హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Account: మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? కారణమిదే

SBI Account: మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? కారణమిదే

SBI Account: మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? కారణమిదే
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Account: మీ ఎస్‌బీఐ అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? కారణమిదే (ప్రతీకాత్మక చిత్రం)

SBI Account | మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయా? ఎస్‌బీఐ ఛార్జీల రూపంలో ఈ మొత్తాన్ని డెబిట్ చేస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్. ఒకసారి మీ ఎస్‌బీఐ అకౌంట్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి. లేదా పాస్‌బుక్ అప్‌డేట్ చేసి ఓసారి వివరాలు చెక్ చేయండి. మీ అకౌంట్‌లో రూ.147.5 డెబిట్ అయ్యాయేమో చూడండి. మీకే కాదు, అనేకమంది ఎస్‌బీఐ కస్టమర్లకు ఇలాగే తమ బ్యాంక్ అకౌంట్ (Bank Account) నుంచి రూ.147.5 డెబిట్ అయ్యాయి. అసలు అకౌంట్‌లో డబ్బులు ఎందుకు కట్ అయ్యాయో అర్థం కాక అకౌంట్‌హోల్డర్స్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్‌బీఐ వసూలు చేసే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవి. డెబిట్ కార్డ్ అంటే ఏటీఎం కార్డ్ మెయింటెనెన్స్ లేదా సర్వీస్ ఛార్జీ రూపంలో ఏడాదికోసారి రూ.147.5 వసూలు చేస్తుంది ఎస్‌బీఐ.

ఎస్‌బీఐ క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డుల్ని జారీ చేస్తోంది. ఈ కార్డులకు ప్రతీ ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలను వసూలు చేస్తుంది. యాన్యువల్ ఛార్జీ రూ.125. మరి రూ.147.5 ఎందుకు కట్ చేసిందని మీకు డౌటా? 18 శాతం జీఎస్‌టీ కూడా ఉంటుంది. రూ.125 కి 18 శాతం జీఎస్‌టీ అంటే రూ.22.5. మొత్తం కలిపి రూ.147.5 వసూలు చేస్తుంది బ్యాంకు .

Credit Card Rule: క్రెడిట్ కార్డ్ బిల్ కట్టలేదా? కొత్త రూల్‌తో కాస్త ఊరట

ఇక యువ, గోల్డ్, కాంబో, మైకార్డ్ లాంటి డెబిట్ కార్డులకు రూ.175+జీఎస్‌టీ, ప్లాటినమ్ డెబిట్ కార్డుకు రూ.250+జీఎస్టీ, ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకు రూ.350+జీఎస్‌టీ వసూలు చేస్తుంది. ఇక మీరు డెబిట్ కార్డ్ రీప్లేస్ చేయాలన్నా, మార్చాలన్నా ఛార్జీలు ఉంటాయి. ఇందుకోసం రూ.300+జీఎస్‌టీ వసూలు చేస్తుంది బ్యాంకు. ఇక సిగ్నేచర్, సాలరీ ప్యాకేజీ అకౌంట్‌తో లింక్ అయిన ఉన్న డెబిట్ కార్డులకు యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు ఉండవు.

ఏటీఎం కార్డుకు సంబంధించి మరిన్ని ఛార్జీలు ఉన్నాయి. డూప్లికేట్ పిన్ లేదా బ్రాంచ్‌లో పిన్ జనరేషన్ కోసం రూ.50+ జీఎస్‌టీ చెల్లించాలి. తప్పుడు అడ్రస్ కారణంగా ఏటీఎం కార్డ్ లేదా కిట్ డెలివరీ కాకపోతే రూ.100+ జీఎస్‌టీ చెల్లించాలి. ఇక ఏటీఎంలో వసూలు చేసే ఛార్జీల విషయానికి వస్తే యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1 లక్ష వరకు మెయింటైన్ చేసినవారికి ఎస్‌బీఐ ఏటీఎంలల్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఇతర ఏటీఎంలల్లో మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు ఉచితం. ఇతర ప్రాంతాల్లో 5 లావాదేవీలు ఉచితం. రూ.1 లక్ష కన్నా ఎక్కువ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అన్‌లిమిటెడ్ లావాదేవీలు ఉచితం.

Order Aadhaar Card: ఏటీఎం కార్డ్ సైజ్‌లో ఆధార్ కార్డ్ ... ఇలా ఆర్డర్ చేస్తే ఇంటికి డెలివరీ

ఎస్‌బీఐ ఇచ్చే లిమిట్ దాటిన తర్వాత ప్రతీ లావాదేవీకి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.5, ఇతర బ్యాంక్ ఏటీఎంలో రూ.8 చెల్లించాలి. పన్నులు అదనం.

First published:

Tags: Bank account, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు