హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి డబ్బులు కట్... మీ స్టేట్‌మెంట్ చెక్ చేశారా?

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి డబ్బులు కట్... మీ స్టేట్‌మెంట్ చెక్ చేశారా?

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి డబ్బులు కట్... మీ స్టేట్‌మెంట్ చెక్ చేశారా?
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Account: ఎస్‌బీఐ అకౌంట్ నుంచి డబ్బులు కట్... మీ స్టేట్‌మెంట్ చెక్ చేశారా? (ప్రతీకాత్మక చిత్రం)

SBI Account | ఎస్‌బీఐ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఖాతాదారులు స్టేట్‌మెంట్ చెక్ చేసి ఖంగుతింటున్నారు. అసలు డబ్బులు ఎందుకు కట్ అయ్యాయని ఆరా తీస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

బ్యాంకులో అకౌంట్, అందులో బ్యాలెన్స్ ఉంటే సరిపోదు. మీ బ్యాలెన్స్ సరిగ్గానే ఉందా చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో (Bank Account) పడే డబ్బులకు, డెబిట్ అయ్యే మొత్తానికి సంబంధించిన ప్రతీ మెసేజ్ మీకు రాకపోవచ్చు. అందుకే ఎప్పటికప్పుడు స్టేట్‌మెంట్ చెక్ చేస్తూ ఉండటం మంచిది. మరి మీరు ఇటీవల ఎప్పుడైనా మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ చెక్ చేశారా? ఇలాగే ఎస్‌బీఐ ఖాతాదారులు తమ అకౌంట్ స్టేట్‌మెంట్ చెక్ చేస్తే అందులో రూ.147.50 డెబిట్ అయినట్టు కనిపించింది. దీంతో ఖాతాదారులు ఖంగుతిన్నారు. తమ అకౌంట్‌లో రూ.147.50 ఎందుకు డెబిట్ అయ్యాయో అని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

ఎస్‌బీఐ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్. ఎస్‌బీఐలో 45 కోట్లకు పైగా ఖాతాదారులున్నారు. ఎస్‌బీఐ ఖాతాదారులకు అందించే సేవలన్నీ ఉచితం కావు. కొన్ని సేవలకు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ ఖాతాదారుల అకౌంట్ నుంచి రూ.147.50 కట్ చేయడానికి ఇదే కారణం. ఎస్‌బీఐ వసూలు చేసే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు ఇవి. ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉపయోగించేవారి నుంచి ఈ ఛార్జీ వసూలు చేస్తుంది బ్యాంకు . ఖాతాదారులు ఏడాదికోసారి రూ.147.50 ఛార్జీ చెల్లించాలి. ఈ ఛార్జీలు ఆటోమెటిక్‌గా బ్యాంక్ అకౌంట్‌లోని బ్యాలెన్స్ నుంచి డెబిట్ అవుతాయి.

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో రూ.63 లక్షల రిటర్న్స్... పొదుపు ఇలా ప్లాన్ చేయండి

ఎస్‌బీఐ నుంచి క్లాసిక్, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్‌లెస్ పేర్లతో పలు డెబిట్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డులకు ప్రతీ ఏటా మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించాల్సిందే. వాస్తవానికి యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీ రూ.125. అదనంగా 18 శాతం జీఎస్‌టీ రూ.22.50 కలిపి మొత్తం రూ.147.50 వసూలు చేస్తుంది బ్యాంకు.

ఎస్‌బీఐ నుంచి యువ, గోల్డ్, కాంబో, మైకార్డ్ పేర్లతో కూడా ఇతర డెబిట్ కార్డులు ఉన్నాయి. వీటికి రూ.175+జీఎస్‌టీ చెల్లించాలి. ప్లాటినమ్ డెబిట్ కార్డుకు రూ.250+జీఎస్టీ, ప్రైడ్, ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డులకు రూ.350+జీఎస్‌టీ చొప్పున ఛార్జీలు చెల్లించాల్సిందే. ఎస్‌బీఐ ఖాతాదారులు డెబిట్ కార్డ్ రీప్లేస్ చేయాలన్నా, మార్చాలన్నా రూ.300+జీఎస్‌టీ చెల్లించాలి.

ఎస్‌బీఐలో సిగ్నేచర్, సాలరీ ప్యాకేజీ అకౌంట్‌తో లింక్ అయిన ఉన్న డెబిట్ కార్డులకు యాన్యువల్ మెయింటనెన్స్ ఛార్జీలు ఉండవు. డూప్లికేట్ పిన్ లేదా బ్రాంచ్‌లో పిన్ జనరేషన్ కోసం రూ.50+ జీఎస్‌టీ చెల్లించాలి. తప్పుడు అడ్రస్ కారణంగా ఏటీఎం కార్డ్ లేదా కిట్ డెలివరీ కాకపోతే రూ.100+ జీఎస్‌టీ చెల్లించాలి.

Account Balance: అకౌంట్‌లో డబ్బులు లేవా? అయినా రూ.10,000 డ్రా చేయొచ్చు

ఇవే కాదు ఎస్‌బీఐ మరిన్ని ఛార్జీలు వసూలు చేస్తుంది. యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రూ.1 లక్ష వరకు మెయింటైన్ చేసేవారికి ఎస్‌బీఐ ఏటీఎంలల్లో 5 ట్రాన్సాక్షన్స్ ఉచితం. ఇతర ఏటీఎంలల్లో మెట్రో నగరాల్లో 3 లావాదేవీలు ఉచితం. ఇతర ప్రాంతాల్లో 5 లావాదేవీలు ఉచితం. రూ.1 లక్ష కన్నా ఎక్కువ మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే అన్‌లిమిటెడ్ లావాదేవీలు ఉచితం.

ఎస్‌బీఐ ఇచ్చే లిమిట్ దాటిన తర్వాత ప్రతీ లావాదేవీకి ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.20, నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.5, ఇతర బ్యాంక్ ఏటీఎంలో రూ.8 చెల్లించాలి. పన్నులు అదనం.

First published:

Tags: Bank account, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు