హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్... మీకు ఆ మెసేజ్ వస్తే జాగ్రత్త (ప్రతీకాత్మక చిత్రం)

SBI Alert | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల ఓ ఫేక్ మెసేజ్ సర్క్యులేట్ అవుతుంది. ఆ మెజేస్ నిజమని నమ్మితే చిక్కుల్లో పడటం ఖాయం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు అలర్ట్. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్‌బీఐలో 40 కోట్లకు పైగా ఖాతాదారులున్న సంగతి తెలిసిందే. దీంతో సైబర్ నేరగాళ్లు ఎస్‌బీఐ అకౌంట్‌హోల్డర్లను టార్గెట్ చేస్తున్నారు. ఏదో ఒక మెసేజ్ పంపి ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు పాన్ కార్డ్ అప్‌డేట్ (PAN Card Update) పేరుతో ఇమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు పంపిస్తున్నారు. మీ ఎస్‌బీఐ యోనో అకౌంట్ క్లోజ్ అయిందని, వెంటనే మీ పాన్ కార్డ్ అప్‌డేట్ చేయాలని ఇమెయిల్స్, ఎస్ఎంఎస్‌లు ఎస్‌బీఐ ఖాతాదారులకు వస్తున్నాయి.

సైబర్ నేరగాళ్లు పాన్ కార్డ్ అప్‌డేట్ చేయాలంటూ ఎస్‌బీఐ ఖాతాదారులకు లింక్స్ కూడా పంపిస్తున్నారు. ఆ లింక్స్ క్లిక్ చేస్తే అంతే సంగతులు. లింక్ క్లిక్ చేయగానే ఓ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. అందులో బ్యాంకు ఖాతా వివరాలు ఎంటర్ చేయాలని సైబర్ నేరగాళ్లు కోరతారు. కీలకమైన బ్యాంక్ అకౌంట్ వివరాలు, పాన్ నెంబర్, డెబిట్ కార్డ్ నెంబర్, సీవీవీ లాంటి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సైబర్ నేరగాళ్లు అకౌంట్ ఖాళీ చేయడం గ్యారెంటీ.

Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్న ఎస్‌బీఐ

అందుకే ఇలాంటి మెసేజెస్, మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఈ మెసేజెస్, ఇమెయిల్స్‌కు స్పందించకూడదని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ వివరాలు వెల్లడించకూడదని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం అయిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Factcheck) హెచ్చరిస్తోంది. ఒకవేళ మీకు పదేపదే ఇలాంటి మెసేజెస్ వస్తే report.phishing@sbi.co.in మెయిల్ ఐడీకి కంప్లైంట్ చేయాలి.

ఒకవేళ మీ ఎస్‌బీఐ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ చేయనట్టైతే ఆన్‌లైన్‌లో లింక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Step 1- ముందుగా https://www.onlinesbi.sbi/ పోర్టల్ ఓపెన్ చేయాలి.

Step 2- మీ వివరాలతో లాగిన్ కావాలి.

Step 3- ఆ తర్వాత మై అకౌంట్స్ సెక్షన్‌లో ప్రొఫైల్ ఓపెన్ చేయాలి.

Step 4- ఆ తర్వాత PAN Registration పైన క్లిక్ చేయాలి.

Step 5- అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేయాలి.

Step 6- పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

Business Loan: బిజినెస్ చేస్తారా? రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్న ఎస్‌బీఐ

మీ రిక్వెస్ట్ బ్రాంచ్‌కు వెళ్తుంది. ఏడు రోజుల్లో మీ అకౌంట్ నెంబర్‌కు పాన్ నెంబర్ లింక్ అవుతుంది. మీ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ అవగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్‌బీఐ ఏటీఎంలో కూడా దాదాపు ఇవే స్టెప్స్‌తో మీ పాన్ నెంబర్ లింక్ చేయొచ్చు. లేదంటే మీరు నేరుగా దగ్గర్లోని ఎస్‌బీఐ బ్రాంచ్‌కు వెళ్లాలి. ఫామ్ పూర్తి చేసి, మీ పాన్ కార్డ్ జిరాక్స్ కాపీ జత చేసి సబ్మిట్ చేయాలి. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత మీ అకౌంట్‌కు పాన్ నెంబర్ లింక్ అవుతుంది.

First published:

Tags: Fact Check, PAN card, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు