కేవైసీ నిబంధనల్ని పాటించని కారణంగా ఎస్బీఐ వారి అకౌంట్లను నిలిపివేస్తోంది. దీంతో సదరు కస్టమర్లు ట్విట్టర్ ద్వారా ఎస్బీఐని సంప్రదిస్తున్నారు. తమ అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారని ఆరా తీస్తున్నారు. జూలై 1 నాటికి కేవైసీ వివరాలు అప్డేట్ చేయని కారణంగా ఎస్బీఐ ఆ కస్టమర్ల అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకు కేవైసీ డ్రైవ్ (KYC Drive) నిర్వహిస్తోంది. అందులో భాగంగా కేవైసీ అప్డేట్ లేని అకౌంట్లను బ్లాక్ చేస్తోంది. దీంతో విదేశాల్లో ఉంటున్న ఎస్బీఐ కస్టమర్లు తమ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించలేకపోతున్నారు.
"నిర్ణీత వ్యవధిలో కేవైసీ అప్డేట్ చేయడం అనేది నిరంతరం జరుగుతున్న ప్రక్రియ. మీ అకౌంట్ కేవైసీ వివరాలు అప్డేట్ కాలేనట్టుంది. అందుకే మీకు సమాచారం అందిస్తున్నాం. దయచేసి బ్రాంచ్‌ను సందర్శించి, మీ అకౌంట్ సజావుగా పనిచేసేందుకు కేవైసీ వివరాలు అప్డేట్ చేయండి" అని ఓ కస్టమర్‌కు సమాధానం ఇచ్చింది ఎస్బీఐ.
అయితే కస్టమర్లు బ్రాంచ్ని సంప్రదించి అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా వారి అకౌంట్ బ్లాక్ అయినట్టు కంప్లైంట్స్ వస్తున్నాయి. అయితే కేవైసీ అప్డేట్ కావడానికి 10 రోజుల సమయం పడుతుందని బ్యాంకు సిబ్బంది చెప్పారని, తన అకౌంట్‌ను ఉపయోగించలేకపోతున్నానని విదేశాల్లో ఉండే ఎస్బీఐ కస్టమర్ అజిత్ వాలే కంప్లైంట్ చేశారు.
ఇక కేవైసీ అప్డేట్ విషయంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా తన అకౌంట్ సేవల్ని నిలిపివేశారని మరో కస్టమర్ గౌరవ్ అగర్వాల్ ఫిర్యాదు చేశారు. కేవైసీ వివరాలు లేవని అకౌంట్ నిలిపివేశారని, కేవైసీ అప్డేట్ చేయాలని తనను ఎవరూ కోరలేదని అన్నారు. ఇలా అనేక మంది ఎస్బీఐ కస్టమర్ల అకౌంట్లు బ్లాక్ అవుతుండటంతో లావాదేవీలు జరపడంలో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం కస్టమర్లు తరచూ కేవైసీ వివరాలు అప్డేట్ చేస్తూ ఉండాలి. కేవైసీ వివరాలు అప్డేట్ చేయాలని కస్టమర్లకు ఎస్ఎంఎస్తో పాటు ఇతర మాధ్యమాల్లో బ్యాంకు సమాచారం ఇవ్వాలి. కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లి కేవైసీ వివరాలు అప్డేట్ చేయొచ్చు. కేవైసీ వివరాలు ఎలాంటి మార్పులు లేకపోతే కేవైసీ డాక్యుమెంట్స్‌ని కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మెయిల్ ఐడీ నుంచి బ్రాంచ్ ఇమెయిల్ ఐడీకి పంపొచ్చు.
కేవైసీ అప్డేట్ చేయని అకౌంట్లను ముందస్తు సమాచారం లేకుండా బ్యాంకు నిలిపివేయడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు ఎస్బీఐ కస్టమర్ అయితే మీ ఫోన్ నెంబర్ లేదా ఇమెయిల్ ఐడీకి కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఏదైనా మెసేజ్ వచ్చిందేమో చెక్ చేయండి. కస్టమర్లు తమ కేవైసీ వివరాలను సులువుగా అప్డేట్ చేయొచ్చు.
ఎస్బీఐ కస్టమర్లు తమ కేవైసీలో ఎలాంటి మార్పులు లేకపోతే ఓ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేస్తే చాలు. బ్రాంచ్‌కు వెళ్లి ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. ఇమెయిల్ లేదా పోస్ట్ ద్వారా పంపొచ్చు. ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో కేవైసీ ఫామ్ ఉంటుంది. ఒకవేళ కేవైసీ వివరాల్లో మార్పులు ఉంటే ఒరిజినల్ కేవైసీ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.