హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Alert: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్

SBI Alert: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్

SBI Alert: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు అలర్ట్... ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్ (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులన్నీ ఆగస్ట్ 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయబోతున్నాయి. నిత్యం ఆర్థిక లావాదేవీలు (Financial Transactions) చేసే కస్టమర్లు ఈ రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాలి.

ఇంకా చదవండి ...

బ్యాంకుల్లో చెక్స్ క్లియరెన్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త రూల్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.5 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ విలువైన చెక్స్‌ని ఎన్‌క్యాష్ చేయడానికి పాజిటీవ్ పే సిస్టమ్ పాటించడం తప్పనిసరి. ఈ రూల్స్ పాటించకపోతే అటువంటి చెక్కుల క్లియరెన్స్‌ను తిరస్కరించడానికి బ్యాంకులకు అనుమతి ఉంది. ఇప్పటికే ఈ రూల్స్‌కు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర బ్యాంకులు నోటిఫికేషన్స్ విడుదల చేశాయి. కస్టమర్లు పాజిటీవ్ పే సిస్టమ్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని కోరుతున్నాయి. ఆగస్ట్ 1 నుంచి ఈ రూల్స్ అమలులోకి వస్తాయి.

ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారం ప్రకారం పెద్ద మొత్తం విలువతో ఉన్న చెక్కులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తిరిగి నిర్ధారించుకోవడానికి పాజిటీవ్ పే సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియ కింద, చెక్కును జారీ చేసినవారు ఎస్ఎంఎస్, మొబైల్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివరాలు వెల్లడించాలి. చెక్ పైన ఉన్న తేదీ, బెనిఫీషియరీ పేరు, చెల్లించాల్సిన మొత్తం లాంటి వివరాలను డ్రా చేసుకునే బ్యాంకుకు వివరించాలి.

SBI ATM Card: పిన్ నెంబర్ అవసరం లేకుండా ఏటీఎం కార్డుతో పేమెంట్స్... మీరూ యాక్టివేట్ చేయండి ఇలా

అధిక-విలువ చెక్కును జారీ చేసే వ్యక్తి జారీ చేసిన తేదీతో సహా వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా వివరాలు సమర్పించవచ్చు. ఆ తర్వాత సదరు వ్యక్తి చెక్‌ను బ్యాంకులో సమర్పించినప్పుడు వివరాలు ధృవీకరించబడతాయి. వివరాలు సరిపోలితే సదరు వ్యక్తికి డబ్బులు ఇస్తారు. లేకపోతే చెక్కు చెల్లించకుండా తిరిగి వెనక్కి పంపిస్తారు. ఈ ప్రాసెస్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) రూపొందించింది.

ఆర్‌బీఐ పాజిటీవ్ పే సిస్టమ్‌ను 2021 జనవరి 1న అమలు చేసింది. రూ.50,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు ఈ విధానం పాటించాలని సూచించింది. అయితే ఇది తప్పనిసరిగా లేదు. ఆగస్ట్ 1 నుంచి రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు తప్పనిసరిగా పాజిటీవ్ పే సిస్టమ్ పాటించాల్సిందే. ఈమేరకు పలు బ్యాంకులు 2022 ఆగస్ట్ 1 నుంచి రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్కులకు పీపీఎస్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తున్నాయి.

How to Withdraw Money From PF Account Online: మీ ఇంటి నుంచే మీ పీఎఫ్ డబ్బులు ఈజీగా డ్రా చేయండి ఇలా

ఇకపై మీరు ఎవరికైనా రూ.5,00,000 కన్నా ఎక్కువ విలువైన చెక్ ఇస్తే ఇమెయిల్, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆ వివరాలను బ్యాంకుకు కూడా తెలపాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్, చెక్ నెంబర్, చెక్ పైన ఉన్న తేదీ, అమౌంట్, ట్రాన్సాక్షన్ కోడ్, బెనిఫీషియరీ పేరు, ఎంఐసీఆర్ కోడ్ లాంటి వివరాలను వెల్లడించాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank of Baroda, Cheque, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు